Green tea గ్రీన్ టీ ని బరువు తగ్గించడానికి ఎలా తయారు చేసుకోవాలి

green-tea-weight-loss

Green tea weight loss telugu మీ బరువును తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది ఇందులో ఉండే EGCG అనే పదార్థం మీ జీవక్రియ రేటు పెంచి అదనంగా ఉండే కొవ్వును కరిగిస్తుంది అంతేకాదు Green tea మన శరీరానికి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది

దీనిలో ఉన్న యాంటీఆక్సిడాంట్స్ రోగనిరోధక శక్తి పెంచడానికి దోహదపడుతుంది అలాగే ఇన్ఫెక్షన్ల బారినుండి రక్షిస్తుంది అంతేకాదు ఇది శరీరంలోని క్యాన్సర్ కారకాలతో పోరాడి క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందకుండా నిరోధిస్తుంది. శరీరంలో ఏర్పడే కొవ్వును తొలగించి, తద్వారా శరీరం అధిక బరువు సమస్య నుంచి కాపాడుతుంది. ఇది జీవక్రియలో పాల్గొని కొవ్వు పదార్థాల నుండి ఎక్కువ క్యాలరీలను కరిగిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు కాఫీ, టీలకు బదులుగా Green tea నీ తాగడం వల్ల చక్కని ఫలితాలు పొందవచ్చు

బరువును తగ్గించడానికి గ్రీన్ టీ తయారు చేసుకోడానికి పదార్ధాల యొక్క ప్రయోజనాల గురించి తెలిసుకుందాం :

గ్రీన్ టీ – నిమ్మకాయ

ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఇది మీ శరీరంలో ఉన్న మరింత కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్ జర్నల్ లో ప్రచురించబడిన 2005 అధ్యయనం ప్రకారం నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఇది మనం వ్యాయామం చేసే సమయంలో 30 శాతం మరింత కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది.

గ్రీన్ టీ –తేనె

బరువు నియంత్రణలో ఉంచుకోవాలి అని అనుకునేవారికి తేనే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బరువు నియంత్రణలో ఉంచడం తేనే యొక్క ముఖ్య ప్రయోజనాలలో ఒకటి! మీరు అధిక బరువు ఉన్నట్లయితే, తేనె మీ బరువు ను తగ్గిస్తుంది అంతేకాదు హృదయ సంబంధ రుగ్మతల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు వేడి నీటిలో మూడు టీ స్పూన్ తేనెను కలుపుకుని తాగితే మీ బరువు ని వేగంగా తగ్గడానికి ఉపయోగపడుతుంది కానీ దీని కన్నా గ్రీన్ టీలో వేసుకుని తాగితే ఉత్తమ ఫలితాలు పొందవచ్చు

గ్రీన్ టీ – దాల్చిన చెక్క

శరీరంలో కొవ్వును తగ్గించడంలో దాల్చిన చెక్క ఒక ముఖ్య పాత్రను పోషిస్తుంది కానీ దాల్చిన చెక్క ఒక్కటే తీసుకోవడం ద్వారా ఈ ఫలితాలు పొందలేము తక్కువ కేలరీలు తినడం మరియు ఒక ఖచ్చితమైన వ్యాయామం తప్పనిసరిగా చెయ్యాలి.

గ్రీన్ టీ తయారు చేసుకోడానికి పదార్ధాల యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం కదా గ్రీన్ టీ నిమ్మరసం కచ్చితంగా మీ బరువు తగ్గించడానికి 100% సహాయపడుతుంది. మరి ఈ పానీయం ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం

బరువు తగ్గించడానికి ఇంట్లో green tea weight loss telugu ఎలా తయారు చేసుకోవాలి?

కావాల్సిన పదార్థాలు

  • నీళ్లు – 2 కప్స్
  • గ్రీన్ టీ బ్యాగ్ – 1
  • తేనె – 2 నుండి 3 టీ స్పూన్
  • నిమ్మకాయ – చిన్నది అయితే 2 పెద్దది 1 నిమ్మకాయ
  • దాల్చిన చెక్క – ½ అంగుళం

దాల్చిన చెక్క – ½ అంగుళం

  1. ముందుగా గిన్నెలో రెండు గ్లాసుల నీటిని ఒక్క నిమిషం పాటు మరగనివ్వాలి
  2. మంటను తగ్గించి గ్రీన్ టీ పొడి వేసి ఒకటి నుంచి రెండు నిమిషాలు ఉంచండి
  3. ఇప్పుడు గ్రీన్ టీ వడకట్టి ;క్లాసులోకి తీసుకోండి
  4. వచ్చిన పానీయంలో నిమ్మకాయ రసం మరియు రెండు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి తేనెనూ కలపండి

ఎలా ఉపయోగించాలి?

ఇలా తయారు చేసుకున్న గ్రీన్ టీ నీ ఉదయం లేవగానే మరియు సాయంత్రం సమయంలో తీసుకోవాలి ఇది మీ శరీరంలో ఉన్న కొవ్వును కరిగిస్తుంది కానీ ఉదయం వ్యాయామం చేసే 30 నిమిషాల ముందు ఈ గ్రీన్ టీని తాగితే వ్యాయామం చేసే సమయంలో ఇది ఇంధనంగా పనిచేసి త్వరగా మీ శరీరంలో ఉన్న కొవ్వుని కరిగిస్తుంది..

బరువును తగ్గించడానికి గ్రీన్ టీ – అదనపు చిట్కాలు

మీకు కావాలంటే ఒక చిటికెడు కారపు పొడి కూడా మీ గ్రీన్ టీ లో వేసుకోవచ్చు దీనివల్ల అదనపు ఉపయోగాలు పొందుతారు

మీకు కావాలంటే ఎక్కువ శాతం తయారు చేసుకుని ఫ్రిజ్లో పెట్టుకొని కావాల్సి అప్పుడు ఒకటి రెండు గ్లాసుల గ్రీన్ టీ త్రాగవచ్చు

అతి ముఖ్యమైనది ఏమిటంటే మీరు తీసుకున్న గ్రీన్ టీ మంచి కంపెనీ అయి ఉండాలి మీ గ్రీన్ టీ బ్యాంక్ లేదా పొడి మంచి క్వాలిటీ లేకపోతే ఎలాంటి ఫలితం ఉండదు కాబట్టి Lipton green tea, 24 Mantra Organic Green Tea, Herbal Green Tea లాంటి కంపెనీ ఎంచుకోండి..

మీరు గ్రీన్ టీ బాగ్ ఉపయోగించిన తర్వాత వాటిని పడే వద్దు గ్రీన్ టీ బాగ్ తో శరీరానికి అందానికి ఉపయోగపడే చాలా ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోవచ్చు

కొబ్బరినూనె కూడా బరువును తగ్గించడానికి సహాయపడుతుంది గ్రీన్ టీ లో ఒకటి లేదా రొండు teaspoon టీస్పూన్ కొబ్బరినూనె వేసుకుని త్రాగితే మంచి ఫలితాలను పొందవచ్చు
మీకు ఇంకా ఎలాంటి సందేహాలున్నా  ఉన్న కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి

మీకు ఇంకా ఎలాంటి సందేహాలున్నా ఉన్న కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి

చర్మం మరియు జుట్టు కోసం గ్రీన్ టీ యొక్క ఉపయోగాలు