చర్మం మరియు జుట్టు కోసం గ్రీన్ టీ యొక్క ఉపయోగాలు

green-tea

Benefits Beauty green tea skin hair telugu గ్రీన్ టీ లో దాగి ఉన్న అద్భుతమైన సౌందర్య రహస్యాలు

గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలిసిందే అయితే గ్రీన్ టీ పొడి లో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇంఫ్లేమేటరీ{anti-inflammatory}మరియు యాంటీబయాటిక్ గుణాలు ఉండడంవల్ల ఇది మన మన చర్మం కాంతివంతంగా చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది

ఈ మధ్య కాలంలో మనం అందరం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో వాతావరణ కాలుష్యం ఒకటీ, ఇలా మారుతున్న కాలుష్యం జీవనశైలిలో మార్పు వల్ల జుట్టు రాలిపోయి చుండ్రు ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇంకా జుట్టు పొడిబారిపోయి డ్రై గా తయారవుతుంది ఇలా అనేక సమస్యలను ఎదుర్కోవడానికి green tea పొడి చక్కని పరిష్కారం గా చెప్పవచ్చు జుట్టు ఆరోగ్యంగా ఒత్తుగా దృఢంగా పెరగడానికి గ్రీన్ టీ చాలా బాగా ఉపయోగపడుతుంది గ్రీన్ టీ ని ఉపయోగించి చక్కని హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు దీంతో జుట్టు రాలిపోవడం తగ్గుతుంది, చుండ్రు తగ్గుతుంది, ఇలా జుట్టుకు సంబంధించి అనేక సమస్యలు తగ్గిస్తుంది

Green tea – పొడిబారిన జుట్టు కోసం

Green-tea-for-Dry-hair

సాధారణంగా శిరోజాలు పలుచగా ఎండిపోయినట్టు ఉంటే దానిని డ్రై హెయిర్ అంటారు డ్రై హెయిర్ వల్ల జుట్టు చిట్లిపోవటం చిక్కుబడటం జరుగుతూ ఉంటుంది ఇలా చిక్కుపడిన జుట్టునీ దువ్వినప్పుడు రాలిపోతూ ఉంటుంది ఇలాంటి పరిస్థితి కొనసాగుతుంటే జుట్టు రాలిపోవడం మే కాకుండా జుట్టు చాలా పల్చగా అవుతుంది వీటి నుంచి జుట్టుని రక్షించుకోవడానికి మార్కెట్లో అనేక రకాల ఉత్పత్తులు ఉన్నాయి అయితే ఇవన్నీ రసాయనాలతో తయారుచేసినవి వీటితో మంచి కన్నా చెడే ఎక్కువ జరిగే అవకాశం ఉంది అలాకాకుండా మీ ఇంట్లోనే మీరు గ్రీన్ టీ ని ఉపయోగించి సహజసిద్ధమైన హెయిర్ ప్యాక్ ని తయారు చేసుకోవచ్చు ఇది ఉపయోగించడం వలన కేశాలు చక్కని తేమని సంతరించుకుని జుట్టు ఒత్తుగా నాజూగ్గా పెరుగుతుంది

కావలసినవి

 • గ్రీన్ టీ పొడి
 • కోడి గుడ్లలో పచ్చసోన
 • ½ tsp ఆవపిండి (mustard powder)

తయారు చేసుకునే విధానం

 1. గ్రీన్ టీ పొడి ని గిన్నెలో వేసుకోండి
 2. ఇందులో కోడిగుడ్డు పచ్చసొన మరియు ½ tsp ఆవపిండి వేసి బాగా కలపండి
 3. ఇలా వచ్చిన మిశ్రమంలో కొంచెం గ్రీన్ టీ డికాషన్ నీవేసి చక్కని పేస్టులా తయారు చేసుకోండి
 4. ఈ పేస్టునీ జుట్టుకి రాసుకుని 10-15 నిమిషాలు ఆరనివ్వండి తర్వాత ఏదేనా షాంపుతో తలస్నానం చేయండి

ఈ విధంగా వారానికి రెండుసార్లు లేదా మూడుసార్లు చేస్తే మీ కేశాలు తేమని సంతరించుకుని జుట్టు ఒత్తుగా నాజూగ్గా పెరుగుతుంది

ఒత్తైన జుట్టుని కోసం

Green-tea-for-Strong-hair-pack.

మీరు సాధారణంగా జుట్టుపెరగడానికి బయట కొనే ఉత్పత్తుల్లో B విటమిన్ కలిగి ఉంటుంది. గ్రీన్ టీ లో B విటమిన్ కలిగి ఉంటుంది ఇది మీ జుట్టు చివరలను పెరగడానికి సహాయపడుతుంది, మీ జుట్టును మృదువుగా చేస్తుంది మరియు మీ జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది

కావలసినవి

 • గ్రీన్ టీ

తయారు చేసుకునే విధానం

 1. ఒక మూడు కప్పుల నీళ్లు తీసుకోండి
 2. అందులో రెండు గ్రీన్ టీ పొడి వేసి పది నిమిషాలు బాగా మరగనివ్వండి
 3. తలస్నానం చేయడం పూర్తయిన తర్వాత ఇలా సిద్ధం చేసుకున్నారు గ్రీన్ నీళ్లన్నీజుట్టు కుదురులు కి రాసుకుని చేతి వేలితో గుండ్రంగా మసాజ్ చేసుకోండి తర్వాత చల్లని నీటితో తలను శుభ్రం చేసుకోండి

జుట్టు పెరుగుట కోసం

Green-tea-for-hair-growth

గ్రీన్ టీలో అనేది యాంటిఆక్సిడెంట్ “EGCG” (లేదా ఎపిగాలోకేచ్చిన్ గ్యలేట్) ను కలిగి ఉంటుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు, ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

కావలసినవి

 • కొబ్బరినూనె
 • గ్రీన్ టీ పొడి

తయారు చేసుకునే విధానం

 1. మీ జుట్టుకు సరిపడా కొబ్బరినూనె తీసుకోండి
 2. ఇప్పుడు ఈ కొబ్బరినూనెను తగినంత గ్రీన్ టీ పొడి నీ వెయ్యండి
 3. బాగా కలిపి పాక్ లాగా తలకి అప్లై చేయండి
 4. 20 నుంచి 30 నిమిషాల ఆరనివ్వండి
 5. తర్వాత షాంపూతో శుభ్రం చేసుకోండి
 6. ఇలా వారానికి రెండుసార్లు చొప్పున క్రమం తప్పకుండా apply చేయండి

Green tea – చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది

Green-tea-for-glowing-skin

Green tea మీ చర్మాన్ని ఆరోగ్యంగా కాంతివంతంగా చేస్తుంది మరియు మీ చర్మంలో ఉండే హానికరమైన రసాయనాలు బ్యాక్టీరియా బయటికి పంపి చర్మం శుభ్రంగా ఉండేలా చేస్తుంది ఇది ముఖ్యంగా సిటీలో ఉన్న కాలుష్యం నుంచి వచ్చే హానికరమైన పదార్థాలను నుంచి అని చర్మాన్ని కాపాడుతుంది అలాగే చర్మంలో చర్మంపే ఉండే పెద్ద రంధ్రాలను తగ్గిస్తుంది.

కావలసినవి

 • గ్రీన్ టీ
 • తేనె
 • నిమ్మరసం

తయారు చేసుకునే విధానం

 1. ఉపయోగించిన గ్రీన్ టీ బాగ్ కత్తిరించి అందులో ఉన్న గ్రీన్ టీ పొడిని ఒక గిన్నెలోకి తీయండి
 2. అందులో 1 లేదా 2tsp తేనెను కలపండి
 3. దీనిలో కొద్దిగా నిమ్మరసం కలపండి.
 4. ఇలా మూడు పదార్ధాలు కలిపి చక్కని పేస్ట్లా చేసి మీ ముఖానికి రాసుకోండి
 5. పది 15 నిమిషాలు ఉన్న తర్వాత చల్లని నీటితో నీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి

కళ్ళకింద నల్లమచ్చలు

Green-tea-for-glowing-skin

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్ మరియు టానిన్సు (ఒక రక్తస్రావ నివారిణి) ఉంటాయి ఇవి ఉబ్బిన కళ్ళు అలాగే కళ్ళు కింద ఏర్పడే నల్లని మచ్చలను తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి అదనంగా గ్రీన్ టీ లో విటమిన్-కె ఉంటుంది కాబట్టి ఇది మన రక్తప్రసరణ బాగా జరిగేలా చేసి కంటి కింద ఉన్న నల్లటి మచ్చలు తగ్గిస్తుంది.

కావలసినవి

 • గ్రీన్ టీ బగ్స్

తయారు చేసుకునే విధానం

 1. రెండు వాడేసిన గ్రీన్ టీ బాగ్స్ తీసుకోండి
 2. ఒక అరగంట సేపు ఫ్రిజ్లో పెట్టి
 3. ఒక్క 15 నిమిషాలు చల్లని టీ సంచులను మీ కనురెప్పల మీద ఉంచండి..

కళ్ళకింద నల్లని మచ్చలు తగ్గేవరకూ రోజుకి రెండుసార్లు ఇలా చేయండి

ముఖ్యంగా నిద్ర సరిగ్గా లేని వారిలో కళ్ళకింద నల్ల మచ్చలు ఏర్పడతాయి అలాగే విటమిన్ కె రక్తప్రసరణ సరిగ్గా లేని వారిలో ఈ కళ్ల కింద మచ్చలు ఎక్కువగా ఏర్పడతాయి చెప్పిన పరిష్కారం పాటించడం ద్వారా మీరు త్వరగా ఉత్తమ ఫలితాలను పొందుతారు

ముఖం పై ముడతలను మాయం

Green-tea-for-anti-aging

గ్రీన్ టీ లో యాంటీ ఏజింగ్ మరియు యాంటీ ఆక్సిడెంట్ ప్రయోజనాలు ఉన్నాయి దీనివల్ల మీ చర్మాన్ని ప్రకాశవంతంగా చేసి ముఖం పై ఉన్నా ముడతలు మరియు సూర్యుడు వేడివల్ల ఏర్పడే నల్లని మచ్చలను తగ్గిస్తుంది అలాగే స్కిన్ క్యాన్సర్ రాకుండా చేస్తుంది.

కావలసినవి

 • పెరుగు 3tsp
 • గ్రీన్ టీ పొడి
 • చిటికెడు పసుపు

తయారు చేసుకునే విధానం

 1. 3 tsp పెరుగు తీసుకుని
 2. అందులో గ్రీన్ టీ పొడి మరియు చిటికెడు పసుపు
 3. ఈ మూడు మిశ్రమాన్ని బాగా కలిపి పాస్ట్ లాగ తయారు చేసుకోండి
 4. ఈ పేస్టుని మొహం మొత్తం ఫేస్ ప్యాక్ ల రాసుకోండి
 5. 20 నిమిషాలు బాగా ఆరిన తర్వాత చల్లని నీటితో మొహాన్ని శుభ్రం చేసుకోండ

(ఇంకో పద్ధతి)

కావలసినవి

 • గ్రీన్ టీ పొడి

తయారు చేసుకునే విధానం :-

 1. గ్రీన్ టీ పొడి ని తీసుకుని
 2. అందులో కొబ్బరి నూనె మరియు ఒకటి లేదా రెండు చెంచాల గోరు వెచ్చని నీళ్లు వేసి
 3. మెత్తగా పేస్ట్ లా తయారు చేయండి
 4. వచ్చిన పేస్ట్ మొహం మొత్తం ఫేస్ ప్యాక్ ల రాసుకోండి
 5. మొత్తం పూర్తిగా ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో మహాని శుభ్రం చేసుకోండి.

ఇది మొహం మీద ముడతలు మరియు పొడిబారిన చర్మం ఉన్నవారికి ఇది బాగా పనిచేస్తుంది

మొఖం మీద మొటిమలు – Green tea for Acne

Green-tea-for-Acne.jpg

గ్రీన్ టీ లో ఉన్న కాటెచిన్స్ ఏంటి-బ్యాక్టీరియా లాగా పనిచేస్తుంది. ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సక్రమంగా ఉండేలా చేసి మొఖం మీద మొటిమలు పూర్తిగా తగ్గిస్తుంది. అలాగే చాలామందికి మొటిమలు తగ్గిన తర్వాత ఆ ప్రాంతంలో ఎర్రని మచ్చలు ఉండిపోతు ఉంటాయి ఇందులో ఉన్న కేక్ కటింగ్ అనే పదార్ధం వల్ల మీ చర్మంపై ఉన్న ఎర్రని మచ్చలు తగ్గించడంలో సహాయపడుతుంది

కావలసినవి

 • గ్రీన్ టీ పొడి

తయారు చేసుకునే విధానం

 1. ఒక ¼ కప్ తాజాగా గ్రీన్ టీ పొడి ని తీసుకుని అందులో సరిపడా నీళ్లు పోసి మెత్తని పేస్టులాగా తయారు చేసుకోండి
 2. మొటిమలు ఉన్న ప్రాంతంలో పేస్టును రాయండి
 3. 10 నుండి 15 నిముషాల ఉన్న తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోండి.
 4. ఇలా రోజుకు రెండుసార్లు రాసుకోండి
25 Aloe vera health benefits అద్భుతమైన కలబంద ఉపయోగాలు