-

Vitamin విటమిన్లు పోషక పదార్థాలు ఉపయోగాలు

Advertisement

విటమిన్లు ఉపయోగాలు

vitamin పోషక పదార్థాలను విటమిన్లు అంటారు. ఇవి మన శరీరంలో జరిగే మార్పులలో కీలకపాత్ర వహిస్తాయి, ఈ పోషక పదార్థాలు మన ఆరోగ్యాన్ని సంక్రమంగా వుండేలా చేస్తాయి.

వీటిని A-విటమిన్, B- విటమిన్, C-విటమిన్, D-విటమిన్, E-విటమిన్, K -విటమిన్ అని వ్యవహరించడం జరుగుతుంది.

వీటి గురించి, వీటిలో పాల వలన కలిగే అనారోగ్యాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. వీటిని గురించి తెలుసుకుని ఈ విటమిన్లుగల ఆహారపదార్థాలను తీసుకుంటే ఎన్నో అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చు

A – vitamin విటమిన్

A - విటమిన్

మనం తీసుకునే ఆహారంలో A – విటమిన్ లోపిస్తే అంధత్వానికి దారితీస్తుంది. తక్కువ కాంతిలో, లేదా రాత్రులు చూపు అనకపోవడం, హ్రస్వ, దూరదృష్టిలు కలగడం ఈ విటమిన్ లోపం వలనే జరుగుతుంది.

చూడటానికి కళ్ళు కాంతివిహీనంగా కనబడటం, పొడిగా, గరుకు వుండటం దీని లక్షణాలు.

కేరెట్, తోటకూర, పాలకూర, ములగాకు, బాగా పండిన మామిడి, టమోటా, బొప్పాయి పండు, వెన్న, నెయ్యి, పాలల్లో A-విటమిన్ అధికంగా ఉంటుంది.

B – vitamin విటమిన్

B - విటమిన్ Vitamin B

మనం తీసుకునే ఆహారంలో B – విటమిన్ లోపించినట్లయితే- ఆకలి మందగించడం, కాళ్లూ చేతులు మెద్దుబారటం, గుండెదడ, అలసట, నీరసం వంటి లక్షణాలు కనబడతాయి.

ధాన్యపు పై పొరలలోనూ, గింజలు, వేరుశనగ, మాంసము, గ్రుడ్లు, దంపుడు బియ్యం, ఉప్పుడు బియ్యంలో ఈ విటమిన్ అధికంగా ఉంటుంది.

B2 – vitamin విటమిన్ ఇందులోనే ‘రైబో లిన్’ అనే విటమిన్

దీని లోపం వలన నాలుకమీద పుండ్లు పడుట, నోటి పెదవులు మూలల్లో పగలడం, కళ్ళు మండటం, చర్మ పై పొలుసులు ఏర్పడటం జరుగుతుంది. ఆకుకూరలు, మొక్కల చిగుళ్ళు, పాలు, కాలేయము, గ్రుడ్లలో ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది.

‘పిరిడాక్సిన్’ అనే విటమిన్ ని B6 – విటమిన్ అంటారు. దీని లోపం వలన నోటిమూలల్లో పగలడం, రక్తహీనత, చిన్నపిల్లల్లో ఫిట్స్ వంటి వ్యాధులు ఏర్పడతాయి.

  • తాజా కాయగూరలు, గ్రుడ్డుసొనలో ఈ విటమిన్ ఎక్కువగా లభిస్తుంది

B12 – vitamin విటమిన్  కోబాలమిన్, సైనకోబాలమిన్’ 

- Advertisement -

దీని లోపం వలన… విపరీతమైన రక్త హీనత ఏర్పడుతుంది. కేంద్ర నాడీమండలం సక్రమంగా పనిచేయాలంటే ఈ విటమిన్ ఎంతో

* పాలు, మాంసము, కాలేయము మొదలైన వాటిలో ఈ విటమిన్ ఎక్కువగా లభిస్తుంది.

C – vitamin

మనం తీసుకునే ఆహారంలో C – విటమిన్ లోపం వలన జలుబు మొదలుకుని తీవ్రమైన అంటువ్యాధుల వరకూ గురికావడం జరుగుతుంది. దీని లోపం వలన నోట్లో పుండు పడటం, పంటి చిగుళ్లనుండి రక్తం కారడం, దంతాలు కదలడం… చర్మం క్రిందనుండే కేశనాళాలు చిట్లడం, తల తిరుగుతున్నట్లు, వాంతి వస్తున్నట్లుండటం జరుగుతుంది.

* నిమ్మ, నారింజ, టమోటా, ఉసిరి, బొప్పాయి, జామ, ఆకుపచ్చని కాయగూరల్లో ఇది ఎక్కువగా లభిస్తుంది.

D – vitamin

vitamin d

చిన్నపిల్లల్లో ఈ విటమిన్ లోపం వలన ‘రికేట్స్’ అనే వ్యాధి వస్తుంది. దీనివలన మణికట్టు దగ్గర వాపు, దొడ్డికాళ్ళు ఏర్పడతాయి. పెద్దవారిలో ఎముకల బలం కోల్పోవడం… పెళుసుబారి సులువుగా విరగడం జరుగుతుంది.

* కాలేయము, చేపలు, చేపనూనె, గ్రుడ్లు, పాలలో ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ‘షార్క్’ చేప నూనెలో అధికంగా ఉంటుంది.

E – vitamin

మనం తీసుకునే ఆహారంలో C- విటమిన్ లోపం వలన ముఖ్యంగా పురుషులలో బీజకణాల అభివృద్ధి సరిగా లేకపోవడం, ఆడవారిలో గర్భస్రావాలు కావడం జరుగుతుంది.

పళ్ళు, కూరగాయలు, విత్తనాలు, సూర్యకాంతపు మొక్క గింజలు, ప్రత్తిగింజలు… కుసుమ నూనే… గింజలనుండి తీసిన నూనె, మాంసములలో ఈ విటమిన్ ఎక్కువగా మనకు లభ్యమవుతుంది.

K – vitamin

ఈ విటమిన్ లోపం వలన రక్తం తొందరగా గడ్డ కట్టదు. ఆపరేషన్ చేసే సమయాల్లో డాక్టర్లు ఈ విటమిన్ రోగికి ఇవ్వడం జరుగుతుంది. పుష్టికరమైన ఆహారాన్ని తీసుకోవడం వలన ఈ విటమిన్ లభిస్తుంది.

పైన చెప్పిన విటమిన్ల లోపాలు లేకుండా తగిన ఆహారం తీసుకుంటే దాదాపుగా ఏ వ్యాధులు వచ్చే అవకాశం లేదు. ముఖ్యంగా ఆకుకూరలు, పాలు, గ్రుడ్లు… వీటితో పాటు ఏ సీజన్లో వచ్చే పళ్ళను ఆ సీజన్లో ఎక్కువగా తీసుకోవాలి. రోజూ ఒకే రకమైన ఆహారం తీసుకుంటున్నా అన్ని విటమిన్లు మనకు లభ్యంకావు. రోజూ విభిన్నంగా ఆహారం తీసుకుంటుంటే మన శరీరానికి అన్ని రకాల ఖనిజ, పోషక పదార్థాలు లభ్యమవుతాయి.

belly fat పొట్టలోని కొవ్వును కరిగించే 5 ఆహారం పదార్థాలు

- Advertisement -

తప్పకుండా కామెంట్ చేయండి 🙋‍♀️ 🙋‍♂️🙋‍♀️ 🙋‍♂️🙋‍♀️ 🙋‍♂️

Please enter your comment!
Please enter your name here

మా ఫేస్బుక్ పేజీ

26,990ఫాన్స్Like
389FollowersFollow
బరువు-తగ్గడానికి

కేవలం 10 రోజుల్లో బరువు తగ్గడానికి weight loss tips in telugu

కేవలం 10 రోజుల్లో బరువు తగ్గడానికి సాధారణ చిట్కాలు బరువు తగ్గాలి అనుకునేవారికి చాలామంది చాలా చిట్కాలు చెబుతూ ఉంటారు బరువు తగ్గడానికి ఈ పని చేయండి ఆ పని చేయండి అంటారు కానీ వాస్తవానికి చాలావరకు వాటి వెనుక శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఆరోగ్యంగా బరువు తగ్గడం అనేది...
senagapindi face pack

senagapindi face pack తో చర్మం కాంతివంతం 21 అద్భుతమైన ఫేస్ ప్యాక్

senagapindi face pack శెనగపిండిని 'besan' అని కూడా అంటారు. ఇది మచ్చలు, మొటిమలు, ఎండ వల్ల నల్లగా మారిన చర్మాన్ని మరియు అనేక చర్మ సమస్యలతో పోరాడుతుంది senaga pindi face pack గురించి చెప్పాలంటే చర్మ స‌మ‌స్య‌ల‌ను తగ్గించే అద్భుతమైన ఔషధం అని చెప్పవచ్చు శనగపిండిలో...
బరువు తగ్గడం కోసం apple cider vinegar

బరువు తగ్గడం కోసం Apple cider vinegar 5 అద్భుతమైన మార్గాలు

బరువు తగ్గడం కోసం apple cider vinegar apple cider vinegar బరువు తగ్గడానికి అద్భుతంగా పని చేస్తోంది. బరువు తగ్గడానికి 8000 BC నాటు నుంచే ఈజిప్షియన్లు దీనిని ఉపయోగించేవారు. ఈ పురాతనమైన ఆరోగ్య ఆపిల్ సైడర్ వెనిగర్ ఆపిల్ నీ పులియబెట్టి తయారుచేస్తారు ఇది మధుమేహం,రక్తపోటు, మరియు...
thati bellam వల్ల కలిగే 5 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Thati bellam తాటి బెల్లం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Thati Bellam Benefits తాటి బెల్లం ఇది మనం వాడుతున్న పంచదారకి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం రోజూ తినే పంచదార చెరుకు నుంచి తయారవుతుంది ఇలా తయారు చేసే సమయంలో ఇందులో ఉన్న పోషక విలువలు అన్నీ పోయి కేవలం తీపి...

Aloe vera జుట్టు పెరుగుదల కోసం కలబంద గుజ్జునీ ఎలా ఉపయోగించాలి ?

కలబంద గుజ్జు జుట్టు ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే దీనిని ఉపయోగించి సులభమైన ఇంటి చిట్కాలతో తలకి ఉపయోగించవచ్చు దీనిలో ఉండే అమైనో ఆమ్లాలు మరియు ప్రొటీలిటిక్ ఎంజైమ్ల మీ చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి మరియు జుట్టు పెరుగుదలను పెంచడానికి సమర్ధవంతంగా సహాయం చేస్తుంది. కలబంద గుజ్జును...