vitamin పోషక పదార్థాలను విటమిన్లు అంటారు. ఇవి మన శరీరంలో జరిగే మార్పులలో కీలకపాత్ర వహిస్తాయి, ఈ పోషక పదార్థాలు మన ఆరోగ్యాన్ని సంక్రమంగా వుండేలా చేస్తాయి.
- A-విటమిన్
- B- విటమిన్ (B1, B2, B3, B5, B6,B9 మరియు B12)
- C-విటమిన్
- D-విటమిన్
- E-విటమిన్
- K -విటమిన్ అని వ్యవహరించడం జరుగుతుంది.
వీటి గురించి, వీటి వలన కలిగే అనారోగ్యాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. వీటిని గురించి తెలుసుకుని ఈ విటమిన్లుగల ఆహారపదార్థాలను తీసుకుంటే ఎన్నో అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చు
A - vitamin విటమిన్

మనం తీసుకునే ఆహారంలో A – విటమిన్ లోపిస్తే అంధత్వానికి దారితీస్తుంది. తక్కువ కాంతిలో లేదా రాత్రులు చూపు అనకపోవడం, హ్రస్వ, దూరదృష్టిలు కలగడం ఈ విటమిన్ లోపం వలనే జరుగుతుంది. చూడటానికి కళ్ళు కాంతివిహీనంగా కనబడటం, పొడిగా, గరుకు వుండటం దీని లక్షణాలు.
విటమిన్ – A ఉపయోగాలు:
- కంటి చూపునకు తోడ్పడుతుంది
- గర్భధారణకు ఉపయోగపడుతుంది
- ఎముకల పెరుగుదలకు తోడ్పడుతుంది
- చర్మం కాంతివంతంగా ఉండటానికి అవసరం
A లభించే పదార్థాలు:
- కేరెట్
- తోటకూర
- పాలకూర
- ములగాకు
- బాగా పండిన మామిడి
- బొప్పాయి పండు
- వెన్న
B – vitamin విటమిన్

మనం తీసుకునే ఆహారంలో B - విటమిన్ లోపించినట్లయితే- ఆకలి మందగించడం, కాళ్లూ చేతులు మెద్దుబారటం, గుండెదడ, అలసట, నీరసం వంటి లక్షణాలు కనబడతాయి.
B లభించే పదార్థాలు
- గింజలు
- వేరుశనగ
- మాంసము
- గ్రుడ్లు
- దంపుడు బియ్యం
- ఉప్పుడు బియ్యంలో ఈ విటమిన్ అధికంగా ఉంటుంది.
B2 - vitamin విటమిన్ ఇందులోనే 'రైబో లిన్' అనే విటమిన్
దీని లోపం వలన నాలుకమీద పుండ్లు పడుట, నోటి పెదవులు మూలల్లో పగలడం, కళ్ళు మండటం, చర్మ పై పొలుసులు ఏర్పడటం జరుగుతుంది. ఆకుకూరలు, మొక్కల చిగుళ్ళు, పాలు, కాలేయము, గ్రుడ్లలో ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది.
'పిరిడాక్సిన్' అనే విటమిన్ ని B6 - విటమిన్ అంటారు. దీని లోపం వలన నోటిమూలల్లో పగలడం, రక్తహీనత, చిన్నపిల్లల్లో ఫిట్స్ వంటి వ్యాధులు ఏర్పడతాయి.
B2 లభించే పదార్థాలు
- తాజా కాయగూరలు
- గ్రుడ్డుసొనలో ఈ విటమిన్ ఎక్కువగా లభిస్తుంది
విటమిన్ B2 లోపం వల్ల కలిగే వ్యాధులు
- కీటోసిస్: నోరు మూలల్లో పగిలి రక్తస్రావం జరగడం
- గ్లాసైటిస్: నాలుక ఎర్రగా మారి పుండ్లు ఏర్పడి మెరవడం
B3 - vitamin విటమిన్
దీన్నే నియాసిన్ (Niacin or Nicotinic Acid) అని, నికోటిక్ ఆమ్లం, యాంటీ పెల్లాగ్రా విటమిన్ అని అంటారు.
విటమిన్ B3 లభించే పదార్ధాలు
- ఈస్ట్ అనే శిలీంధ్రం
- వేరుశనగ
- చిలగడదుంప
- పాలు
- గుడ్లు మొదలైనవి.
B3 లోపం వల్ల కలిగే వ్యాధులు:
- పెల్లాగ్రా: చర్మం వాచి పైపొర పొలుసుల్లా ఊడిపోవడం (DERMATITIS)
- మతిమరుపు. జ్ఞాపకశక్తి లోపం (DEME-TI-G)
- సోమ్నాంబులిజం: అంటే నిద్రలో లేచినడవడం
- డయేరియా/అతిసార: ప్రపంచంలో అధికంగా చిన్న పిల్లల మరణానికి కారణం
B5 - vitamin విటమిన్
దీన్ని పాంటోథినిక్ ఆమ్లం (Pantothenic Acid) అంటారు విటమిన్
B5 లభించే పదార్థాలు
- చిలగడదుంప,
- ఈస్ట్,
- వేరుశనగ విటమిన్ B5 ఉపయోగాలు:
- కార్బోహైడ్రేట్స్, ప్రొ
- టీన్స్
- ఫ్యాట్స్ జీవక్రియ
విటమిన్ B5 లోపం వల్ల కలిగే వ్యాధులు
- కంటి నొప్పి
విటమిన్ B6
దాన్ని పైరిడాక్సిన్ (Pyridoxine) అని, యాంటీ ఎనీమియా విటమిన్ (రక్తహీనత నిరోధక విటమిన్) అని అంటారు.
విటమిన్ B6 లభించే పదార్థాలు
- పప్పులు
విటమిన్ B6 ఉపయోగాలు
- ప్రొటీన్ల జీవక్రియ
- హిమోగ్లోబిన్ (HB), ప్రతి రక్షకాల తయారీ
విటమిన్ B6 లోపం వల్ల కలిగే వ్యాధులు
- రక్తహీనత
- పాలిచ్చే తల్లుల్లో B6 లోపం ఎక్కువ.
- ఆర్ బీసీల సంఖ్య తగ్గడం. దీన్ని మైక్రోసైటిక్ ఎనీమియాగా
విటమిన్ B9 (Vitamin B9)
దీనిని ఫోలిక్ ఆమ్లం (Folic Acid) అని, ఫోలేట్ అని అంటారు.
విటమిన్ B12 (Vitamin B12)
దీని లోపం వలన… విపరీతమైన రక్త హీనత ఏర్పడుతుంది. కేంద్ర నాడీమండలం సక్రమంగా పనిచేయాలంటే ఈ విటమిన్ ఎంతో
B12 లభించే పదార్థాలు
- పాలు మాంసము
- కాలేయము
- మొదలైన వాటిలో ఈ విటమిన్ ఎక్కువగా లభిస్తుంది.
C - vitamin

మనం తీసుకునే ఆహారంలో C - విటమిన్ లోపం వలన జలుబు మొదలుకుని తీవ్రమైన అంటువ్యాధుల వరకూ గురికావడం జరుగుతుంది. దీని లోపం వలన నోట్లో పుండు పడటం, పంటి చిగుళ్లనుండి రక్తం కారడం, దంతాలు కదలడం... చర్మం క్రిందనుండే కేశనాళాలు చిట్లడం, తల తిరుగుతున్నట్లు, వాంతి వస్తున్నట్లుండటం జరుగుతుంది.
C లభించే పదార్థాలు
- నిమ్మ
- నారింజ
- టమోటా
- ఉసిరి
- బొప్పాయి
- జామ
- ఆకుపచ్చని కాయగూరల్లో ఇది ఎక్కువగా లభిస్తుంది.
విటమిన్ C ఉపయోగాలు:
- కొల్లాజెన్ అనే ప్రొటీన్ తయారీ
- విరిగిన ఎముకలు అతికించడం
- గాయాలను మాన్పడం
- కోల్పోయిన భాగాలను తిరిగి అతికించడం
- వైరస్ నిరోధకం
- గుండె లయను నియంత్రించడం
- క్యాన్సర్/యాంటీ ఆక్సిడెంట్
- వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
- ఐరన్ శోషణ, రక్త ఉత్పత్తి
- కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
విటమిన్ C లోపం వల్ల కలిగే వ్యాధులు
స్కర్వీ(Scurvy): చిగుళ్లు వాచి రక్తస్రావం కరగడం, ఎముకలు, కండరాల నొప్పి, చర్మం పగలడం
D - vitamin

చిన్నపిల్లల్లో ఈ విటమిన్ లోపం వలన 'రికేట్స్' అనే వ్యాధి వస్తుంది. దీనివలన మణికట్టు దగ్గర వాపు, దొడ్డికాళ్ళు ఏర్పడతాయి. పెద్దవారిలో ఎముకల బలం కోల్పోవడం... పెళుసుబారి సులువుగా విరగడం జరుగుతుంది.
విటమిన్ – D లోపం వలన కలిగే వ్యాధులు
- చిన్న పిల్లల్లో రికెట్స్ (Rickets)
- Pigeon Chest (కపోత వక్షం)
E - vitamin

మనం తీసుకునే ఆహారంలో E- విటమిన్ లోపం వలన ముఖ్యంగా పురుషులలో బీజకణాల అభివృద్ధి సరిగా లేకపోవడం, ఆడవారిలో గర్భస్రావాలు కావడం జరుగుతుంది.
పళ్ళు, కూరగాయలు, విత్తనాలు, సూర్యకాంతపు మొక్క గింజలు, ప్రత్తిగింజలు… కుసుమ నూనే… గింజలనుండి తీసిన నూనె, మాంసములలో ఈ విటమిన్ ఎక్కువగా మనకు లభ్యమవుతుంది.
E - vitamin

ఈ విటమిన్ లోపం వలన రక్తం తొందరగా గడ్డ కట్టదు. ఆపరేషన్ చేసే సమయాల్లో డాక్టర్లు ఈ విటమిన్ రోగికి ఇవ్వడం జరుగుతుంది. పుష్టికరమైన ఆహారాన్ని తీసుకోవడం వలన ఈ విటమిన్ లభిస్తుంది.
పైన చెప్పిన విటమిన్ల లోపాలు లేకుండా తగిన ఆహారం తీసుకుంటే దాదాపుగా ఏ వ్యాధులు వచ్చే అవకాశం లేదు. ముఖ్యంగా ఆకుకూరలు, పాలు, గ్రుడ్లు… వీటితో పాటు ఏ సీజన్లో వచ్చే పళ్ళను ఆ సీజన్లో ఎక్కువగా తీసుకోవాలి. రోజూ ఒకే రకమైన ఆహారం తీసుకుంటున్నా అన్ని విటమిన్లు మనకు లభ్యంకావు. రోజూ విభిన్నంగా ఆహారం తీసుకుంటుంటే మన శరీరానికి అన్ని రకాల ఖనిజ, పోషక పదార్థాలు లభ్యమవుతాయి.
vinayaka chavithi pooja book telugu pdf మరియు 21 పత్రాల లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు