చర్మం కాంతివంతం చేసే 21 శెనగపిండి ఫేస్ ప్యాక్

senagapindi-face-pack

senagapindi face pack శెనగపిండిని ‘besan’ అని కూడా అంటారు. ఇది మచ్చలు, మొటిమలు, ఎండ వల్ల నల్లగా మారిన చర్మాన్ని మరియు అనేక చర్మ సమస్యలతో పోరాడుతుంది

senaga pindi face pack గురించి చెప్పాలంటే చర్మ స‌మ‌స్య‌ల‌ను తగ్గించే అద్భుతమైన ఔషధం అని చెప్పవచ్చు శనగపిండిలో సహజంగా మొటిమలను తొలగించే కొన్ని లక్షణాలు ఉన్నాయి మరియు శతాబ్దాలుగా చర్మ సౌందర్యానికి భారతదేశంలో దీనిని మనం ఉపయోగిస్తున్నాము.

శనగపిండిలో(besan flour) ఉండే జింక్ ముఖంపై వచ్చే మొటిమలు కారణమయ్యే ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది మరియు అదనపు జిడ్డు (సెబమ్) ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది ఎర్రబడిన చర్మాన్ని తగ్గించి మీ చర్మం నీ అందంగా కాంతివంతంగా చేస్తుంది senagapindi face pack

ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

 • శనగపిండిలో (besan flour) ఆల్కలైజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది మరియు చర్మ సమతుల్యతను కాపాడుతుంది.
 • చర్మం లోపల ఉండే దుమ్ము మరియు విష పదార్థాలను తొలగిస్తుంది.
 • ముఖం నుండి అదనపు జిడ్డు తొలగిస్తుంది.
 • చర్మంపై తేమను సక్రమంగా ఉంచుతుంది.
 • చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
 • ఇది చర్మ నలుపు ని తగ్గిస్తుంది.
 • చర్మానికి ప్రకాశవంతమైన అందాన్ని ఇస్తుంది.
 • ఇది అవాంఛిత జుట్టును తొలగించడంలో సహాయపడుతుంది.

senagapindi face pack శెనగపిండి ఫేస్ ప్యాక్

కలబంద మరియు (senagapindi face pack) శెనగపిండి ఫేస్ ప్యాక్

alovera senagapindi-face-pack

కావాల్సినవి

 • 1 టీస్పూన్ శెనగపిండి
 • 1 టీస్పూన్ కలబంద గుజ్జు

మీరు ఏమి చేయాలి

 1. ముందుగా 1 స్పూన్ శెనగపిండి మరియు కలబంద గుజ్జును తీసుకుని వాటిని మెత్తని పేస్ట్ వచ్చేవరకూ రెండింటినీ బాగా కలపండి.
 2. వచ్చిన మిశ్రమాన్ని మీ మొహానికి ఫేస్ ప్యాక్ లాగా రాసుకుని 10-15 నిమిషాలు అలాగే ఉంచండి.
 3. చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.

మీరు దీన్ని ఎంత తరచుగా చేయాలి

వారానికి రెండుసార్లు లేదా మూడుసార్లు చేయండి

ఎందుకు ఇది పనిచేస్తుంది

కలబంద లో విటమిన్లు, ఖనిజాలు, పాలిసాకరైడ్ మరియు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి ఇది ఆరోగ్యకరమైన మృదువైన చర్మం మీకు అందిస్తుంది కలబందకి శెనగపిండి జోడించడం ద్వారా కాంతివంతమైన మృదువైన చర్మాన్ని మీరు సులభంగా పొందవచ్చు అలాగే ముఖంపై వచ్చే నల్లని మచ్చలు తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది

చర్మ రకం అనుకూలం

అన్ని చర్మ రకాలు

శెనగపిండి మరియు పసుపు ఫేస్ ప్యాక్

turmeric-and-sanaga-pindhi-face-pack

కావాల్సినవి

 • 2 టీ స్పూన్లు శెనగపిండి
 • ఒక చిటికెడు పసుపు
 • రోజ్ వాటర్

మీరు ఏమి చేయాలి

 1. శనగపిండిలో కొద్దిగా పసుపు వేసి దీనికి కొద్దిగా రోజ్ వాటర్ కలిపి పేస్ట్ వచ్చే లాగా చేసుకోండి
 2. వచ్చిన మిశ్రమాన్ని మీ మొహానికి ఫేస్ ప్యాక్ లాగా రాసుకోండి
 3. 10-15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోండి.

మీ చర్మం పొడి చర్మం అవుతే ఫేస్ ప్యాక్‌లో అర టీస్పూన్ మీగడ ని కూడా కలపండి

మీరు దీన్ని ఎంత తరచుగా చేయాలి

వారానికి రెండుసార్లు ఇలా చేయండి.

ఎందుకు ఇది పనిచేస్తుంది

ఈ senaga pindi face pack మీ చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది పసుపు లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు వల్ల ఇది మీ చర్మంపై వచ్చే మొటిమలు తగ్గిస్తుంది. అలాగే పొడి చర్మం ఉన్నవాళ్లు దీనికి మజ్జిగ మీగడ జోడించడం ద్వారా మీకు చాలా మంచి ప్రయోజనం కలుగుతుంది మీ చర్మానికి కావాల్సిన తేమను అందించి ప్రకాశవంతంగా చేస్తుంది.

చర్మ రకం అనుకూలం

అన్ని చర్మ రకాలు

శెనగపిండి మరియు ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్

Multani-Mitti-sanaga-pindhi-face-pack

కావాల్సినవి

 • 2 టీస్పూన్లు ముల్తానీ మిట్టి
 • 1 టీస్పూన్ శనగపిండి
 • రోజ్ వాటర్

మీరు ఏమి చేయాలి

 1. ముందుగా పొడి పదార్థాలను అయినా ముల్తానీ మట్టి మరియు శెనగపిండిని కలపండి.
 2. ఇప్పుడు వీటికి కొంచెం రోజ్ వాటర్ వేసి బాగా కలపండి.
 3. వచ్చిన మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 15 నిమిషాలు అలాగే ఉంచండి.
 4. నీటితో శుభ్రం చేసుకోండి.

మీరు దీన్ని ఎంత తరచుగా చేయాలి

వారానికి రెండుసార్లు.

ఎందుకు ఇది పనిచేస్తుంది

ముల్తాని మిట్టి అనేది ఒక రకమైన సౌందర్య బంకమట్టి ఇది చర్మం నుండి వచ్చే అదనపు జిడ్డును మరియు మలినాలను తొలగిస్తుంది. ఇది మీ చర్మంపై ఉండే రంధ్రాలను తగ్గిస్తుంది అలాగే ఈ ఫేస్ ప్యాక్ ఉపయోగించినప్పుడు మీ చర్మంపై చల్లని అనుభూతిని కలిగిస్తుంది అలాగే జిడ్డు ను పూర్తిగా తొలగిస్తుంది

చర్మ రకం అనుకూలం

జిడ్డుగల చర్మం, సాధారణ చర్మం

శెనగపిండి మరియు టమోటా ఫేస్ ప్యాక్

tomato-sanaga-pindhi-face-pack

కావాల్సినవి

 • 2 టేబుల్ స్పూన్లు శెనగపిండి
 • 1 చిన్న పండిన టమోటా

మీరు ఏమి చేయాలి

 1. టమోటా రసాన్ని తీసుకుని దానికి శనగపిండిని జోడించండి.
 2. రెండు మిశ్రమాన్ని బాగా కలిపితే ఫేస్ ప్యాక్ వర్తించండి.
 3. దీనిని మీ మొహానికి ఫేస్ ప్యాక్ లాగా రాసుకోండి
 4. 10-12 నిమిషాల తరువాత కడగాలి.

మీరు దీన్ని ఎంత తరచుగా చేయాలి

వారానికి రెండు లేదా మూడుసార్లు ఇలా చేయండి

ఎందుకు ఇది పనిచేస్తుంది

శెనగపిండి కి టొమాటో గుజ్జును జోడించడం వల్ల చర్మం మెరుపు పెంచే ఫేస్ ప్యాక్ అవుతుంది. టమోటాలో ఉండే సహజసిద్ధమైన బ్లీచింగ్ అనే ఆమ్లం మీ చర్మంపై ఉండే నల్లని మచ్చలు ఇట్టే తగ్గిస్తుంది. టొమాటో గుజ్జు చర్మం యొక్క పిహెచ్ స్థాయులను సమతుల్యత చేసి జిడ్డును తగ్గిస్తుంది అలాగే ఇది చర్మం సున్నితంగా చేసి చర్మంపై ఉండే ముడతలను తగ్గిస్తుంది.

చర్మ రకం అనుకూలం

అన్ని చర్మ రకాలు

శెనగపిండి మరియు అరటి ఫేస్ ప్యాక్

bannana-sanaga-pindhi-face-pack

కావాల్సినవి

 • 3-4 పండిన అరటి ముక్కలు
 • 2 టీస్పూన్లు సెనగ పిండి
 • రోజ్ వాటర్ లేదా పాలు

మీరు ఏమి చేయాలి

 1. అరటి ముక్కలను బాగా మెత్తగా చేసి దానికి శెనగపిండి జోడించండి.
 2. దీనికి కొంచెం రోజ్ వాటర్ కలిపి మెత్తని పేస్టుల చెయ్యండి
 3. దీన్ని ముఖానికి ఫేస్ ప్యాక్ లాగా రాసుకుని 10 నుంచి 15 నిమిషాలు అలాగే వదిలేయాలి
 4. గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.

మీరు దీన్ని ఎంత తరచుగా చేయాలి

దీనిని వారానికి ఒకసారి లేదా రెండుసార్లు పునరావృతం చేయండి

ఎందుకు ఇది పనిచేస్తుంది

అరటి మీ చర్మంలో తేమను పెంచుతుంది అలాగే మీ చర్మానికి కావలసిన పోషకాలను అందించి చర్మంపై ఉండే ముడతలను పూర్తిగా తగ్గిస్తుంది అలాగే పొడి బారిన చర్మం వల్ల వచ్చే కఠినమైన చర్మ సమస్యలను నుంచి రక్షిస్తుంది

చర్మ రకం అనుకూలం

పొడి బారిన చర్మం

పెరుగు మరియు శెనగపిండి ఫేస్ ప్యాక్

curd-sanaga-pindhi-face-pack

కావాల్సినవి

 • 2 టేబుల్ స్పూన్లు శెనగపిండి (బేసాన్)
 • 1-2 టీస్పూన్ పెరుగు

మీరు ఏమి చేయాలి

 1. పెరుగును సెనగ పిండితో కలిపి మెత్తని పేస్ట్ వచ్చేదాకా కలపండి
 2. ముఖం ఫేస్ ప్యాక్ లాగా రాసుకుని 15 నిముషాల పాటు ఉంచండి.
 3. నీటితో శుభ్రం చేసుకోండి.

మీరు దీన్ని ఎంత తరచుగా చేయాలి

దీన్ని వారానికి రెండుసార్లు పునరావృతం చేయండి.

ఎందుకు ఇది పనిచేస్తుంది

పెరుగు మనం చర్మంపై ఉండే జిడ్డును తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఇందులో ఉండే లాక్టిక్ ఆమ్లం చనిపోయిన చర్మ కణాలను తొలగించి చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి సహాయపడుతుంది. మరియు ఇందులో ఉండే జింక్ తరచుగా వచ్చే మొటిమలను తగ్గిస్తుంది.

చర్మ రకం అనుకూలం

పొడి చర్మం, సాధారణ చర్మం, మోటిమలు కలిగించే చర్మం

గుడ్డు మరియు శెనగపిండి ఫేస్ ప్యాక్

గుడ్డు-sanaga-pindhi-face-pack

కావాల్సినవి

 • 1 గుడ్డు ఉండే తెల్ల సోన
 • 2 టీ స్పూన్లు సెనగ పిండి
 • ½ tablespoon తేనె

మీరు ఏమి చేయాలి

 1. గుడ్డులో తెల్లసొన తీసుకుని బాగా కలపండి
 2. దీనికి శెనగపిండి మరియు కొంచెం తేనె వేసి బాగా కలపాలి.
 3. దీన్ని చర్మంపై రాసుకుని 10-15 నిమిషాలు ఉంచుకోండి.
 4. గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.

మీరు దీన్ని ఎంత తరచుగా చేయాలి

దీన్ని ప్రతి 4-5 రోజులలో చేయండి.

ఎందుకు ఇది పనిచేస్తుంది

గుడ్డు తెల్ల సోనా లో ఉండే ఎంజైమ్‌లు చర్మం యొక్క రంధ్రాలను బిగించి ఉంచుతాయి. ఇది చర్మంపై ఉండే ముడతలను తగ్గిస్తుంది మీ చర్మ కణాల పునర్నిర్మాణ ప్రక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ రాసుకోవడం ద్వారా చర్మం గట్టిగా మరియు ప్రకాశవంతంగా ఉంటుంది.

చర్మ రకం అనుకూలం

పొడి చర్మం మినహా అన్ని చర్మ రకాలు

గ్రీన్ టీ మరియు శెనగపిండి ఫేస్ ప్యాక్

కళ్ళకింద-నల్లమచ్చలు-sanaga-pindhi-face-pack

కావాల్సినవి

 • 2 టేబుల్ స్పూన్లు శెనగపిండి
 • 1 గ్రీన్ టీ బ్యాగ్
 • ఒక కప్పు వేడి నీరు

మీరు ఏమి చేయాలి

 1. వేడి నీటిని తీసుకుని అందులో గ్రీన్ టీ బాగ్ వేసి ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయండి
 2. వచ్చిన గ్రీన్ టీ నీటిని చల్లారనివ్వండి
 3. వచ్చిన గ్రీన్ టీ నీటిలో శెనగపిండి కలిపి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోండి
 4. మిశ్రమాన్ని ముఖంపై ఫేస్ ప్యాక్ రాసుకుని 15 నిమిషాలు ఆరనివ్వండి.
 5. నీటితో శుభ్రం చేసుకోండి

మీరు దీన్ని ఎంత తరచుగా చేయాలి

దీన్ని వారానికి రెండుసార్లు చేయండి

ఎందుకు ఇది పనిచేస్తుంది

గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది దీని గురించి పూర్తిగా ఇక్కడ చదవొచ్చు, చర్మ ఉపరితలంపై ఒత్తిడి వల్ల దెబ్బతిన్న చర్మాన్ని మెరుగుపరచడానికి యాంటీఆక్సిడెంట్లు సహాయపడుతుంది . ఇది మీ చర్మంలో కాంతిని నింపుతుంది

చర్మ రకం అనుకూలం

అన్ని చర్మ రకాలు

సెనగ పిండి మరియు నిమ్మ రసం ఫేస్ ప్యాక్

lemon

కావాల్సినవి

 • 2 టేబుల్ స్పూన్లు శెనగపిండి
 • 2 టీస్పూన్ నిమ్మరసం
 • 1 టేబుల్ స్పూన్ పెరుగు
 • చిటికెడు పసుపు

మీరు ఏమి చేయాలి

 1. అన్ని పదార్థాలను కలపండి.(శెనగపిండి,నిమ్మరసం, పెరుగు, పసుపు)
 2. వచ్చిన మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ లాగా రాసుకోండి
 3. ఫేస్ ప్యాక్‌ను ముఖానికి రాసుకుని 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి.
 4. చల్లని నీటితో శుభ్రం చేసుకోండి

మీరు దీన్ని ఎంత తరచుగా చేయాలి

దీన్ని వారానికి రెండుసార్లు చేయండి

ఎందుకు ఇది పనిచేస్తుంది

నిమ్మరసం మరియు సెనగపిండి మీ చర్మం నీ కాంతివంతంగా చెయ్యడానికి అద్భుతంగా పనిచేస్తాయి అని చెప్పవచ్చు రెండిట్లో ఉండే విటమిన్ సి మీ చర్మ నీ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి పనిచేస్తుంది అలాగే ముఖ్యంగా ఎండలో తిరగడం వల్ల వచ్చే నల్లని మచ్చలు తగ్గించడానికి సహాయపడుతుంది మీ చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి మరియు ఆరోగ్యంగా ఉంచడానికి ఈ ఫేస్ ప్యాక్‌ని ఉపయోగించండి.

చర్మ రకం అనుకూలం

జిడ్డుగల చర్మం, సాధారణ చర్మం

శెనగపిండి మరియు నారింజ రసం ఫేస్ ప్యాక్

orange

కావాల్సినవి

 • 2 టేబుల్ స్పూన్లు శెనగపిండి
 • 1-2 టేబుల్ స్పూన్లు నారింజ రసం

మీరు ఏమి చేయాలి

 1. శనగపిండిలో తాజా నారింజ రసం వేసి కలపండి.
 2. ఈ ఫేస్ ప్యాక్‌ని ముఖానికి రాసుకుని 10-15 నిమిషాలు అలాగే ఉంచండి.
 3. తర్వాత చల్లని నీటితో కడగండి

మీరు దీన్ని ఎంత తరచుగా చేయాలి

వారానికి 2-3 సార్లు ఇలా చేయండి.

ఎందుకు ఇది పనిచేస్తుంది

ఈ ఫేస్ ప్యాక్ ఉపయోగిస్తే మీ చర్మం కాంతిమంతంగా తయారవుతుంది. నారింజ రసంలో ఉండే ఆమ్లాలు ఎండ వల్ల ఏర్పడే నల్లటి మచ్చలను తగ్గించి కాంతివంతంగా చేస్తుంది నిమ్మరసంలో ఉండే మాదిరిగానే ఇందులో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి పిగ్మెంటేషన్‌ను కూడా తగ్గిస్తుంది

చర్మ రకం అనుకూలం జిడ్డుగల చర్మ, సాధారణ చర్మం

శెనగపిండి మరియు వేప ఫేస్ ప్యాక్

neem

కావాల్సినవి

 • 1 టేబుల్ స్పూన్ ఎండిన వేప ఆకుల పొడి
 • 1  స్పూన్ శెనగపిండి
 • 1 టేబుల్ స్పూన్ పెరుగు లేదా రోజ్ వాటర్

మీరు ఏమి చేయాలి

 1. వేపాకులు పొడిలో కొంచెం పెరుగు వేసి మెత్తని పేస్ట్ వచ్చేవరకూ కలపండి
 2. వచ్చిన మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ లాగా ముఖానికి రాసుకుని
 3. 10-15 నిమిషాలు అలాగే ఆరే వరకు ఉంచండి.
 4. నీటితో శుభ్రం చేసుకోండి.

మీరు దీన్ని ఎంత తరచుగా చేయాలి

దీన్ని వారానికి రెండుసార్లు చేయండి

ఎందుకు ఇది పనిచేస్తుంది వేపలోని

యాంటీమైక్రోబయల్ లక్షణాలు మీ చర్మంపై మొటిమల చెడు కణాలను సమర్థవంతంగా తొలగిస్తాయి. ఇది మొటిమల ప్రదేశాలలో కనిపించే వాపును తగ్గించగల నిరోధక లక్షణాలను కూడా వేప వేపాకుల పొడి లో ఉంటుంది

చర్మ రకం అనుకూలం

మొటిమల ఎక్కువగా ఉన్నవారికి, జిడ్డుగల చర్మం

హెచ్చరిక

కొంత మందికి పెరుగు వేసుకుంటే చర్మానికి పడదు వారు పెరుగుకు బదులుగా రోజు వాటర్ వేసుకుని, ఫేస్ ప్యాక్ సిద్ధం చేసుకోవచ్చు

శెనగపిండి మరియు బొప్పాయి ఫేస్ ప్యాక్

papaya

కావాల్సినవి

 • 4-5 పండిన బొప్పాయి ముక్కలు
 • 1 టేబుల్ స్పూన్ శెనగపిండి
 • రోజ్ వాటర్

మీరు ఏమి చేయాలి

 1. బొప్పాయిని మెత్తగా పేస్ట్ చేసి దానికి శనగ పిండి జోడించండి అవసరమైతే కొంచెం రోజ్ వాటర్ జోడించండి.
 2. ఈ ఫేస్ ప్యాక్ మీ ముఖానికి రాసుకుని
 3. 10 నిమిషాల తర్వాత చల్లని నీటితో ఫేస్ వాష్ చేసుకోండి

మీరు దీన్ని ఎంత తరచుగా చేయాలి

ప్రతి వారానికి ఒకసారి దీన్ని వర్తించండి.

ఎందుకు ఇది పనిచేస్తుంది

బొప్పాయి చర్మ మొక్కలను కణాలను మెరుగుపరుస్తుంది మరియు చనిపోయిన కణాలను తొలగిస్తాయి. ఈ ఫేస్ ప్యాక్ చర్మం ప్రకాశవంతంగా చేస్తుంది అలాగే చర్మం యొక్క రంధ్రాలను తగ్గిస్తుంది మీ చర్మంపై పెద్ద రంధ్రాలు మరియు నల్లటి మచ్చలు తగ్గించడంలో సహాయపడుతుంది.

చర్మ రకం అనుకూలం

అన్ని చర్మ రకాలు

శెనగపిండి మరియు బంగాళదుంప ఫేస్ ప్యాక్

కావాల్సినవి

 • 2 టీ స్పూన్లు సెనగ పిండి
 • 1 చిన్న బంగాళదుంప

మీరు ఏమి చేయాలి

 1. బంగాళదుంపను మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోండి వచ్చిన మిశ్రమంలో నుంచి దాని రసాన్ని పిండి తీయండి.
 2. వచ్చిన బంగాళదుంప రసానికి 1 స్పూన్ శెనగపిండి కలిపి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోండి.
 3. ఈ పేస్ట్ ను ముఖ చర్మంపై రాయండి.
 4. సుమారు 15 నిమిషాలు ఆరిన తర్వాత శుభ్రం చేసుకోండి.

మీరు దీన్ని ఎంత తరచుగా చేయాలి

వారంలో 2-3 సార్లు ఇలా చేయండి.

ఎందుకు ఇది పనిచేస్తుంది

మీ చర్మం ప్రకాశవంతం మరియు మెరుపు పెంచడం కోసం ఇది అద్భుతమైన ఫేస్ ప్యాక్ అని చెప్పవచ్చు. బంగాళదుంప రసం యొక్క సహజ బ్లీచింగ్ లక్షణాలు చర్మం యొక్క మెరుపు పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది

చర్మ రకం అనుకూలం

అన్ని చర్మ రకాలు

శెనగపిండి మరియు బేకింగ్ సోడా ఫేస్ ప్యాక్

బేకింగ్-సోడా

కావాల్సినవి

 • 2 టీ స్పూన్లు బేకింగ్ సోడా
 • 1/4 కప్పు నీరు
 • 2 టేబుల్ స్పూన్లు శెనగపిండి
 • ఒక చిటికెడు పసుపు

మీరు ఏమి చేయాలి

 1. మొదట, బేకింగ్ సోడా నీటిలో వేసి బాగా కలపాలి.
 2. శెనగపిండి కొంచెం పసుపు మరియు బేకింగ్ సోడా కొంచెం నీళ్ళు కలిపి మెత్తని పేస్టులా తయారు చేసుకోండి
 3. ముఖం లేదా ప్రభావిత ప్రాంతాలలో దీన్ని రాసుకోండి.
 4. దీన్ని 10 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత శుభ్రం చేసుకోండి.

మీరు దీన్ని ఎంత తరచుగా చేయాలి

దీనిని వారానికి ఒకసారి లేదా రెండుసార్లు పునరావృతం చేయండి.

ఎందుకు ఇది పనిచేస్తుంది

బేకింగ్ సోడా మీ చర్మం యొక్క పిహెచ్ స్థాయులను సమతుల్యత చేయడానికి సహాయపడుతుంది. బేకింగ్ సోడా యొక్క యాంటీమైక్రోబయల్ కారణంగా మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియా చంపివేసి మొటిమలు తగ్గిస్తాయి.

చర్మ రకం అనుకూలం

జిడ్డుగల చర్మం, కలయిక చర్మం, సాధారణ చర్మం

శెనగపిండి మరియు రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్

rose-water

కావాల్సినవి

 • 2 టేబుల్ స్పూన్లు శెనగపిండి
 • 2-3 టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్

మీరు ఏమి చేయాలి

 1. శెనగపిండి మరియు రోజ్ వాటర్ ని కలిపి ముద్దగా అయిన పేస్ట్ అయ్యే వరకు కలపండి.
 2. మీ ముఖం మరియు మెడపై రాసుకోండి.
 3. సుమారు 20 నిమిషాలు వరకు ఆరనివ్వండి.
 4. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి.

మీరు దీన్ని ఎంత తరచుగా చేయాలి

దీన్ని వారానికి రెండుసార్లు చేయండి.

ఎందుకు ఇది పనిచేస్తుంది

రోజ్ వాటర్ మీ చర్మ సౌందర్యాన్ని పెంచడానికి అద్భుతంగా పనిచేస్తుంది మరియు దీనికి శెనగపిండి జోడించడంతో మీ చర్మం కాంతివంతంగా ప్రకాశిస్తుంది అలాగే మీ చర్మంపై ఉండే జిడ్డును తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది

చర్మ రకం అనుకూలం

జిడ్డుగల చర్మం, కలయిక చర్మం, సాధారణ చర్మం

పాలు మరియు శెనగపిండి ఫేస్ ప్యాక్

rose-water

కావాల్సినవి

 • 2 టేబుల్ స్పూన్లు శెనగపిండి
 • 2 టేబుల్ స్పూన్లు పాలు

మీరు ఏమి చేయాలి

 1. పాలుతో శనగపిండి కలపండి మందపాటి పేస్ట్ తయారు చేసుకోండి.
 2. పేస్ట్ ను మీ చర్మంపై రాసుకుని సుమారు 20 నిమిషాలు అలాగే వదిలేయండి.
 3. తర్వాత, చల్లటి నీటితో కడగాలి.

మీరు దీన్ని ఎంత తరచుగా చేయాలి

దీన్ని ప్రతి 4-5 రోజులలో చేయండి.

ఎందుకు ఇది పనిచేస్తుంది

ఇది మీ చర్మం నుండి మలినాలను తొలగిస్తుంది మరియు రంధ్రాలను తగ్గిస్తుంది అలాగే చర్మంపై ఉండే క్రిములు చర్మం మచ్చలను తగ్గిస్తుంది

చర్మ రకం అనుకూలం

అన్ని చర్మ రకాలు

హెచ్చరిక

కొంతమందికి పాలు అలర్జీని కలిగిస్తుంది కాబట్టి మీకు గనుక పాలు ఎలర్జీ ఉంటే ఈ ఫేస్ ప్యాక్ వాడకండి.

తేనె మరియు శెనగపిండి ప్యాక్

honey senaga-pindi

కావాల్సినవి

 • 2 టేబుల్ స్పూన్లు సెనగ పిండి
 • 1 టేబుల్ స్పూన్ తేనె

మీరు ఏమి చేయాలి

 1. తేనెను 10 సెకన్ల పాటు వేడి చేయండి.ఇది చాలా వేడిగా ఉండకుండా చూసుకోండి.
 2. శెనగపిండి మరియు తేనె కలిపి మెత్తని పేస్టులా చేసుకుని మీ చర్మంపై రాసుకోండి .
 3. ఫేస్ ప్యాక్ ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి

మీరు దీన్ని ఎంత తరచుగా చేయాలి

దీన్ని వారానికి రెండుసార్లు వర్తించండి.

ఎందుకు ఇది పనిచేస్తుంది

తేనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి, ఇది క్రమం తప్పకుండా వాడితే వాడటంలను నయం చేస్తుంది అలాగే చర్మాన్ని శుభ్రపరుస్తుంది మరియు చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది

చర్మ రకం అనుకూలం

మొటిమల బారిన పడిన చర్మం, జిడ్డుగల చర్మం, కలయిక చర్మం, సాధారణ చర్మం

శెనగపిండి మరియు చందనం ఫేస్ ప్యాక్

senaga-pindi

కావాల్సినవి

 • 1 టేబుల్ స్పూన్ శనగపిండి
 • 1 టీస్పూన్ గంధపు పొడి
 • 2 టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్
 • ఒక చిటికెడు పసుపు

మీరు ఏమి చేయాలి

 1. మృదువైన పేస్ట్ వచ్చేవరకు అన్ని పదార్థాలను కలపండి. (శెనగపిండి గంధపు పొడి రోజ్ వాటర్ చిటికెడు పసుపు)
 2. పేస్ట్ ను మీ ముఖానికి రాసుకుని 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి
 3. 20నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోండి

మీరు దీన్ని ఎంత తరచుగా చేయాలి

దీనిని వారానికి ఒకసారి లేదా రెండుసార్లు పునరావృతం చేయండి.

ఎందుకు ఇది పనిచేస్తుంది

రోజ్ వాటర్ చర్మాన్ని శుభ్రపరచడానికి సహాయపడుతుందని మరియు చికాకు కలిగించిన చర్మాన్ని చల్లబరుస్తుంది అని మనకు ఇప్పటికే తెలుసు. పసుపు ఒక సహజ వైద్యం, ఇది యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. చందనం రక్తాన్ని శుద్ధి చేస్తుంది దీని వల్ల మొటిమలు తగ్గుతాయి ఇది చర్మానికి అద్భుతమైన గ్లో ఇస్తుంది

చర్మ రకం అనుకూలం

మొటిమల బారిన పడిన చర్మం, జిడ్డుగల చర్మం, కలయిక చర్మం, సాధారణ చర్మం

హెచ్చరిక

గంధపు పొడి కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. చాలా బ్రాండ్లు ప్రామాణికమైన గంధపు పొడిను విక్రయించవు కాబట్టి మంచి గంధపు పొడిని వాడటం ఇక్కడ చాలా ముఖ్యం

సెనగ పిండి మరియు కీర దోసకాయ జ్యూస్ ప్యాక్

కీర-దోసకాయ

కావాల్సినవి

 • 2 టేబుల్ స్పూన్లు శెనగపిండి
 • 2 టేబుల్ స్పూన్లు  కీర దోసకాయ రసం
 • 5 చుక్కల నిమ్మరసం

మీరు ఏమి చేయాలి

 1. అన్ని పదార్థాలను కలిపి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోండి
 2. ఈ పేస్ట్ ను మీ చర్మం అంతటా సమానంగా రాసుకోండి.
 3. ప్యాక్‌ను సుమారు 20 నిమిషాలు ఇచ్చిన తర్వాత చల్లని నీటితో కడగాలి

మీరు దీన్ని ఎంత తరచుగా చేయాలి

వారానికి రెండుసార్లు ఇలా చేయండి

ఎందుకు ఇది పనిచేస్తుంది

దోసకాయలో రంధ్రాలను మూసివేయడంలో సహాయపడే రక్తస్రావ నివారిణి లక్షణాలు ఉన్నాయి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది మరియు గుర్తులు, మచ్చలు మరియు మీ మీ చర్మపు రంగును తెల్లగా చేస్తుంది. ఇది చర్మాన్ని బిగించడానికి మరియు ముడతల రూపాన్ని తగ్గించడానికి కూడా బాగా పనిచేస్తుంది ఇంట్లో మచ్చల చికిత్సకు ఇది అద్భుతమైన ఫేస్ ప్యాక్.

చర్మ రకం అనుకూలం

మొటిమల బారిన పడిన చర్మం, జిడ్డుగల చర్మం, కలయిక చర్మం, సాధారణ చర్మం, పొడి చర్మం

senagapindi face pack మరియు బాదం ప్యాక్

బాదం

కావాల్సినవి

 • 4 బాదం
 • 1 tablespoon పాలు
 • ½ టీస్పూన్ నిమ్మరసం
 • 1 టీస్పూన్ బేసాన్

మీరు ఏమి చేయాలి

 1. బాదంపప్పును రుబ్బుకుని ఈ పొడిని శెనగపిండితో కలపండి.
 2. వచ్చిన మిశ్రమంలో ఐదు చుక్కల నిమ్మరసం కలిపి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి
 3. పేస్ట్ ను మీ ముఖం మరియు మెడ అంతా సమానంగా రాసుకునే 15-20 నిమిషాలు అలాగే ఉంచండి.
 4. చల్లటి నీటితో కడిగి

మీరు దీన్ని ఎంత తరచుగా చేయాలి

దీనిని వారానికి ఒకసారి లేదా రెండుసార్లు పునరావృతం చేయండి.

ఎందుకు ఇది పనిచేస్తుంది

బాదం చర్మాన్ని పోషించే మరియు హైడ్రేట్ చేసే అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలను కలిగి ఉంటుంది. ఆరోగ్యకరమైన చర్మానికి అవసరమైన విటమిన్ ఇ ఇందులో పుష్కలంగా ఉంటుంది. బాదం కూడా కళ్ళ చుట్టూ ఏర్పడే నల్లని మచ్చలను తగ్గిస్తుంది,

చర్మ రకం అనుకూలం

పొడి చర్మం, సాధారణ చర్మం

Calcium rich foods కాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలు