మహిళలకు 50 ఆరోగ్య చిట్కాలు – ప్రతి స్త్రీ తెలుసుకోవలసినవి

womens-health-tips-telugu

health tips for womens in telugu

మహిళల ఆరోగ్య ఆందోళనలు పురుషుల కన్నా కొద్దిగా భిన్నంగా ఉంటాయి. మనం చాలా అరుదైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాము చెప్పాలంటే ఏ ఒక్క రోజు విశ్రాంతి లేని పని, అలాగే అయోడిన్ జింక్ క్యాల్షియం లోపం మహిళా లోనే (womens) ఎక్కువగా ఉంటుంది అలాగే ఋతు క్రమం సమయంలో భరించలేని నొప్పి ఉంటుంది కాబట్టి మనం తప్పకుండా కొన్ని మహిళల(womens)గా కొన్ని చిట్కాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి ఇక్కడ మహిళల (womens) ఆరోగ్యంగా కోసం చిట్కాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం…

 • రాత్రి పడుకునే ముందు అర గ్లాసు వేడి పాల్లలో ఒక చెమ్చా పటికి బెల్లం చూర్ణం కలుపుకొని తాగడం మంచిది.
 • మెంతికూరను కొన్ని రోజులు క్రమం తప్పకుండా తింటే నెలసరి (పీరియడ్స్ ) క్రమబద్ధం అవుతుంది.
 • % 10 ఉల్లిపాయ ముక్కలను అర లీటరు నీళ్ళలో ఒక వంతు మిగులునట్లు కాచుకుని, వడ పోసుకొని కొంచెం బెల్లం కలుపు కొని మూడు వారాలు రోజుకు ఒక్కసారి తాగండి. నెలసరి సక్రమంగా వుంటుంది.
 • పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావంతో బాధపడుతున్న మహిళలు రెండు సార్లు పలచటి నిమ్మరసం తాగితే ఉపశమనం కలుగుతుంది.
 • అన్నం మొదటి ముద్దలో నువ్వుల పొడి ఒక చెమ్చా కలుపుకుని తినడంవల్ల హార్మోను బ్యాలెన్సింగ్ గా ఉంటాయి.
 • తులసి ఆకులు లేదా తులసి టీ రొమ్ము క్యాన్సర్ నుంచి కాపాడుతుంది.
 • విటమిన్ E గల ఆకుకూరలు రొమ్ము నొప్పి నుంచి ఉపశమనం ఇవ్వగలదు.

కొంత మంది అమ్మాయిలు బహిష్టు సమయంలో విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతుంటారు. ఎందువల్ల? అలాంటి వారికి ఏం చేయాలి?

గర్భసంచి లోపలిపొర అయిన ఎండోమెట్రియమ్ మరియు రక్తము బయటికి రావాలంటే గర్భసంచి గోడలు గట్టిగా ముడుచుకు పోవాలి. ఇలా ముడుచుకొని రక్తాన్ని బయటికి నెట్టే ప్రయత్నంలో గర్భసంచి కండరాలు గట్టిగా అవుతాయి. దీనివలనే అమ్మాయికి బహిష్టు సమయంలో కడుపునొప్పి, నడుము నొప్పి కూడా ఉంటాయి. కొంతమందిలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఈ నొప్పి నివారణకు వేడినీటి సంచితో పొత్తి కడుపుపైన నడుముపైన కాపడం పెట్టవచ్చు. నొప్పి ఎక్కువగా ఉన్నవారు పారాసిటమాల్ గాని, బెరాల్గాన్ మాత్రలు గాని వాడి ఉపశమనం పొందవచ్చు. ఈత, తేలికపాటి వ్యాయామాల వలన కూడా సాంత్వన కలుగుతుంది.

బహిష్టు సమయంలో స్నానం చేయకూడదని, వస్తువులు అంటుకోకూడదని అంటారు. నిజమేనా?

ఇది నిజం కాదు. బహిష్టు సమయంలో స్త్రీలు మరింత పరిశుభ్రంగా ఉండటానికి రోజూ రెండు పూటలు స్నానం చేస్తుండాలి. రక్తం పీల్చడానికి వాడే బట్టలను తరచుగా మార్చాలి. శుభ్రమైన శానిటరీ నాప్ కిన్స్ ను వాడటం వలన స్త్రీలకు ఈ సమయంలో వచ్చే సాధారణ జననావయవ అంటువ్యాధులు రాకుండా రక్షణ పొందవచ్చు. ఇంట్లో సాధారణంగా చేసుకొనే పనులు అన్నీ చేసుకోవచ్చు. అన్ని వస్తువులను అంటుకోవచ్చు. అంటుకొన్నందు వలన ఏమీకాదు.

 • బహిష్టు స్తనములు (Breast) జారి మెత్తనై వుంటే తామర గింజల చూర్ణం, పంచదార కలిపి పాలతో లోపలికి తీసుకొని తామర పూలు మెత్తగా సూరిన ముద్దను పైనపట్టించినా అవి గట్టి పడి ఆకర్షణీయంగా తయారవుతారు.
 • నిమ్మచెట్టు ఆకులరసం మూడు చెమ్చాలు, దానిమ్మ బెరడు చూర్ణం,అశ్వగంధ చూర్ణం కలిపి ముద్దగా చేసి పైన పట్టులా వేసుకుంటే స్తనములు ధృడమై వుంటాయి.
 • గ్రీన్ టీ తాగడం వలన ఆడవారికి హార్మోన్లకు మరియు రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉంటుంది.
 • కొంతమందికి ప్రసవముల కారణంగా యోని విశాలమైపోతుంది.కాడలతో కూడిన తామర పువ్వులు ఆవుపాలతో మర్దించి చుట్టూ రాసుకుంటే గట్టిపడుతుంది.
 • అలాగే గింజలు తీసిన ఉసిరికాయ పెచ్చులను నీళ్ళతో నూరి ఆ ముద్దను నీళ్ళతో కలిపి రోజూ రెండుసార్లు అక్కడ కడుగు కుంటూంటే యోని గట్టిపడుతుంది.
 • వేపచెట్టు బెరడు తీసుకొని ఎండించి దాన్ని గంధంగా తీసుకొని ఆ గంధాన్ని పైన, లోపల రాసుకుంటూంటే యోని బిగువుగా తయారవుతుంది.
 • ఈ మూడు రోజులకు ఒక్కసారి నువ్వుల నూనెతో శరీరమంతా మర్దన చేసుకొని, పెసర పిండిలో కొంచెం పసుపు, వేపపొడి, గంధం పొడి కలుపుకొని దాంతో నలుగు పెట్టుకుని వేడినీళ్ళతో స్నానం చేస్తుంటే శరీరం ఆకర్షణీయంగా వుంటుంది..
 • అలాగే కొంతమంది స్త్రీలలో కాళ్ళపై చేతు లపై పుండకూడనిచోట వెంట్రుకలు పెరుగుతాయి. వారు హరి దళం మోదుగ పుల్లలు కాల్చిన బూడిద సమభాగాలుగా తీసుకొని ఆరటీ దుంప రసంతో మర్ధనచేసి పైన రాస్తూంటే వెంట్రుకలు వూడిపోయి తిరిగి పుట్టవు.
 • వారానికి ఒక అవకాడో తెసుకోవడం వలన హార్మోన్లను నియత్రిస్తుంది.

health tips for womens in telugu

 1. పాలిచ్చే తల్లులకు మెంతులు తినడం మంచిది.
 2. చాలా మంది మహిళలు వారి ఆహరంలో తగినంత ఐరన్ తీసుకోరు, ముట్టు (పీరియడ్స్) సమయంలో ఐరన్ చాలా కోల్పోతారు, కనుక ఆహారంలో ఐరన్ ఉన్న పదార్థాలు తీసుకోవాలి
 3. కమీలో శరీరపు ఛాయతరగకుండా ఆకర్షణీ యంగా వుండాలంటే పసుపు, ఆవాలు, కుంకుమపువ్వు, శోంఠి, కొంచెం కర్పూరం కలిపి పెసరపిండిలో కలుపుకొని స్నానానికి ముందు నలుగు పెట్టుకుంటే సలుపు విరిగి తెల్లబడతారు. వయస్సు పెరగడం సహజం. దాంతో శరీరపు సౌందర్యం పెరగాలి కాని, సడల కూడదు.
 4. పుదినా ఆకులను ఎండబెట్టి, పొడి చేసుకొని, రెండు గ్లాసుల నీటిలో బాగా మరిగించి, చల్లారాక వడకట్టి తాగితే బహిష్టు నొప్పి తగ్గుతుంది.
 5. మహిళలు ఎక్కువగా ఎముకల వ్యాధికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, క్యాల్షియం ఎక్కువగా ఉన్న ఆహరం క్రమం తప్పకుండా తీసుకోవాలి.
 6. ప్రవసం తరువాత ఆహారంలో ధనియాలు తీసుకొంటే గర్భాశాయానికి మంచిది..
 7. అనీమియా (రక్తహీనత) తో భాదపడేవారు మెంతి ఆకులను ఆహారంలో తెసుకొంటూ ఉంటే మంచిది.
 8. గర్భిణిలు మరీ చల్లగా లేక మరీ వేడిగా లేని నీళ్ళతో స్నానం చేయాలి.
 9. ప్రతి రోజు కనీసం 20 నిమిషాలు పాటు జాగింగ్, స్విమ్మింగ్ లేదా వాకింగ్ చేయడం వలన హార్మోన్లను నియత్రిస్తుంది..
 10. పాలకూర పాలిచ్చే తల్లులకు మంచిది.
 11. అల్లం ముక్క చప్పరించడం లేదా అల్లం టీ తాగడం వలన బహిష్టు (menses) నొప్పి తగ్గుతుంది.
 12. పుదినా ఆకులు నమలటం వలన బహిష్టు నొప్పి తగ్గతుంది.
 13. పడుకునే ముందు పొత్తికడుపు మీద నువ్వుల నూనే రాసుకొని మసాజ్ చేసుకొంటే హార్మోన్లను నియత్రిస్తుంది.
 14. గుర్తించని హార్మోన్ల ప్రభావం వల్ల బహిషులు ఆగి ఆగి వస్తూంటే మీ శరీరంబరుపు పెరుగుతుంది. ఒళ్ళు పెరిగితే బరువు మాత్రమే, కాదు మీ ఆకృతి కూడా వికారంగా తయారవుతుంది, అయిదు తులాల ఉల్లిపాయలు ముక్కలు చేసి ఒక లీటరు నీళ్ళలో కలిపి కాచి మూడవవంతు నీరు మిగులునట్లు కాచి వడపోసుకొని అందులో బెల్లం కలుపుకొని మూడు వారాలు తాగిత బహిష్టు సక్రమమై శరీరం చక్కగా వుంటుంది.
వాల్నట్ 10 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు