Coconut water కొబ్బరి నీళ్లతొ అద్భుతమైన ప్రయోజనాలు

coconut water benefits in telugu కొబ్బరి నీటి

coconut water కొబ్బరి నీళ్లతొ అద్భుతమైన ప్రయోజనాలు

మన సంస్కృతిలో మన ఆచారాలలో కొబ్బరి బొండానికి ఎనలేని ప్రాధాన్యత ఉంది. కల్యాణ వేదిక పైకి నడిచి వచ్చే నవవధువు చేతులను కొబ్బరి బొండం లేకుండా ఊహించలేం.

గుండ్రంగా, మచ్చలులేని నున్నని లేలేత పచ్చని బొండాన్ని ఎంచుకుని మరీ ఆయా కార్య క్రమాల్లో ఉపయోగిస్తాం. అందుకే ఎన్నో ఉపయోగాలున్న కొబ్బరిచెట్టు కల్పవృక్షమైంది.

నూటికి నూరుపాళ్లు సహజసిద్ధమైన, కల్తీకి ఆస్కారం లేని పానీయం. ప్రపంచంలో మరి ఏది దీనికి సాటిరాదు. దీనికి ప్రాసెసింగ్ ప్రక్రియతో పనిలేదు.

మన రక్తంలో ఎలక్ట్రోలైట్ సమతౌల్యం ఏవిధంగా ఉంటుందో కొబ్బరి నీటి లోనూ అదే మాదిరి ఉంటుంది.

ఇందుకు కారణం ఈ నీటిలోని లెక్క లేనన్ని ప్రయోజనములే. అందుకే ఎవరికైనా ఆరోగ్యం బాగోపోతే డాక్టర్ను టాబ్లెట్స్ తో పాటు కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండమంటారు కొబ్బరి నీటిలో ఉండే పూర్తి ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం:-

చక్కెరలు

లేత కొబ్బరి నీటిలో చక్కెరలు ప్రధానంగా ఉంటాయి. కొబ్బరి బాగా ముదిరిన తరువాత నీటిలో చక్కెర శాతం పడిపోతూ ఉంటుంది కాబట్టి డయాబెటిస్ ఉన్న వాళ్ళు లేత కొబ్బరి కాకుండా కొంచెం ముదిరిన కొబ్బరి నీటిని తాగడం మంచిది కానీ లేత కొబ్బరి నీటిలో చక్కెర శాతం ఎక్కువ ఉండి వెంటనే ఎక్కువ శక్తిని అందజేస్తుంది. వేసవి వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

ఖనిజాలు

లేత కొబ్బరి నీటిలో దాహాన్ని తీర్చే గుణం మాత్రమే కాదు-ఎన్నో ఖనిజాలూ లభిస్తాయి. కాబట్టి అనేక రకాల రుగ్మతల్ని తొలగించే శక్తి కలిగి ఉంటుంది. తాజా లేత కొబ్బరి నీటిలో అనేక సూక్ష్మ పోషకాల, యాంటీ ఆక్సిడెంట్ ప్రభావం కలిగి ఉంటుంది. లేత కొబ్బరి నీటిలో అత్యధికంగా లభించే పొటాషియం, తగిన స్థాయిలో సోడియం ఆల్కలైన్ సమతుల్యతను క్రమబద్ధీకరించి రక్తపోటు తగ్గించడంలో సహాయపడుతుంది

ఈ నీటిలోని కాల్షియం ఎముకల్ని, పళ్ళను దృఢంగా ఉంచి, కండరాల బలోపేతానికి గుండె సమస్యలు రాకుండా సహకరిస్తుంది.

coconut water ఆరోగ్యపరంగా

 • శరీరంలో సహజ లవణాల్ని కోల్పోయినప్పుడు కలిగే అలసట నుంచి కొబ్బరి నీరు కాపాడుతుంది. డయేరియాతో ఇబ్బంది పడే పిల్లలకు డీహైడ్రేషన్ రాకుండా కాపాడే పానీయం కొబ్బరి నీరు.
 • ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే వేసవి కాలంలో పళ్ళ రసాలు తాగడం దాదాపు అందరికీ అలవాటు. ఐతే మనం తాగే కూల్ డ్రింక్స్ లో చక్కెర తప్ప మరి ఏమీ ఉండదు లేత అదే  మనకు లభించే కొబ్బరినీటిని తాగితే. మెగ్నిషియం క్యాల్షియం పొటాషియం సోడియం వంటి అనేక రకాల పోషకాలు మనకు లభిస్తాయి zinc, magnesium, calcium, potassium, sodium etc are found in coconut water.  అలాగే పిల్లల నుంచి పెద్దల దాకా కృత్రిమ పానీయాలు మేలు చేస్తుంది.
 • గర్భవతులకు మలబద్దకం, జీర్ణకోశంలో తేడాలు. గుండెలో మంట సాధారణ సమస్యలు. వీటిని కొబ్బరి నీరు తాగడం ద్వారా అధిగమించవచ్చు కాబట్టి గర్భవతులు, పాలు ఇచ్చే తల్లులు కొబ్బరి నీళ్ళను వీలున్నప్పుడల్లా
 • తాగుతూ ఉండాలి . పాపాయి ఆరోగ్యానికి తల్లులు.తాగే కొబ్బరి నీరు ఎంతగానో సహకరిస్తుంది. బిడ్డకు పాలు ఇచ్చే తల్లులు కొబ్బరి నీటిని తాగితే పాల ద్వారా వారి బిడ్డలకు అనేక పోషకాలు అందుతాయి,
 • కొబ్బరి నీరు తల్లి పాలలో లారిక్ యాసిడ్ ను పెంచుతుంది….దీనిలో యాంటీఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ. వైరల్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి చిన్నపిల్లల్ని అనేక ఇన్ ఫెక్షన్ల నుంచి పరిరక్షిస్తాయి.coconut water benefits in telugu
 • గుండెజబ్బులు అధిక రక్తపోటు ప్రధానకారణం. పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు రక్తపోటును తగ్గించడంలో సహకరిస్తాయి.
 • ఈ రెండు ఖనిజాలు గల కొబ్బరి నీరు రక్తపోటును నివారించి, రక్తసరఫరాను మెరుగు చేయడంలో సహకరిస్తుంది.
 • గుండె జబ్బులు గల వారికి కొబ్బరి నీరు. హార్ట్ ఫెయిల్యూర్ రిస్కును తగ్గించగలదని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
 • కొబ్బరి నీరు మూత్ర, వ్యవస్థలపై థెరపటిక్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మూత్రకోశ ఇన్ ఫెక్షన్లు, మూత్రపిండంలో రాళ్లను తగ్గించడంలో,
 • శృంగార శక్తిని పెంచడంలో కొబ్బరి నీరు ఎంతగానో సహకరిస్తుంది. కిడ్నీలో రాళ్ళు కరిగిపోవడానికి కొబ్బరి నీటిని తాగడంవల్ల మంచి ఫలితం కనిపిస్తుందని వైద్య పరిశోధనల్లో తేలింది.
 • రక్తప్రసరణ తీరు సక్రమంగా ఉండాలంటే తరచూ కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. అధిక రక్త పోటును అరికడుతూ, గుండెపోటును నివారించేందుకు కొబ్బరి బొండం దోహద పడుతుంది.
 • గుండె సంబంధ రక్తనాళాల్లో సమస్యలు లేకుండా, సుగర్ స్థాయులను నియంత్రణలో ఉంచుతుంది.
 • బరువు కోల్పోతున్నామని అనిపిస్తే కొబ్బరి నీళ్లు తాగాలి. తక్కువ కొవ్వు కలిగినందున కొబ్బరి నీళ్లను వీలైనన్ని ఎక్కువ సార్లు తాగడం ఉత్తమం.
 • అనేక పోషకాలు, విటమిన్లు ఉన్నందున కొబ్బరి నీళ్లు తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. వైరస్లు, బాక్టీరియాల బారిన పడ కుండా జాగ్రత్త పడొచ్చు.
 • రాత్రి నిద్రపోయే ముందు కొబ్బరి నీళ్లను ముఖంపై రాసుకుంటే మొటిమలు, మచ్చలు తెలగిపోతాయి. చేతులు, గోళ్లకు రాసుకుంటే మంచి నిగారింపు వస్తుంది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here