25 Aloe vera health benefits అద్భుతమైన కలబంద ఉపయోగాలు

Aloe-Vera

కలబంద ఈనాడు మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్న కలబంద గొప్పతనాన్ని మన భారతీయులకు ఏమాత్రం తెలియకపోవడం అత్యంతవిషాదకర. ఏ దేశంలోనే పుట్టిన శాస్త్రజ్ఞులు ఈ దేశానికి వచ్చి మన ఆయుర్వేద గ్రంథాలు చదివి మన కలబందనుతీసుకుపోయి వాళ్ళ దేశాలలో లక్షల హెక్టార్లలో పెంచుకొని మన గ్రంథాలను బట్టి వందల రకాల కలబందఔషధాలను తయారుచేసి వాటిని మన దేశానికి తీసుకొచ్చి కలబంద గొప్పతనం గురించి ఊరూరూ ప్రచారంచేస్తువేల రూపాయలకు అమ్ముకుంటూ ప్రతిరోజు వేల కోట్ల రూపాయలను వాళ్ళ దేశాలకు తరలించుకుపోతున్నారు.

అయినా మనకు గానీ, మన ప్రభుత్వాలకు గానీ చీమ కుట్టినట్లు కూడా లేదు. మీరంతా ఇది గమనించండి ఈ రోజుల్లో వాడే ప్రతి ఆరోగ్యకర ఉత్పత్తులు తయారు చేసే పెద్ద పెద్ద కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల్లో మన కలబంద లేకుండా ఉండడం లేదు ఉదాహరణకి తలకు రాసుకునే నూనె,shop, ఫేస్ వాష్ ఇలా అనేక రకాల ఉత్పత్తులను తయారు చేసుకుంటారు అలాగే ఇవి మామూలు వాటికన్నా అద్భుతంగా పని చేస్తాయి ఎందుకంటే కలబందలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్ సోడియం పామాల్, సోడియం కార్బోనేట్ లాంటి ప్రత్యేకమైన ఔషధం వలన

కలబంద రూప గుణ ప్రభావాలు

కలబంద దాన్ని సంస్కృతంలో కుమారీ అని పిలుస్తారని అలాగే ఆంగ్లంలో Aloe Vera అని అంటారు ఇది ఒక అందమైన చెట్టు . ఇది బాగా పెరిగిన తరువాత కలబంద మట్టలను అడ్డంగా కోస్తే దాని నుంచి తెల్లని చిక్కని ద్రవం కారుతుంది. దాన్ని ఎండలో పెడితే అది నల్లగా మారుతుంది. దానినే మూసాంబరం అంటారు. దీనిని తయారు చేసుకొని ఎల్లప్పుడూ నిల్వ ఉంచుకుని అనేక వ్యాధులకు ఔషధంగా ఉపయోగించుకునే గొప్ప సంప్రదాయం మన తెలుగునాట యుగయుగాలుగా ఉంది. ఈ దరిద్రపు ఆధునిక యుగంలో ఆ అలవాటు నశించిపోయింది.

కలబంద ప్రయోజనాలు

కలబంద చర్మం ప్రయోజనాలు

కలబందలో గ్లిసరిన్, సోడియం పామాల్, సోడియం కార్బోనేట్, సోడియం పామ్ కెమేలేట్, సార్బిటోల్ మొదలైనవి వంటి అనేక పోషకాలతో కలిగి ఉంటుంది ఇవి మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరిచి చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో సహాయపడుతుంది

కలబంద యాంటీ ఏజింగ్ నిరోధిస్తుంది

Aloe-Vera

సాధారణoగా వయసు పెరిగే కొద్ది చర్మంపైన ముడతలు పడుతూ ఉంటాయి కానీ ఇతర కారణాలు వలన కొంత మందికి ఎక్కువ వయస్సు రాకుండానే చర్మంపై ముడతలు పడి ఎక్కువ వయసు ఉన్నట్లుగా కనిపిస్తారు ఈ యాంటీ ఏజింగ్ సంకేతాలను నివారించడంలో కలబంద సహాయపడుతుంది.

ఎలా ఉపయోగ పడుతుంది

కలబంద మరియు ఆలివ్ నూనెతో తయారు చేసిన తేమ ప్యాక్ మీ చర్మం నీ సున్నితంగా మరియు మృదువుగా చేసి ముడతలను తాగిస్తుంది.

కావాల్సినవి

  • 1 teaspoon కలబంద గుజ్జు
  • ½ teaspoon ఆలివ్ నూనె

మీరు ఏమి చేయాలి

  • ఒక గిన్నెలో అన్ని పదార్ధాలను వేసి (కలబంద గుజ్జు,ఆలివ్ నూనె) మిక్స్ చేసి పేస్ట్ లా తయారు చేసుకోండి.
  • ఈ పేస్టుని ముఖంపై రాసుకుని 30 నిమిషాలు ఉంచండి.
  • చల్లని నీటితో శుభ్రం చేయండి.

తేమ కోసం చర్మం కలబంద

మనం వాడే చర్మ మాయిశ్చరైజర్ (moisturizer) లో కలబంద గుజ్జు కచ్చితంగా ఉంటుంది. ఇది చర్మంపై జిడ్డు మరియు మొటిమలు తాగించడం లో అద్భుత పని చేస్తుంది.

ఎలా ఉపయోగ పడుతుంది

కలబంద మొక్క నుండి కలబంద గుజ్జు నేరుగా తీసుకుని మీ చర్మంకు దరఖాస్తు చేయవచ్చు. ఒకవేళ మీకు కలబంద చెట్టు లేకపోతే మార్కెట్లో లభ్యమయ్యే కలబంద జెల్లను వాడుకోవచ్చు

కావాల్సినవి

  • ఒక కలబంద ఆకు

మీరు ఏమి చేయాలి

  • 1. గుజ్జును పొందడానికి కలబంద ఆకు యొక్క బయటి పొరను తీసి వేయండి
  • 2. గుజ్జు బయటకు తీయండి మరియు ఒక కంటై నర్లో నిల్వ చేయండి.
  • 3. నెమ్మదిగా మీ ముఖం మీద కలబంద గుజ్జును మసాజ్ చేయండి.

ఇది ఎందుకు పని చేస్తుంది

కలబంద మీ చర్మంలో నీటిని పెంచుతుంది మరియు అది జిడ్డు గల చర్మాన్ని తొలగించి చర్మాన్ని కాంతి వంతంగా చేస్తుంది

కలబంద మొటిమను తగ్గిస్తుంది

Aloe-Vera

కలబంద గుజ్జు మొటిమలు తగ్గించడానికి చర్మంపై అద్భుతంగా పనిచేస్తుంది

ఎలా ఉపయోగ పడుతుంది

కలబంద మరియు నిమ్మరసం ఇది మొటిమల మచ్చలు తగ్గించడంలో సహాయపడుతుంది. నిమ్మ blemishes మచ్చలు నుంచి తొలగించడంలో సహాయం చేసే చర్మ సౌందర్య పెంచుతుంది

మీకు కావాల్సినవి

  • 2 నుండి 3 చుక్కల నిమ్మరసం
  • మీరు ఏమి చేయాలి

    • 1. కలబంద గుజ్జు మరియు రెండు నుంచి మూడు చుక్కల నిమ్మరసం వేసి కలపండి
    • 2. ఇది మీ ముఖం మీద నెమ్మదిగా రాసుకుని మసాజ్ చేయండి
    • 3. తర్వాత చల్లని నీటితో. శుభ్రం చేసుకోండి

    ( లేదా)

    అలోవెరా జెల్‌, కాటేజ్‌ చీజ్‌, ఖర్జూరం, కీర దోస రసాలని మిక్సీలో వేసి గ్రైండ్‌ చేయాలి. దీనికి నిమ్మ రసం కలిపి ముఖానికి రాసి అరగంట తరువాత కడిగేయాలి. పొడిబారిన చర్మం మృదుత్వాన్ని సంతరించుకోవాలంటే ఈ ప్యాక్‌ వారానికోసారి వేసుకోవాలి.

    ఇది ఎందుకు పని చేస్తుంది

    కలబంద అనేది యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్ కలిగి ఉంటుంది ఇది మీ మొటిమను తగ్గిస్తుంది అలాగే ఇది కొత్త కణాల అభివృద్ధిని ప్రేరేపించే పాలిసాకరైడ్స్ను కలిగి ఉంటుంది. ఈ మోటిమలు కోసం వైద్యం ప్రక్రియ వేగవంతం చేసి మచ్చలను నిరోధిస్తుంది.

    Aloe Vera మరికొన్ని చర్మ చిట్కాలు:

    1. ముఖ చర్మం మీద చోటుచేసుకునే మచ్చలను తొలగించాలంటే అలోవెరా జెల్‌లో రోజ్‌ వాటర్‌ కలిపి ముఖంపై రాయాలి. బాగా ఆరాక వేళ్లతో వలయాకారంలో రుద్దుతూ కడిగేయాలి. ఈ ప్యాక్‌ను వారానికోసారి క్రమం తప్పక వేసుకుంటే పిగ్మెంటేషన్‌, వయసు, మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు పోతాయి.
    2. కలబంద ఆకుల్లో ముళ్ల కొసలను కత్తిరించి మిగతా ఆకును ముక్కలుగా కోసి నీళ్లలో ఉడికించి గుజ్జలా చేయాలి. ఈ గుజ్జులో తేనె కలిపి ముఖానికి రాసి 20 నిమిషాలయ్యాక కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చర్మంపై జిడ్డు పోయి ప్రకాశవంతంగా తయారవుతుంది.
    3. అలోవెరా జెల్‌, కీరా రసం, పెరుగు, రోజ్‌ నూనెను కలిపి ముఖం, మెడపై రాయాలి. పావుగంట తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. చర్మంపై ర్యాష్‌, మురికి వదిలించటంలో ఈ ప్యాక్‌ అద్భుతంగా పనిచేస్తుంది.
    4. చర్మం తక్షణ మెరుపు సంతరించుకోవాలంటే అలోవెరా జెల్‌, మామిడి గుజ్జు, నిమ్మరసం కలిపి ప్యాక్‌ వేసుకోయాలి. 20 నిమిషాలాగి కడిగేస్తే చర్మం కాంతులీనుతుంది.
    5. చర్మపు మృతకణాలు తొలిగి కోమలంగా తయారవ్వాలంటే అలోవెరా జెల్‌, కీర దోస ముక్కలను కలిపి గుజ్జుగా చేసి ఇందులో ఓట్‌మీల్‌ కలపాలి. ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాలపాటు చేతి వేళ్లను గుండ్రంగా తిప్పుతూ ముఖం మీద మర్దనా చేయాలి. పది నిమిషాల తరువాత నీళ్లతో కడిగేయాలి. ఈ ప్యాక్‌లను ఎక్కువ మొత్తంలో తయారుచేసి గాలి చొరబడని డబ్బాల్లో నింపి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు. ఇంట్లోనే అలోవెరా జెల్‌ ప్యాక్స్‌ తయారుచేసుకోవటం వల్ల బ్యూటీపార్లర్‌ ఖర్చు తగ్గటంతోపాటు దుష్ప్రభావాలు లేని సౌందర్యం సొంతమవుతుంది.
    6. కలబంద గుజ్జును తీసుకుని అందులో రోజ్ వాటర్ కలిపి శరీరానికి రాసుకుంటే శరీరంలోని మృత కణాలు పోతాయి.
    7. కాలిన చోట కలబంద రసాన్ని రాస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
    8. చర్మంలోని మృతకణాలు పోవాలంటే ముల్తానీ మట్టి లో కొంచెం కలబంద గుజ్జు వేసి ముఖంపై లేదా చర్మంపై రాస్తే అక్కడ ఉన్న చెడు మృతకణాలు పోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది
    9. కలబంద గుజ్జు ముఖ వర్చస్సును పెంపొందించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. కలబంద గుజ్జులో మోతాదుకు సరిపడా పుసుపు జోడించి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే, ముఖం పై పేరుకున్నమురికి తొలగిపోయి కొత్త రూపును సంతరించుకుంటుంది.

    కలబంద జుట్టు కోసం ప్రయోజనాలు

    జుట్టు పెరగడానికి కలబంద

    కలబంద-జుట్టు-పెరగడానికి

    కలబంద కేవలం చర్మ సౌందర్యానికే కాదు మీ జుట్టుకు కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కలబంద జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

    ఎలా ఉపయోగ పడుతుంది

    కలబంద ఆముదము నూనె ఉపయోగించినప్పుడు జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

    మీకు కావాల్సినవి ఏంటి

    • 2 tablespoons కలబంద గుజ్జు
    • 1 టేబుల్ స్పూన్ ఆముదము

    మీరు ఏమి చేయాలి

    1. కలబంద గుజ్జు మరియు ఆముదము నూనె కలపాలి.
    2. నెమ్మదిగా జుట్టు కుదుళ్లపై మసాజ్ చేయండి.
    3. రాత్రిపూట అలాగే ఉంచి మరుసటి రోజు షాంపుతో శుభ్రం చేయండి.

    ఇది ఎందుకు పని చేస్తుంది

    ఆముదము నూనె జుట్టు పెరుగుదలకు అద్భుతమైన పనిచేస్తుంది దీనిలో కలబంద కలిపితే మీ తలపై నిద్రాణమైన జుట్టు పెరుగుదలను ప్రేరేపించటానికి సహాయపడుతుంది.

    కలబంద నూనె చుండ్రుని తగ్గిస్తుంది

    కలబంద అనేది అనేక వాణిజ్య షాంపూ మరియు కండిషన్లలో విస్తృతంగా ఉపయోగించిన పదార్ధంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇది చుండ్రు మరియు చుండ్రు సంబంధిత సమస్యలను శాశ్వతంగా తొలగిస్తుంది అలాగే చుండ్రు వాలా వాచే దురద వంటి సమస్య ఉన్నవారికి అద్భుతంగా పనిచేసి చుండ్రుని శాశ్వతంగా తొలగిస్తుంది

    ఇది ఎందుకు పని చేస్తుంది

    చుండ్రు అనేక కారణాల వల్ల కలుగుతుంది. ఒక జిడ్డుగల చర్మం, చనిపోయిన కణాల వృద్ధి, లేదా ఒక సంక్రమణం కూడా కారణం కావచ్చు కలబంద అన్ని రంగాల్లో సహాయపడుతుంది ఇది మీ చర్మం నుండి చనిపోయిన కణాలను తొలగిస్తుంది. ఇది యాంటీమైక్రోబయల్ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది ఇవి అంటువ్యాధులకు వ్యతిరేకంగా పోరాడతాయి మరియు చర్మం ఉపశమనం కలిగిస్తాయి.

    కలబంద చర్మం యొక్క pH సంతులనాన్ని నిర్వహిస్తుంది

    మీ జుట్టు యొక్క pH సంతులనం సక్రమంగా లేనప్పుడు అంతులేని జుట్టు సమస్యలు దారితీస్తుంది. కలబంద మీ జుట్టు యొక్క pH బ్యాలెన్స్ నిర్వహించడానికి సహాయపడుతుంది.

    ఇది ఎందుకు పని చేస్తుంది

    మీ చర్మం యొక్క pH 5.5 ఇది ఆమ్ల వైపుకి వస్తాయి. వాణిజ్య జుట్టు ఉత్పత్తుల చాలా ముఖ్యంగా షాంపూ మీ చర్మం మరియు జుట్టు యొక్క pH సమతుల్యతను దెబ్బతీస్తాయి కలబంద ఆరోగ్యకరమైన మరియు మెరుగైన జుట్టును ప్రోత్సహించి మీ జుట్టు యొక్క పిహెచ్ సంతులనాన్ని పునరుద్ధరించడానికి సహాయపడుతుంది.

    ఎలా ఉపయోగ పడుతుంది

    మీరు షాంపూ తర్వాత కండీషనర్ గా కలబంద గుజ్జు తీసుకునే తలకి కండిషనర్ల గా అప్లై చేసుకోండి

    కలబంద నూనె

    కలబంద-నూనె

    కలబంద నూనె వల్ల జుట్టు రాలటం, వెండ్రుకలు తెల్లబడటం, ఎఱ్ఱబడటం, చుండ్రు, ఇంకా తలలో వచ్చే అనేక కురుపులు, దురద వంటి సమస్యలు పోవటమే కాకుండా ఎప్పటికి రావు.

    తయారూ విధానం

    • కలబంద గుజ్జు పావు కిలో తీలుకోవాలి.
    • కొబ్బరి నూనె పావు కిలో తీసుకోవాలి.
    • కలబంద మట్టను తీసుకుని, దానిని చీల్చి లోపల వున్న గుజ్జును గీరాలి, ముద్దలుగా వేయవద్దు, గీరితె సాగుతూ వస్తుంది.
    • ఒక బాండిలో కొబ్బరి నూనెను పో సి, అందులో, ఈ కలబంద గుజ్జును వేసి బాగా నూనెలో కలిసిపోయెటట్టు కలపాలి, బాండి పొయ్యి మీద పెట్టి సన్నని సెగ పెట్టి, కలుపుతూ వుండాలి అడుగు అంటకుండ, నీరు అంతా ఆవిరి ఆయిపోయి నూనె మాత్రమే మిగులుతుంది.
    • దించెముందు మర్వం లేక ధవనం వేసి కలపాలి, వాసనకు మాత్రమే, వెయ్యక పోయిన పరవాలేదు .
    • ఈ నూనెను రోజు గోరువెచ్చగా చేసి తలలో కుదుళ్ళకు వ్రాసి బాగా మర్దన చేయాలి.

    కలబంద దంత క్షయ నివారిణిగా

    నోటిలో దంతక్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియాను నిర్మూలించటంలో కలబంద గుజ్జు ప్రభావవంతంగా పనిచేస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. సాధారణ టూత్‌పేస్ట్‌లు కనబర్చే సామర్థ్యం కంటే కలబంద జెల్‌ రెండింతలు ఎక్కువగా సత్ఫలితాలను ఇస్తున్నాయని ఆ అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. పిప్పిపళ్లకు, దంతక్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియాను నివారించటంలో కలబంద కీలకంగా పనిచేస్తుంది. సున్నితమైన దంతాలు ఉన్నవారు కలబంద జెల్‌తో తయారైన పేస్టులతో పళ్లు తోముకుంటే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. అదే విధంగా కలబంద గుజ్జు మధుమేహం, కీళ్లనొప్పులు, జీర్ణకోశ, స్త్రీ సంబంధమైన వ్యాధులకు దివ్యఔషధంగా పనిచేస్తుంది. ఈజిప్టు రాణి క్లియోపాత్ర తన చర్మాన్ని మృదువుగా, అందంగా ఉంచుకునేందుకు ఆ కాలంలోనే కలబందను వాడినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. దాన్నలా పక్కనబెడితే…..కలబంద గుజ్జుతో తయారైన జ్యూస్‌ను తాగటం వల్ల సుదీర్ఘకాలం ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ జ్యూస్‌లో 15 రకాల పోషక పదార్థాలు మిళితమై మంచి శక్తిని ఇస్తాయి.

    Aloe Vera ఆయుర్వేద చిట్కాలు

    1. aloe vera గుజ్జును చెక్కెరతో కలిపి సేవించడము గాని, రసాన్ని తీసి కలకండతో సేవించిన గాని శరీరానికి చల్లదనాన్ని, ఆరోగ్యాన్ని పొందవచ్చు.
    2. aloe vera రసం, పాలు, నీళ్ళతో కలిపి సేవిస్తే, సెగ రోగం, గనేరియా మెహ వ్యాధులు ఉపశామిస్తాయి.
    3. aloe vera గుజ్జును ఉడికించి వాపులు, గడ్డల పై కడితే తగ్గి పోతాయి.
    4. aloe vera రసం లేదా వేరును పసుపుతో నూరి లేపనము చేసిన స్థానవాపు తగ్గి పోతుంది.
    5. aloe vera రసాన్ని పసుపుతో కలిపి సేవిస్తే లివర్, స్ప్లీన్ వ్యాధులు ఉపశామిస్తాయి.
    6. కాలిన పుండ్లపై కలబంద ఆకులను వేడిచేసి రసమును పిండిన బాధ తగ్గటమే కాక వ్రణాలు త్వరగా మానిపోతాయి
    7. రోజు ఉదయం సాయంత్రం 1 1/2 అంగుళాల కలబంద ముక్కను భుజించిన చిరకాలంగా నున్న మలబద్దకము తగ్గిపోతుంది.
    8. aloe vera రసం నిత్యం సేవించుచుండిన స్థౌల్యము తగ్గుతుంది.
    9. aloe vera రసాన్ని లేపనము చేసిన అన్ని రకములయిన చర్మ వ్యాధులు, సూర్య తాపము వలన, X-RAY వలన ఏర్పడు చర్మ రోగాములతో సహా ఉపశామిస్తై.
    10. చర్మ సౌందర్యానికి, ముకములో స్నిగ్దత్వాన్ని కలిగించడానికి కలబందను ప్యాకులలోను, వివిధ ముకలేపనాలలో ఉపయోగించటమే కాక, దీని గుజ్జును కూడా అంటించవచ్చు.
    11. కఫా వ్యాదులలో aloe vera రసాన్ని పసుపులో కలిపి ఎదురురొమ్ముపై రుద్దిన ఉపశమనం కలుగుతుంది.
    12. పంటి నొప్పి, పండ్లు కదులుట యందు aloe vera రసముతో చిగుల్లపై రుద్ధటము గాని, కలబంద ఆకు ముక్కను నములుట గాని చేయాలి.
    13. దగ్గు నివారణకై 1 స్పూన్, మిరియాలు 1/4 స్పూన్, శొంటి 1/4 స్పూన్, తేనెలో కలిపి సేవించాలి.
    14. కడుపు నొప్పి లోను, కడుపులో గ్యాస్ ఏర్పడినపుడు, గోధుమ పిండి, aloe vera గుజ్జు పై వాము, సైంధవ లవణము, జీలకర్ర కలిపి చపాతీలు చేసుకుని భుజించాలి
    15. .
    16. అర్శ మొలల యందు 10 నుండి 30 గ్రాముల aloe vera రసం తాగిస్తూ, కలబంద గుజ్జు పసుపు కలిపి అర్శమొలల పై లేపనము చేయాలి.
    17. చెవి పోటు యందు కొంచెము వేడి చేసి పిండిన aloe vera ఆకు రసాన్ని 1,2 చుక్కలు చెవిలో వేయాలి.

    Aloe Vera ఆయుర్వేద చిట్కాలు – 2

    1. కండ్ల కలక యందు aloe vera ఆకు గుజ్జు కండ్లపై వేసి కట్టాలి.
    2. ఎండాకాలము వడదెబ్బలో aloe vera రససేవనం గ్లుకోస్ వలె పనిచేస్తుంది.
    3. aloe vera గుజ్జును నీళ్ళల్లో బాగా కడిగిన తరువాత మాత్రమే లోపలికి గాని బయటకు గాని తీసుకోవాలి.
    4. కలబందరసం 30గ్రా|| సొంటి పొడి మూడు చిటికెలు కలిపి లోనికి సేవిస్తే తక్షణమే ఎక్కిళ్ళు ఆగిపోతాయి.
    5. aloe veraరసం నెయ్యి సమంగా కలిపి చిన్న గిన్నెలో పోసి ఈ గిన్నెను కామెర్లు రోగి ముక్కు వద్ద పెట్టి మాటి మాటికి వాసన చూపిస్తుంటే మంచి ఫలితం కని పిస్తుంది. ఇలా చేస్తూ ఇతర మందులు కూడా వాడుకోవాలి
    6. >
    7. aloe vera మట్టను మధ్యలోకి చీల్చి ఆగుజ్జు పైన సైంధవలవణం పొడిచల్లి కుక్కకరచినచోట దానిని వేసి కట్టుకట్టాలి. రోజూఒకసారి కట్టుమారుస్తూ వుండాలి. ఇలా నాలుగుసార్లు చేస్తే కుక్క విషం హరించి పోతుంది.
    8. aloe vera గుజు ఒకకేజీ, గోధుమపిండి అరకేజీ, ఆవునెయ్యిఅరకేజీ, పటికబెల్లంపొడి (మిస్ట్రీ, నౌబోతు, కలకండ) రెండున్నర కేజీలు తీసుకోవాలి. ముందుగా కలబందరసాన్ని నెయ్యిలోవేసి ఎర్రగా వేయించి తీసి పక్కన ఉంచాలి. అలాగే గోధుమపిండినికూడా ఆవు నేతిలో కొంచెం ఎర్రగా అయ్యేవరకు వేయించాలి. ఆ తరువాత పటికబెల్లాన్ని చిన్నమంటపైన మరిగిస్తూ పాకంరాగానే కలబందగుజ్జును గోధుమపిండిని ఆవు నేతిని అందులో కలిపితే హల్వా తయారవుతుంది. ఈ హల్వాను రోజూ రెండుపూటలా ఒకచెంచా మోతాదుగా తింటూవుంటే మొండికి పడిన కీళ్ళ నొప్పులు తగ్గిపోతయ్.
    9. కలబందవేరు తెచ్చి కడిగి ముక్కలుచేసి నీడలో గాలికి ఆరబెట్టి దంచి పొడిచేసి నిలువవుంచుకోవాలి. రోజూ పరగడుపున కలబందపొడి 5 1, ఒకకప్పు ఆవుపాలతోకలిపి ఒకచెంచా కండచక్కెరకూడా వేసి తాగుతుంటే స్త్రీపురుషులు అత్యంత బలవంతులుగా శౌర్యవంతులుగా తయారౌతారు.
    10. ఉదయాన్నే పరగడుపున కల బంద ఆకుని తింటే, కడుపులో ఉన్న అన్ని రకాల వ్యాధుల్ని మటుమాయం చేస్తుంది. అలాగే సాధారణ వినియోగంలోకి వస్తే, aloe vera ఆకుల రసంలో కొబ్బరినీటిని కలిపి శరీరంలో ఉండే నల్లని భాగాలలో రాస్తూ వుంటే నల్ల మచ్చలుగానీ, మూలల్లో ఏర్పడిన నలుపుగానీ వెంటనే పోయి శరీర కాంతి పెరుగుతుంది.
    flax seeds benefits in telugu అవిసె గింజల వల్ల కలిగే 5 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు