neem tree health benefits వేప: ఆరోగ్య ప్రయోజనాలు, ఉపయోగాలు, దుష్ప్రభావాలు

vepa-chettu-uses-in-telugu

వేప ఆకులను ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు సర్వరోగ నివారిణిలా పనిచేస్తుంది ఇది కడుపులో అల్సర్, బర్నింగ్, గ్యాస్, కుష్టు వ్యాధి, కంటి రుగ్మతలు, , కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం, చర్మపు పూతల, గుండె మరియు రక్త నాళాల వ్యాధులు వంటి సమస్యలను తొలగిస్తుంది.

యుగ యుగాల నుండి మన దేశంలో గృహ వైద్యం లోను, ఇతర విధులు గాను వేప Neem Tree ఉపయోగాలు ఉంది వేప చెట్టు లో బెరడు, ఆకులు, పువ్వులు, గింజలు, కలప, నూనె, పిట్టు… సమస్తం మన ఆరోగ్యం పెంచడానికి ఉపయోగపడుతుంది. సమూలంగా ఉపయోగపడే వేపతో వేయి లాభాలు ఉన్నాయి అన్నారు అందుకే.

సృష్టి లో పదార్థాల్ని ముఖ్యంగా వృక్ష సంబంధ పదార్థాలు అధిక భాగం మానవుడికి ఏదో రూపంగా ఉపయోగ పడుతున్నాయి. వేలాది సంవత్సరాల క్రితం నుండి వేపు అనేక చర్మ వ్యాధులు, చిరకాలంగా తగ్గని పుళ్లు, మధుమేహం, రక్త దోషాలు, శరీర దుర్గంధం, ప్రేగుల్లో క్రిములు మొటిమలు మొదలైన రోగాలను నయం చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది.

neem tree health benefits వేప చెట్టు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం

షుగర్-వ్యాధితో

neem tree దంత సంరక్షణ

వేప-దంత-సంరక్షణ

వేపలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటాయి, ఇవి బ్యాక్టీరియాను మీ దంతాలకు అంటుకోకుండా చేస్తుంది. వేప యొక్క యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చిగురువాపును నివారించడానికి సహాయపడతాయి, తీవ్రమైన చిగుళ్ల వ్యాధితో వల్లే వచ్చే చిగుళ్ల రక్తస్రావం నీ తగ్గిస్తుంది. వేప నోటిలోని బ్యాక్టీరియా తగ్గించి దుర్వాసనను తొలగించడానికి సహాయపడుతుంది

 1. పళ్ళు (Tooth / Dental) చిగుళ్ళు శుభ్రం చేయడానికి వేప పుల్లలు ఉపయోగిస్తారు. పంటి వ్యాధులు దరిచేరవు.
 2. లేత vepa కొమ్మల తో పళ్లు తోమడం ఒక అలవాటుగా మార్చుకున్న వారికి నోటి దుర్వాసన, డయేరియా, చిగుళ్ల నుంచి రక్తం కారడం పూర్తిగా తగ్గుతుంది.

వేప చెట్టు షుగర్ వ్యాధితో

షుగర్-వ్యాధితో

షుగర్ వ్యాధితో బాధపడే వారి పాలిట vepa ఒక సంజీవని అని చెప్పవచ్చు వేపాకు రక్తంలో షుగర్ స్థాయిని పెరగకుండా చేసి షుగర్ వ్యాధిని తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది.

 1. లేత వేపాకు చిగుర్లు నిత్యం కొంత తీసుకోవడం వల్ల చక్కెర వ్యాధి నియంత్రించవచ్చు
 2. vepa చిగుళ్లు ఉప్పు వేసి మెత్తగా నూరి చిన్న చిన్న ఉండలుగా చేసి నిత్యం ఉదయం సాయంకాలం తీసుకుంటూంటే చక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది. (హైబీపీ ఉన్నవాళ్లు దీనిని ఉపయోగించవద్దు
 3. vepa పువ్వు మధుమేహ వ్యాధికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది అని ఇటీవల పరిశోధనలో తేలిన అంశం మెంతులు, లేత వేప ఆకులు రుబ్బి, ఆ రసం వడకట్టి కటిక చేదు గానే ఉన్నప్పటికీ రోజుకు రెండు పూటలా ఓ స్పూన్ చొప్పున తీసుకుంటూంటే మధుమేహం తగ్గుతుంది.

వేప బెరడు

వేప-బెరడు

వేప బెరడు చేదుగా ఉన్న, మన ఆరోగ్యం మరియు సౌందర్యాన్ని పెంచడానికి బాగా పనిచేస్తుంది వేప బెరడు చర్మవ్యాధులకు, జ్వరాలు, అంటువ్యాధులకు మంచి మందు. వేప కొమ్మలు విరిచి. పళ్లుతోమే పుల్లగా వినియోగించేవారు, నేటికీ మనకు గ్రామ ప్రాంతాల్లో కనిపిస్తుంటారు. వేప వేరు కీ, బెరడు కీ కూడా రోగాల్ని అరికట్టే శక్తి ఉంది.

 1. ఆకలి మందగించినపుడు, కాలేయ వ్యాధులు ఉన్నప్పుడు, వేప చెట్టు బెరడు 60 గ్రా|| తీసుకుని 4 గ్లాసు నీళ్ళలో కలిపి ఉడికించి కషాయంగా చేసుకోవాలి. ఈ నీళ్లు బాగా ఇగర కాచాలి. అంటే 3 గ్లాసుల నీళ్లు ఇగిరిపోవాలన్న మాట ! ఇప్పుడు దీనిని 4 భాగాలుగా విభజించి 4 రోజులుగా రోజుకు రెండు సార్లు ఇవ్వాలి. ఇలా తాగుతే ఆకలి పుడుతుంది కాలేయ వ్యాధులు మోటు మాయం అవుతాయి
 2. వివిధ అధ్యయనాల ప్రకారం, కడుపు మరియు పేగు పూతల నివారణకు వేప బెరడు సారం కనుగొనబడింది. బెరడు సారాన్ని 10 వారాలపాటు ప్రతిరోజూ రెండుసార్లు తీసుకోవడం వల్ల ఆచరణాత్మకంగా పూతల నయం అవుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. బెరడు మలేరియా మరియు అనేక చర్మ వ్యాధులను నయం చేయడానికి కూడా సహాయపడుతుంది.
 3. లేత వేప బెరడు, ఆకుల తో నూరి గాయాలు పై పూత గ వాడుకోవచ్చు
 4. వేప బెరడు పొడిని రెండు చెంచాలు ఉదయం, రాత్రి గోరు వెచ్చని నీటితో సేవిస్తే మలేరియా తగ్గుతుంది.
 5. వేప బెరడు ని కాల్చి మసి చేసి సీసాలో ఉంచి భద్రపరచుకోవాలి. రాశి కారే పుండు మీద ఆ మసి చల్లితే పుండ్లు మానుతాయి. రాసి తగ్గుతుంది.
 6. వేప చెట్టు బెరడు చర్మ రోగ నివారిణి గా పనిచేస్తుంది. వేప బెరడు కషాయం లా కాచి, చల్లార్చిన ఉదయం సాయంత్రం (రెండు పూటలా) సేవిస్తే చర్మ వ్యాధులు నివారణ అవుతాయి.
 7. ప్రేగుల్లో క్రిములుంటే, వేప చెట్టు బెరడు (పట్టా) మెత్తని చూర్ణం చేసి ఉదయం సాయంత్రం ఒక్క చెంచా చొప్పున వారం రోజులు తీసుకోవాలి.
 8. వేప గింజల 10 గ్రా. శొంఠి 10 గ్రా, తులసి ఆకులు తీసుకుని కలిపి మెత్తగా నూరుకోవాలి. దీని మీద నల్ల మిరియాల పొడి కొంచెం చెల్లి తిరిగి ” నూరుకోవాలి. దీన్ని ఉదయం, సాయంత్రం సేవిస్తూంటే కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
 9. లేత వేపాకులు గ్లాసు నీటిలో అరగంట పాటు నానబెట్టి తర్వాత అరగంట పాటు మరగబెట్టాలి. ఇది చల్లారాక వడగట్టి ప్రతి రెండు గంటలకు ఒకసారి సేవిస్తే కాలేయానికి సంబంధించిన సమస్యలు తగ్గుతాయి.

వేప పూత

వేప-బెరడు

వేప యొక్క పూవు లు, పూత సమయంలో అధికంగా సేకరించి.ఎండబెట్టి నిల్వ చేస్తారు. వీటిని పౌడర్ గా చేసి, జీర్ణశక్తిని పెంచే ఔషధాలు వినియోగించుకోవచ్చు. వేపకాయల ను, కడుపులో పరుగులు చావడానికి ఉపయోగిస్తారు,

 1. వేప పువ్వులు నూరి కట్టు కట్టడంతో కుష్టు, బొల్లి, సోరియాసిస్ వంటి చర్మవ్యాధులు పోతాయి.
 2. వేప పువ్వు బోదకాలు నివారణ బాగా ఉపకరిస్తుంది.
 3. 2 వేప పువ్వు నూనె/నెయ్యి లో వేయించాలి. దీనికి కొద్దిగా ఉప్పు, చిటికెడు మిరియాలు పొడి చేర్చి నిత్యం ఉదయం మధ్యాహ్నం తినే అన్నం మొదటి ముద్దు కలుపుకొని తినడం వల్ల ఉబ్బసం వ్యాధి తగ్గుముఖం పడుతుంది.
 4. 2 వేప గింజల రసాన్ని తేనెతో కలిపి సేవిస్తే పచ్చ కామెర్ల వ్యాధి నయం అవుతుంది.
 5. చర్మంపై పొంగు వ్యాధి వల్ల ఏర్పడే మచ్చలను, వేప చిగుళ్లను నూరి మర్దనా చేసి మచ్చలు పోతాయి !
 6. వేప పండ్లు తింటే మలబద్దకం నివారణ అవుతుంది.
 7. వేప పువ్వు పొడి, కొంచెం తేనె లేక బెల్లం తో కలిపి తీసుకుంటే బలహీనత తగ్గుతుంది.

వేప నూనె

vepa గింజల లోనే 45 శాతం వరకు నూనె పదార్థం ఉంటుంది. దీన్ని కుష్టు రోగానికి, చర్మ వ్యాధులు వాడతారు. పల్లెటూర్లలో ఒకప్పుడు చాలా చవగ్గా వచ్చేదని వేప నూనె తలకు పట్టించి వారు. ఆముదం కన్నా ఇది అప్పట్లో చౌకగా లభించేదని పెద్దలు చెబుతారు. కాలం మరి, విలువలు తెలిశాక వేప నూనె ఎంత అరుదై పోయిందంటే, పల్లెపట్టు లో నేడు సువాసన తైలాలు దర్శనమిస్తున్నాయి. లేదా శిరోజాలకు ఏది పట్టించకుండ ఖర్చు దండగ అని అలానే వదిలేస్తున్నారు. కొందరు కొబ్బరి నూనెతో సరిపెట్టుకుంటున్నారు. కొద్దిపాటి శ్రమతో ఈ నూనెను కటిక చేదుగా ఉన్నప్పటికీ కడుపులోకి పంపిస్తే, పొట్టలో పురుగులు – ఏలిక పాములు నశిస్తాయి,

ఉబ్బసం నయం: నిపుణుల అభిప్రాయం ప్రకారం, వేప నూనె శ్వాస సమస్యలు లేదా ఆస్తమాను నయం చేస్తుంది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

ప్రతిరోజూ కొన్ని చుక్కల వేప నూనె , తీసుకోవడం క్రమంగా పెరుగుతుంది. ఇది కఫం, దగ్గు మరియు జ్వరాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.

 1. వేప నూనె రాసి, తామర, దద్దుర్లు నివారించవచ్చు
 2. అల్సర్లు, పేగు పూత వంటివి నివారణ అవుతాయి. కీళ్లు – జాయింట్ల వద్ద మర్దనా చేస్తే వాతప్పు పట్లు వేళ్ల నొప్పులు తగ్గుతాయి, ఇటీవల వేపనూనె సరాసరి సబ్బుల్లోను టూత్ పేస్ట్ లో ను ఉపయోగిస్తున్నారు,
 3. వేప నూనె శరీరానికి రాయడం వల్ల చర్మ సంబంధ వ్యాధిని నివారణ అవుతాయి
 4. వేప పువ్వు రక్తశుద్ధి కలుగజేస్తుంది.
 5. వేప పువ్వు మధుమేహ వ్యాధికి కూడా ఎంతో గుణకారిణి అని ఇటీవలపరిశోధనలో తేలిన అంశం.
 6. వేప నూనె రాస్తుంటే చర్మం నునుపు దేలుతుంది.
 7. వేప నూనె ఒక గ్రాము రోజూ పరగడుపున సేవిస్తే మధుమేహం నయం చేయవచ్చు! కేంద్ర ఆయుర్వేద పరిశోధనా సంస్థ వారు జరిపిన పరిశీలన లో వేప నూనె (నింబిడిన్) సొరియాసిస్ వ్యాధి, చిన్న చిన్న కురుపులు తగ్గించడంలో దోహద పడుతుంది.
 8. వేప పువ్వు — పండ్లు విరోచనకారిగా ఉపయోగపడతాయి.
 9. వేప విత్తనాలు కుష్టు రోగ నివారణలు ఉపయోగపడతాయి.

వేప పిట్టు

వేప గింజలు నుండి నూనె తీయగా మిగిలిన దాన్ని వేప పిట్టు అంటారు. దీనికి కూడా వేప నూనె కున్నంత ప్రభావం లో 3వ వంతు ప్రభావం ఉంటుంది. మన దేశంలో దీన్ని ఎరువుల – క్రిమిసంహారక మందుల్లోనూ ఉపయోగిస్తున్నారు. మనదేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇండియన్ అగ్రికల్

 1. వేప చిగురు రోజూ తినడం అలవాటు గా మార్చుకున్న వారికి దగ్గు, అజీర్ణం, కడుపులో పురుగుల బెడద ఉండవు,
 2. నూరిన వేపాకు ముద్ద 1 టీస్పూన్, చిటికెడు ఉప్పు కలిపి, ఉదయాన్నే ఖాళ కడుపున ఉండగా 7 రోజు వరుసగా తీసుకుంటే నులిపురుగులు గొప్ప గుణం కన్పిస్తుంది
 3. .
 4. వేప లేతాకులు రోజూ నమిలి తినేవారికి కడుపు ఉబ్బరమనేది ఉండదు. కడుపు నొప్పి వారి దరిజేరదు.
 5. వేపాకులు నమిలితే వాంతులు, వామిటింగ్ సెన్సేషన్ కూడా తగ్గుతాయి
 6. .
 7. వేపాకు రసం కాలేయం మీద పని చేసి సర్వ రోగాలను అరికడుతుంది. ( అమ్మవారు (చికెన్ పాక్స్) సోకిన వ్యక్తి పరుపు/పడకపై వేపాకులు పరవడం పూర్వం నుంచి ఉంది.
 8. అమ్మవారు తగ్గిన తర్వాత వేప ఆకులు – మిరియాలు కలిపి మెత్తగ నూరి శరీరానికి పూర్తిగా పూయడం, అలాగే ఉసిరికాయంత వేప ముద్ద రోజూ రెండుసార్లు నోట్లోకి తీసుకోవడం ఉత్తమం.
 9. వేసవి కాలం ఆరంభం నుంచి నిత్యం ఉదయం వేప చిగుళ్లు నమిలితే వడగాలులు – ఎండ తీవ్రత నుంచి తట్టుకునే శక్తి లభిస్తుంది.

వేప కళ్ళు

 1. వేప నూనె రస్తూ వుంటే కనురెప్పల క్రింద ఏర్పడే నల్లని చారలు, వలయాలు మాయం అవుతాయి
 2. రోజు కొద్ది చుక్క వేప నూనె కంటి చుట్టూ రాస్తే కళ్ళు, కను రెప్పలు ఆరోగ్యంగా తాజాగా ఉంటాయి.
 3. కళ్ళు మంటలు గా ఉన్నవారు వేపచిగుర్లను కంటి మీద పెట్టుకుంటే మంట తగ్గుతాయి.
 4. vepa నూనె లో ముంచిన వత్తి ని వెలిగించి వచ్చిన మసి తయారుచేసిన కాటుక కళ్లకు ఎంతో మంచిది. దీనిని కానుకగా వాడటం వల్ల అన్ని రకాల కంటే వ్యాధులు నయం అవుతాయని అనుభవంలో తేలిన అంశం.

వేప తలకు

 1. వేప పువ్వు గోరువెచ్చ గా వేడి చేసి, తలకు రుద్దితే వెంట్రుకలు పొడిగా నల్లగా దట్టంగా ఉంటాయి.
 2. వేపకు నీట్ లో మరగ బెట్టి, ఆ నీటితో తలస్నానం చేస్తే చుండ్రు – దురద తగ్గుతాయి.
 3. వేప నూనె తలకు రాస్తుంటే జుట్టు రాలడం తగ్గుతుంది.
 4. వేప నూనె ను క్రమం తప్పకుండా మూడు నెలలపాటు తలకు రాసి చూడండి ! వెంట్రుకలు పెరగడం – వెంట్రుకలు నిగనిగలాడడం తధ్యం.
 5. బట్టతల ఉన్నవారు నిత్యం రాత్రిపూట పడుకోబోయే ముందు వేప నూనెను రాసుకుని ఉదయం పూట ప్రతిరోజూ శిరః స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. (అయితే – వేపనూనె వాసన భరించడం కష్టం. అలవాటు పడాల్సి ఉంటుంది
 6. మరగబెట్టిన కొబ్బరినూనెలో వేపాకు రసం కలిపి, కొబ్బరి నూనె కు రంగు మారడం గమనించి, ప్రతిరోజూ తల పట్టిస్తూ వుంటే చుండ్రు బాధ – పేల బాధలు అంతరిస్తాయి.

అందాలని పెంచే

సొగసులు ద్విగుణీకృతం చేసుకోవాలి అంటే మార్కెట్లు నిండా కిక్కిరిసిన క్రీములనేకొనుక్కోవలసిన అవసరం లేదు. అందాలని పెంచే ఎన్నో సాధనాలు వంటించి ఉంటాయి. వివిధ రకాల చెట్ల ఆకులకు వైవిధ్యమైన వైద్య లక్షణాలుంటాయి.

 1. ఎన్నో రకాల చర్మ సంబంధిత సమస్యల నివారణ లో ఈ ఆకు వైద్యం అద్భుతంగా పనిచేస్తుంది. రకరకాల ఆకులను ఉపయోగించి అందానికి మెరుగులు దిద్దుకోవచ్చు.
 2. మన చుట్టూ మన అందుబాటు లో ఉండే ఆకులతో అందాన్ని పెంచే కోవడం తోపాటు ఎన్నో ఉపయోగాలున్నాయన్న విషయం తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది.
 3. వేపాకులను దంచి, ముఖం పైన గల మొటిమలు, మచ్చలు రాస్తూ వుంటే, (మండలం రోజులు క్రమం తప్పకుండా) అవి మటుమాయం కావడంలో ఆశ్చర్యపోనక్కర్లేదు
 4. వేపాకులు మెత్తగా నూరి గాయాల మీద రాయడం వల్ల చర్మవ్యాధులు ముఖ్యంగా గజ్జి, తామర, ఎగ్జిమా, తీట, గుల్ల కురుపులు క్రమంగా తగ్గిపోతాయని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు!
 5. పల్లెటూళ్ళలో ఇప్పటికే పడతులు తమ ముఖ సౌందర్యానికి, వేపాకు – పసుపు ముద్దగా నూరి ముఖానికి పట్టించి స్నానం చేయడం తగిన సాధనంగా పేర్కొంటున్నారంటే వేపాకు మహిమ మన ఊహించవచ్చు !
 6. vepaకు పొడి తేనెతో కలిపి ముఖానికి పట్టించి, ఓ అరగంట తర్వాత కడిగేస్తూ ఉంటే, ముఖంలో 40 రోజులు కొత్త కాంతులు తళుక్కుమంటాయి.
 7. వేపపొడి, పసుపు, రోజ్ వాటర్ సమపాళ్లలో కలిపి, వారానికి రెండు సార్లు ముఖానికి రాసుకుంటే మొటిమలు మచ్చలు తగ్గుతాయి.
 8. vepaకు కాల్చి, ఆ భస్మాన్ని నేతితో కలిపి ముఖానికి పూస్తే ఎటువంటి మచ్చటైన నెలలో గానే మటు మాయం అవుతాయి. పూత పూసిన రెండు గంటలకు ‘మార్గో’ (వేప) సబ్బుతో ముఖం కడుక్కోవాలి. రీచేయించుకుంటున్న
 9. vepa పచ్చి ఆకులను వేసి మరిగించిన నీటితో రోజుకు ఐదారు సార్లు ముఖం కడుక్కోవడం ద్వారా మొటిమల్ని నివారించవచ్చు ! ఇలా ముఖం కడుక్కుని కుంకుమాది లేపనం పూయాలి.
 10. కొందరికి అరికాళ్లు, అరిచేతులు మృదుత్వం కోల్పోయి మొద్దు బారినట్లు రఫ్ గా ఉంటాయి. ఇటువంటి సమస్యలున్నవారు ప్రతిరోజూ నిద్రించే ముందు వేప గింజల పొడి చేసి, ఆముదం లో కలిపి బాగా నిర్ధన చేసుకుంటే కాళ్లు చేతులు మృదువుగా మారతాయి.
 11. ఉడుకు వేడి నీళ్లలో వేపాకు వేసి, స్నానం చేసే ముందు ఆ నీళ్లు, సాధారణంగా స్నానానికి వేడి నీటిలో పోసుకుని కాస్త రోజ్ వాటర్ కలిపి స్నానం చేస్తే రోజంతా తాజాగా ఉండే అనుభూతి లోనవుతారు.
 12. వేప – గులాబీ పూల రేకులు సమాన పాళ్ళలో తీసుకు ని, వాటిని ఆవిరి మీద ఉడికించి, ముద్దగా చేసి, ముఖానికి 2 వారాల పాటు దట్టంగా పట్టిస్తూ, ఓ గంట సేపు ఉంచి స్నానం చేస్తూంటే ముఖ సౌందర్యం పెరుగుతుంది.
 13. వేపాకులు, పాలు, సెనగ పిండి, పసుపు పొడి సమపాళ్లలో కలిపి మెత్తగా పేస్టు లా రుబ్బు, ఆ ముద్దు ముఖానికి రాసుకుని అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇది కూడా మొటిమల నివారణ ిగా సమర్థవంతంగా పనిచేస్తుంది.
 14. రక్తం పరిశుభ్రంగా ఉంటే, ముఖ సౌందర్యం ఇనుమడిస్తుంది. వేపపువ్వు రోజూ (కాలం లో) తినండి ! మీ రక్తం శుద్ధి అవుతుంది. దేహ సౌందర్యానికి దో గొప్ప సాధనం.

వేప ఆరోగ్యం

  వేప కడుపులో నులి పురుగులు నిర్మూలించే శక్తి వేపపూతక్ కూడా ఉంది.
 1. వేపకు కషాయం ఏలిక పాములు నివారణ అపూర్వం గా పనిచేస్తుంది ఆయుర్వేద శాస్త్రం తెలుపుతోంది.
 2. వేప కషాయం ప్యాంక్రియాస్ గ్రంధి, రక్తంలో ఇన్సులిన్ స్థాయిని క్రమబద్దీ కరించడానికి తోడ్పడుతుంది.
 3. వేపకు కషాయం రోజుకు రెండుసార్లు తాగితే ఎటువంటి జ్వరమైనా తగ్గిపోతుంది.
 4. వేపాకులు ఉడికించి పట్టి వేయడం వల్ల పిల్లలకు జలుబు, దగ్గు తగ్గుతాయి. పట్టు ఛాతీ పై వేయాలి
 5. వేపాకు 100 గ్రా. నీరు 250 గ్రా. బాగా కలిపి ఉడకబెట్టాలి. ఈ కషాయాన్ని చల్లార్చిన రోజు ఉదయం సాయంకాలం సేవిస్తూంటే ఆకలి పుడుతుంది.
 6. వేపాకు పొడి సున్నిపిండి సమపాళ్లలో కలిపి వాడితే చర్మ వ్యాధులు దరిచేరవు. రక్తం గడ్డకట్టకుండా ఉంచే గుణం వేపకు ఉంది.
 7. వేపాకులు, తేనె కలిపి నూరి కట్టు కొడితే, అన్ని రకాల ప్రణాలు మాయం అవుతాయి.
 8. వేపాకులు మెత్తగా నూరి ముద్దగా చేసి, దానియందు సమపాళ్లలో తేనె కలిపి సేవిస్తే ఆయాసం తగ్గుతుంది.
 9. వేపాకు పసరు గాయం తగిలిన చోట ఉంచి కట్టు కడితే వాపు, నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. వేపాకు మిరియాలు కలిపి నూరి కట్టుకట్టినా ఇదే ఫలితం.
 10. వేపాకు పసరు పాముకాటుకు – తేలుకాటుకు దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది.
 11. వేపాకు పసరు తాగితే కడుపులో విషక్రిములు పరిపూర్ణంగా నశిస్తాయి
 12. వేపాకు నమిలి రసం మాత్రమే మింగితే కడుపు నొప్పి నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది.
 13. వేపాకు పొడి తేనెతో కలిపి ఉదయం, సాయంకాలం తీసుకుంటే జలుబు, దగ్గు తగ్గుముఖం పడతాయి.
 14. వేపాకు పసుపు మెత్తగా నూరి రాస్తే అరికాళ్ల పగుళ్లు నెమ్మదిస్తాయి.
 15. వేపాకు కషాయాన్ని సేవించడం వల్ల మూత్ర పిండాలు సంబంధించిన జబ్బులు నయం చేయవచ్చు !.