25 best Nutrition food భూమిపై 25 అత్యంత పౌష్టికాహారం

Aloe-Vera

Nutrition food in Telugu – పౌష్టిక ఆహారం

మనిషి జీవనానికి పోషక విలువలు గల ఆహారం అత్యంత అవసరం. ఇవి లేని నాడు జీవించడం సాధ్యంకాదు. గాలి, నీరు,పౌష్టిక (Nutrition food) కలుషితమైతే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. వీటితో పాటు శరీర వ్యాయామం ఉన్నట్లయితే దృఢంగా పని చేయగలుగుతారు. మనస్సు, శరీరం దృఢంగా ఉండి ఆరోగ్యంగా జీవించడానికి తగినన్ని పోషక విలువలు అందించగల ఆహార పదార్థాలను ఎంచుకోవాలి, ఎక్కడబడితే అక్కడ లభించే జంక్ ఫుడ్ హాని కలిగిస్తుందని ఆహార నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు.

పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు

 • గుమ్మడికాయ
 • గుడ్డు
 • పప్పుధాన్యాలు
 • టొమాటోలు
 • అరటిపండు
 • వెల్లుల్లి
 • క్యాబేజీ, క్యాలిఫ్లవర్, తోటకూర
 • బచ్చలి కూర

అన్ని రకాల విటమిన్లు, ఖనిజ లవణాలు తదితర పోషక విలువలున్న ఆహార పదార్థాలను నిత్యం తీసుకోవాలి. మనం తప్పనిసరిగా తీసుకోవాల్సిన వాటిలో ఈ పదార్థాలను చేర్చండి. ఆరోగ్యాన్ని కలిగించే 25 రకాల పదార్థాలలో ఉండే పౌష్టిక ఆహారం (Nutrition food) విలువలేమిటో వివరంగా తెలుసుకుందాం.

గుమ్మడికాయ
గుమ్మడికాయ

ఇందులో చాలా ఎక్కువగా బీటా కెరొటిన్ ఉంటుంది. శాకాహారానికి చెందిన ఈ కాయలు విరివిగానే లభిస్తాయి. బీటా కెరొటిన్ క్యాన్సర్ రిస్కును తగ్గిస్తుంది. శరీరానికి తక్కువ క్యాలరీలు అందిస్తుంది. కళ్ళుకు, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ ‘ఏ’ మరియు విటమిన్ సి కూడా సమృద్ధిగా లభిస్తుంది. అలాగే డయాబెటిస్ తగ్గించడానికి సహాయపడుతుంది

‘ఎ’ విటమిన్ కణజాలం పొరలో చేరి మూలంలో కణాలు దెబ్బతినకుండా పోరాడుతుంది. అందువల్ల హాయిగా గుమ్మడికాయ రక రకాల వంటగా చేసుకుని తినవచ్చు. లేదా జ్యూస్గా తయారు చేసుకుని తీసుకోవచ్చు. సూప్ లాగా వండుకోవచ్చు. ఎన్నో పోషక విలువలు ఉన్న గుమ్మడి కాయను తీసుకోవడం మంచిది.

పౌష్టిక ఆహారం తో (Nutrition food) పాటు కొన్ని చిట్కాలు

 1. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారు గుమ్మడికాయను తీసుకోవడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది
 2. గుమ్మడిని తీసుకోవడం వలన చక్కెర వ్యాధిగ్రస్తులకు రకరకాల ఉపయోగాలున్నాయి. రక్తంలోనిగ్లూకోజ్‌ను బాగా తగ్గిస్తుంది.
 3. గుమ్మడి విత్తనాలను ఎండబెట్టి పొడిచేసి నీళ్ళలో కలిపి తాగితేమూత్ర సంభంద వ్యాధులు తగ్గుతాయి
 4. గుమ్మడిన గింజల నుంచి తీసే నూనె వాడడం వలన అధికరక్తపోటు అదుపులో ఉంటుంది
టొమాటోలు
టొమాటోలు

మనకు చాలా ఎక్కువగా లభించే ఎర్రగా, అందంగా, చూడముచ్చటగా కనిపించే టొమాటోలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తాయి. సాధారణంగా రోజుకి ఒక యాపిల్ తింటే డాక్టరు అవసరం లేదని చెపుతారు. మనకు అన్ని కాలాల్లో లభించే టమాటోలు తీసుకుంటే డాక్టరుతో అవసరం ఉండదని చెప్పవచ్చు. యాపిల్స్ ధర ఎక్కువగా ఉండి అందరికీ అందుబాటులో ఉండవు. టొమాటోలు ఉంటాయి. రోజుకు నాలుగు టొమాటోలు తీసుకుంటే క్యాన్సర్ రిస్క్ ను దూరం చేయవచ్చునని పరిశోధకులు చూపుతున్నారు. హృదయ సంబంధమైన వ్యాధుల నివారించడంతో పాటు అత్యంత ఎక్కువ పోషక (Nutrition food) విలువలు కలిగి ఉంటుంది.

 1. టమోటాలు తింటే కొలెస్ట్రాల్‌, అధిక రక్తపోటు, గుండె జబ్బులు తగ్గుతాయి
 2. ప్రతి రోజు టమోటాలుఆహారంతోపాటు తీసుకుంటుంటే శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. టమాటోలు తింటే బరువు తగ్గుతారని పరిశోధకులు చెప్తున్నారు
అరటిపండు

క్రీడాకారుల వలె ఉత్సాహంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. సంతృప్తికరమైన ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ఇందులో సహజ సిద్దమైన తీపి ఉండి తక్షణం శక్తినిస్తుంది. అంతేకాదు మలబద్దకం నివారణకు అదే సమయంలో పలచగా విరేచనాలు అవుతుంటే అరికట్టడానికి పనిచేస్తుంది. అందువల్ల అన్ని సీజన్లలో లభించే అరటిపండులు మన భోజనంలో భాగం చేసుకోవచ్చు. దీంట్లో ఉండే పోషక విలువల (Nutrition food) వల్ల శరీరానికి చాలా ఉపయోగపడుతుంది

అరటిపండు

క్రీడాకారుల వలె ఉత్సాహంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. సంతృప్తికరమైన ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ఇందులో సహజ సిద్దమైన తీపి ఉండి తక్షణం శక్తినిస్తుంది. అంతేకాదు మలబద్దకం నివారణకు అదే సమయంలో పలచగా విరేచనాలు అవుతుంటే అరికట్టడానికి పనిచేస్తుంది. అందువల్ల అన్ని సీజన్లలో లభించే అరటిపండులు మన భోజనంలో భాగం చేసుకోవచ్చు. దీంట్లో ఉండే పోషక విలువల (Nutrition food) వల్ల శరీరానికి చాలా ఉపయోగపడుతుంది

 1. అరటిపండ్లలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ శరీరంలో ప్రవేశించగానే సెరటోనిన్‌గా మారి ఒత్తిడిని తగ్గిస్తుంది. అందుకే రాత్రిపూట పాలు, అరటిపండు తీసుకుంటే నిద్ర బాగా పడుతుందని చెబుతారు
 2. అరటిపండులో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండెజబ్బుల్ని నివారించడమే కాకుండా ఎముకల ఆరోగ్యాన్నీ కాపాడతాయి.
 3. అరటి తొక్క లోపల బాగాన్ని దోమ కరచిన దగ్గర రుద్దడం వలన దురద మరియు వాపు తగ్గిపోతుంది
వెల్లుల్లి
అరటిపండు

క్యాన్సర్ ను తగ్గించే రసాయనం ఇందులో ఉత్పత్తి అవుతుంది. ఈ రసాయనం క్యాన్సర్ కారక పదార్థాలను నిర్మూలిస్తుంది. రోజుకు మూడు, నాలుగు వెల్లుల్లి రెబ్బలను తిన్నట్లయితే కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. కాలేయం ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తుంది. కీళ్ళ నొప్పులపైన కూడా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఇది మంచి పోషక ఆహారం గా చెప్పుకోవచ్చు.

 1. వెల్లుల్లి అల్లంతో కలిపి తింటూవుంటే ఎటువంటి ఎలర్జీలు దరిచేరవు
 2. ప్రతి నిత్యం పరగడుపున 2, 3 వెల్లుల్లి రేకలు తినడం వలన ఉదరసంబంధ వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు
 3. వెల్లుల్లి తీసుకోడం వలన జీర్ణశక్తి వృద్ధిచెంది మంచి ఆకలి పుడుతుంది
క్యాబేజీ, క్యాలిఫ్లవర్, తోటకూర
cabbage-vegetable

ఇవి మేటి కూరగాయలుగా ప్రసిద్ధి. శాకాహారులుగాక అందరూ వీటిని ఇవి లభించే సీజన్లలో విరివిగా వాడుకో వచ్చు మంచి పోషక ఆహారం గా చెప్పుకోవచ్చు. వీటిని ఎక్కువగా తినడంవల్ల కూడా క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. వీటిని ఉడికించే తినాలి. ఎందుకంటే ఇవి జీర్ణం కావడం కొంచెం కష్టం. తోటకూరలో కాల్షియం, ఇనుము చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల పప్పులో వేసి లేదా విడిగా వండుకుని తినవచ్చు.

జామకాయలు
cabbage-vegetable

వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పని చేస్తుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కణజాలం పొరను రక్షిస్తుంది. జలుబు, దగ్గు, ఇన్ ఫ్లుయెంజ వ్యాధి పైన సి విటమిన్ పోరాడుతుంది. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

 1. ఆపిల్, నేరేడు పండు కంటే జామకాయలోనే పీచు పదార్థం ఎక్కువగా ఉండటంతో ఇది సుగర్ వ్యాధికి చక్కటి ఔషధం
 2. అలాగే జామ ఆకులను నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గడమే కాక ఆకలి కూడా పెరుగుతుంది.
 3. పైగా కొన్ని రకాల వ్యాధుల బారిన పడి ఆకలి మందగించిపోయిన వారికి ఇది ఆకలి పుట్టించగలదు.
నిమ్మకాయ
నిమ్మకాయ

ఇది ఉత్తమమైన యాంటీ ఆసిడ్ ఔషధమే. నాలుక మీద ఆమ్లాలు, శరీరంలో క్షారాలు ఊరడానికి దోహదం చేస్తుంది. నీటిలో కలిపి లేదా నిమ్మరసం అలాగే గానీ తీసుకోవచ్చు. లేదా తేనె కలిపి గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగవచ్చు. ఆహారం తీసుకున్న తరువాత మనకు లభించే ఇనుము, కాల్షియం శరీరం గ్రహించడానికి విటమిన్ ‘సి’ ఎంతగానో దోహదం చేస్తుంది. రక్తంలో కొలెస్ట్రాలను, రక్తపోటును తగ్గించడంలో నిమ్మ బాగా పని చేస్తుంది. క్యాన్సర్ కారకాలను నిర్మూలించడంలోనూ ఉపయోగపడుతుంది.

 1. రెండు చెంచాల నిమ్మకాయ రసాన్ని ఒక గ్లాసులో కలుపుకొని రోజుకి నాలుగు లేక ఐదు సార్లు తాగడము వలన పచ్చకామెరల వ్యాధి తగ్గుతుంది.
 2. రోజూ పరగడుపున ఒక గ్లాసుడు గోరు వెచ్చని నీళ్ళలో ఒక నిమ్మకాయ రసం కలుపుకొని, కొంచెం ఉప్పు కలిపి తాగితే ఊబకాయం తగ్గుతుంది.
 3. లావుగా ఉండేవారు ఆహారాన్ని తగ్గించి, రోజుకు రెండు మూడుసార్లు నిమ్మరసం సేవిస్తే, బరువు తగ్గుతుంది.
 4. చుండ్రు, మొటిమలు, మొదలగు చర్మవ్యాధులకు నిమ్మరసాన్ని రెండు మూడుసార్లు రోజూ సేవించాలి. లాభం ఉంటుంది.
బచ్చలి కూర

ప్రొటీన్లను అత్యధికంగా శరీరం గ్రహించేలా చేయడానికి బచ్చలి కూర అద్భుతంగా పని చేస్తుంది. ఇందులో కాల్షియం, ఐరన్ చాలా ఎక్కువగా లభిస్తాయి. కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులలో కంటి వ్యాధులను అదుపు చేయడంలో బచ్చలికూర బాగా ఉపయోగపడుతుంది. ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్తో కలిసి బచ్చలికూర తీసుకున్నట్లయితే వయస్సుతో వచ్చే కంటి సమస్యలు తగ్గుతాయి.

కొత్తిమీర
కొత్తిమీర

ఆహార పదార్థాల మీద అలంకరించుకోడానికి భావిస్తే పొరపాటే. మనం తీసుకునే అన్ని రకాల ఆకు కూరలు, కాయకూరల వంటకాల్లో విరివిగా వేసి తీసుకోవచ్చు. కొత్తిమీర నిండా విటమిన్లు, ఖనిజలవణాలున్నాయి. అంతేకాదు సమృద్ధిగా ఐరన్ కూడా లభిస్తుంది. రక్తహీనత తను తగ్గిస్తుంది.. కొలెస్ట్రాల్ తగ్గించడంలో, రక్తనాళాల్లో ఆటంకాలను తొలగించడంలోనూ కొత్తిమీర ఉపయోగపడుతుంది.

 1. పెదవులు నల్లగా ఉన్నవారు రోజూ రాత్రి పడుకునే ముందు కొత్తిమీర రసం పెదవులపై రాయండి.కొన్ని రోజులకి పెదాలు లేత రంగును సంతరించుకొంటాయి.
 2. ఏదైనా కూర వండేటపుడు కాకుండా చివరలో అంటే దించివేసే ముందు వేస్తేనే కూరకు మంచి సువాసన వస్తుంది.
 3. కొత్తిమీర త్వరగా వాడిపోకుండా ఉండాలంటే ఓ గ్లాసులో నీరు పోసి వాటి వేర్లు మునిగేటట్లు ఉంచండి.
 4. మీ ఇంటి వెనుక కాస్త స్థలం ఉందా? ఉంటే కాసిన్నిధనియాలు చల్లి నీరు చిలకరించండి కొత్తిమీర వస్తుంది. ఒకవేళ స్థలం లేకపోయినా పూలకొండీలలో చల్లినా చాలు.
గుడ్డు
గుడ్డు

ఆమ్లాలు తక్కువగా ఉండి ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. తెల్లటి గుడ్డులో క్యాలరీలు తక్కువే. కాబట్టి నాటు గుడ్డు తినడం మంచిది

చెర్రీ పండ
Cherries

ఎర్రగా ఉండే చెర్రీ పండ్లతోపాటు గ్రామసీమలలో లభించే నిమ్మి, రాచ ఉసిరి కాయలు, జామకాయలు, బిక్కి, మేడిపండ్లలో అనేక రకాల పోషకాలు, ప్రకృతి సిద్ధమైన పౌష్టికాహారం లభిస్తాయి. ఇవి కొద్దిగా తీసుకున్నా వాటిలో పోషక విలువలు ఎక్కువగా ఉండి మంచి శక్తి వస్తుంది. వీటిలో విటమిన్ ‘సి’ పుష్కలంగా లభిస్తుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరగడమే గాక కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. బెర్రీ పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్ పై పోరాడుతుంది, రోగ నిరోధక శక్తి పెంచుతుంది. మధుమేహ వ్యాధిని తగ్గిస్తుంది. అన్ని రకాల బెర్రీ పండ్లలోనూ వాపులను తగ్గించే గుణం ఉంటుంది. క్యాలరీలు చాలా తక్కువ

చిలకడ దుంప
చిలకడ-దుంప

ఇవి మానసిక వ్యాకులత నుండి ఉపశమనం కల్పిస్తాయి. బీటా కెరొటిన్ సమృద్ధిగా ఉంటుంది. క్యాస్సిర్ కారకాలపై పోరాడుతుంది, ఎక్కువ సమయంలో శక్తివంతంగా పనిచేయడానికి దోహదం చేస్తుంది.. చిలకడ దుంపలు ఉడకబెట్టి లేదా కాల్చుకుని తినవచ్చు. లేదా కూర చేసుకుని తినవచ్చు. శుభ్రం చేసుకుని పచ్చివి కూడా తినవచ్చు. తెల్లగా ఉండేవి, ఎర్రగా ఉండేవి రెండు రకాలు లభిస్తాయి.

రాగి జావా

దీనిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. రాగి పిండిని రొట్టెగా చేసుకుని తినవచ్చు. కొన్ని ప్రాంతాల్లో రాగి సంగటి

తయారు చేసుకుని తింటారు. కీళ్ళ నొప్పులున్న వారు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు రాగులతో తయారయ్యే జావా మేలు కలుగజేస్తుంది

ముడిబియ్యం
ముడిబియ్యం

వీటిలో ప్రోటీన్, ఫైబర్ చాలా అధికంగా ఉంటాయి. మితిమీరి తినకుండా ముడి బియ్యం దోహదం చేస్తాయి. తీసుకున్న ఆహారంతో శక్తి కలిగి పని చేసుకోవచ్చు.

మొలకలు
మొలకలు

అన్ని రకాల పప్పు ధాన్యాలు, కాయ ధాన్యాలను మొలకలుగా చేసుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం. ఉదయం పూట టిఫిన్ కు బదులుగా మొలకలు తినవచ్చు. వీటిలో ఎక్కువగా విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. వీటిని అలాగే తినవచ్చు, ఉడికించి తినవచ్చు. ‘సి’ విటమిన్ దండిగా ఉండే నిమ్మరసాన్ని చల్లుకుని తింటే బాగా రుచిగా ఉంటాయి. దీనివల్ల వీటిలో పోషకాలను శరీరం బాగా గ్రహిస్తుంది.

బీన్స్ (చిక్కుళ్ళు)
బీన్స్

ఎక్కువగా గింజలుండే పెద్ద చిక్కుళ్ళు, గోర చిక్కుళ్ళు,ఇలా పలురకాల చిక్కుళ్ళున్నాయి. ఇవన్నీఆరోగ్యాన్ని కాపాడడంతో కీలక పాత్ర పోషిస్తాయి. చిక్కుళ్ళతో రకరకాల కూరలు చేసుకుంటారు. ప్రోటీన్న ఎక్కువగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిని సమతల్యం చేస్తుంది. చిక్కుళ్ళు కొద్దిగా తిన్నా సంతృప్తి నిస్తుంది బరువు పెరగకుండా అదుపులో ఉంచుతుంది.

ఎండు ద్రాక్ష

వీటిలో అత్యధికంగా ఫైబర్ ఉండడం వల్ల మలబకం సమస్య పరిష్కారంలో చాలా బాగా పనిచేస్తుంది. ”విటమిన్ A ఎక్కువగా ఉండి, కళ్ళు చర్మం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఐరన్ పుష్కలంగా ఉంటుంది అందువల్ల ఇవి తినడంవల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. మధుమేహ వ్యాధి బాగా తగ్గిపోయి, రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యం కాపాడుతుంది.

బాదంపప్పు
బాదంపప్పు

వీటిలో మోనోశాట్యురేటెడ్ ఫ్యాట్స్ (మేలుచేసే కొవు ఎక్కువగా ఉండడంవల్ల కొలెస్ట్రాల్ ను తక్కువ స్థాయిలో ఉంచుతుంది. బాదంపప్పు తిన్నట్లయితే సంతృప్తికరం ఆహారం తీసుకున్నట్టు అనిపిస్తుంది. క్యాలరీలు తకువగా, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి వయస రాకుండానే వయస్సు మీదపడినట్టు అనిపించే సమస్య నివారిస్తుంది. విటమిన్ బి6 చాలా అధికంగా ఉండీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

 1. తక్షణశక్తికి : అలసటగా అనిపించినప్పుడు నాలుగు బాదాంలు తీసుకొంటే తక్షణ శక్తి సొంతమవుతుంది. అందులో రైబోఫ్లెవిన్‌, రాగి, మెగ్నీషియం.. వంటి పోషకాలు శరీరానికి శక్తిని అందిస్తాయి. అందుకని *దూరప్రయాణాలు చేసేటప్పుడు, ఆఫీసుకు వెళ్లేటప్పుడు వెంట తీసుకెళితే ఆకలిగా అనిపించినప్పుడు తినొచ్చు.
 2. మధుమేహానికి : మధుమేహంతో బాధపడేవారు భోజనం తరువాత తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఇది రక్తంలో ఇన్సులిన్‌ శాతాన్నిపెంచుతుంది.
 3. మెదడుకు మేత : నీళ్లలో రెండు మూడు బాదం పప్పులు నానబెట్టి మర్నాడు చిన్నారులకు తినిపిస్తే జ్ఞాపకశక్తి వృద్ధవుతుంది
 4. బద్ధకం దూరం : వీటిలో పీచు పదార్థం సమృద్ధిగా లభిస్తుంది. మలబద్ధకం, ఇతర సమస్యలున్నవారు రోజుకు నాలుగైదు బాదం పప్పులు తీసుకొని.. బాగా నీళ్లు తాగితే చక్కటి పరిష్కారం దొరుకుతుంది.
 5. పెద్దప్రేగు క్యాన్సర్ : బాదం తినడము వలన పెద్దప్రేగుకు క్యాన్సర్ రాకుండ ఉంటుంది.
 6. అమెరికన్ అసోసియేషన్ ఆహార నియంత్రణ జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం బాదం ప్లాస్మా మరియు ఎర్ర రక్త కణాలలో విటమిన్ ఇ స్థాయిని పెంచుతుంది మరియు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.
ఆలివ్ నూనె
ఆలివ్-నూనె

ఆలివ్ నూనెలో ఒమెగా-3,ఒమెగా 6ఫ్యాటీ యాసి దండిగా ఉంటాయి. అలాగే విటమిన్ ‘ఇ’ ఉంటుంది. కొలెస్ట్రాల్ తరిమి కోటి అందువల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి ప్రాణాంత వ్యాధుల నివారణలో బాగా ఉపకరిస్తుంది. చర్మాన్ని మృదువుగా ఉంచడంలో ఆలివ్‌ నూనెది ప్రత్యేక స్థానం. చిన్నారులకు మర్ధన చేయడానికి ఎక్కువగా ఈనూనెను ఉపయోగిస్తారు. చర్మానికి వాడే మందులు, ఆయింట్‌మెంట్స్‌ తయారీలోనూ దీనిని ఎక్కువగా వాడుతారు. ఈ నూనెతో చర్మాన్ని మసాజ్‌ చేసి 15 నిమిషాల తర్వాత స్నానం చేస్తే చర్మం మృదువుగా, కాంతిగానూ మారుతుంది

 1. ఆలివ్‌ ఆయిల్‌తో తేనెను కలిపి ముఖానికి రాసి, కొంతసేపయిన తర్వాత ముఖాన్ని మెత్తని సున్నిపిండితో రుద్దుకుని కడుక్కుంటే ముఖవర్ఛస్సు పెరుగుతుంది.
 2. చర్మం పొడారిపోయినట్లుగా కళావిహీనంగా ఉంటే ఆలివ్‌ ఆయిల్‌లో పాలనుకానీ, పాలమీగడను కానీ కలిపి ఆ మిశ్రమంతో మృదువుగా మసాజ్‌చేసి, ఆ తర్వాత నీటితో చర్మాన్ని శుభ్రపరిస్తే చర్మానికి మంచి కాంతి, నునుపుదనం, తేమ ఏర్పడతాయి.
 3. ఆలివ్‌ఆయిల్‌ను గోళ్ళమీద ప్రతిరోజూ రాస్తూంటే, గోళ్ళ దృఢత్వం, అందం పెరుగుతాయి.
 4. ఆలివ్‌ఆయిల్‌లో టమాటోరసం, క్యారెట్‌జ్యూస్‌, పెరుగుకలిపి మచ్చల మీద రాస్తూంటే, గోళ్ళ దృఢత్వం, అందం పెరుగుతాయి
నీరు

అన్ని రకాల పదార్థాలను కరిగించు శక్తిగల ద్రావ నీరు. మనం నీరు లేకుండా జీవించలేము. శరీరం అత్యధికంగా నీరు ఉంటుంది. శరీరంలోని అన్ని కణాల నీరు వివిధ రకాల పోషకాలను తీసుకువెళ్లి అందిస్తుంది శరీరం నుంచి విషతుల్యాలను బయటకు పంపిస్తుం శరీరంలోని మలినాలన్నింటినీ శుద్ధి చేస్తుంది. రక్తప్రసర చక్కగా జరగడానికి నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది జీర్ణక్రియకు తోడ్పడుతుంది .అలసటను పోగొడుతుంది శరీరం శుష్కించకుండా నివారిస్తుంది. రోజుకు 8 ను 10 గ్లాసుల నీరు తప్పని సరిగా తీసుకోవాలి. పౌష్టిక ఆహారం (Nutrition food)

కొబ్బరి
కొబ్బరి

సహజసిద్ధంగా లభించే కొబ్బరినీరులో సరమైన అన్ని రకాల పోషక విలువలున్నాయి. శరీరం ఎలక్ట్రోలిట్స్ (విద్యుత్ వాహక లవణాలు) పుష్కల ఉన్నాయి. దీనివల్ల కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటు విటమిన్ ‘ఇ’ అధికంగా ఉండి థైరాయిడ్ గ్రంధి బాగా పని చేసేందుకు ఉపకరిస్తుంది.

కొన్ని ముఖ్యమైన పౌష్టిక ఆహారం (Nutrition food) సూత్రాలు

 1. కేవలం ఏవో ఒకే రకం తినటం కాకుండా.. వైవిధ్య భరితంగా ఉండేలా రకరకాల ఆహార పదార్థాలు తినటం మంచిది. ఆది పండ్లు, కూరలు, ధాన్యాలు, పప్పులు.. ఏవైనా కావచ్చు
 2. మనం తినే ఆహారానికీ, చేసే శారీరక శ్రమకూ మధ్య సమతౌల్యం ఉండాలి. రోజంతా చురుకుగా ఉండటం, రోజులో ఎప్పుడో ఒక సారి కనీసం అరగంట పాటు నడక శారీరక వ్యాయామం చెయ్యటం తప్పనిసరి.
 3. ఆహారంలో తీపి, కొవ్వు, ఉప్పు.. ఈ మూడూ చాలా మితంగా ఉండేలా చూసుకోవాలి,
 4. నిత్యం తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. పండ్లను జ్యూసుల రూపంలో కన్నా పండ్ల రూపంలో తినటమే ఉత్తమం.
 5. బాగా పాలిష్ చేసిన ధాన్యం కన్నా ముడిధాన్యానికి, ఆలాగే 8పైన్ పిండితో చేసిన వాటికంటే ముడి గోధుమల వంటివాటితో చేసిన రొట్టెలు, బ్రెడ్స్ వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి,
 6. కేవలం వరి, గోధుమలే కాకుండా రాగులు, సజ్జలు, జొన్నలు, కర్రల వంటి చిరుధాన్యాలను కూడా దైనందిన ఆహారంలో భాగం చేసుకోవాలి మాంసాహారం తంగా తీసుకోవాలి. ఎక్కువ నూనెలో వేయించి fry రూపంలో కాకుండా ఉడికించి వండుకోవాలి. చేపల వంటి ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలుండే పదార్ధాలు తరచుగా తీసుకోవాలి.
 7. రోజులో 8-10 క్లాసుల నీరు తాగాలి.
 8. తేలికగా జీర్ణమయ్యే రీప్లేన్ పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్స్, కొవ్వు ఎక్కువగా ఉండే వేపుళ్లు, చిప్స్ వంటివన్నీ బాగా తగ్గించేచాలి. అలాగే కొవ్వు లేని స్వీట్లు ఉండవు కాబట్టి కేవలం మధుమేహులే కాదు, అందరూ కూడా స్వీట్లు బాగా తగ్గించాలి.
 9. రోజు ఉదయాన్నే అల్పాహారు తప్పనిసరిగా తీసుకోవాలి.
 10. మానసిక ఒత్తిడి బాగా తగ్గించుకోవటం ముఖ్యం. ఎందుకంటే మానసిక ఒత్తిడిలో, ఉన్నవారు ఆవసరానికి మించి తింటారు. పైగా వారికి స్వీట్ల వంటి తీపి పదార్ధాలు, త్వరగా జీర్ణమయ్యే పదార్థాలు ఎక్కువగా తినాలనిపిస్తుంటుంది.
 11. సాధ్యమైనంత వరకూ పీచు ఎక్కువగా, కొవ్వు తక్కువగా ఉండే పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
వేప నూనె ఆరోగ్య ప్రయోజనాలు neem oil benefits in telugu