kitchen tips Telugu సులభమైన వంటింటి చిట్కాలు

వంటింటి-చిట్కాలు

kitchen tips Telugu

kitchen tips Telugu

 • పచ్చిమిరపకాయల్ని కాసింత పసుపుతో చేర్చి సీసాలో నిలువ చేస్తే ఎరుపు రంగుకు మారకుండా ఉంటాయి.
 • ఉప్పు ఉన్న జాడీలో రెండు పచ్చిమిరపకాయలు వేసి ఉంచితే, వర్షాకాలంలో ఉప్పు చెమ్మచేరి నీరు కారిపోకుండా ఉంటుంది.
 • పెరుగు పుల్లగా మారకుండా ఉండటానికి పెరుగులో కొబ్బరిముక్కను వేసి చూడండి. –
 • పెరుగు రుచిగా, సరిగ్గా తోడుకోవాలంటే, తోడు పెట్టేముందు గిన్నెను పటిక ముక్కతో రుద్దండి
 • పెరుగు ఎక్కువ పులుపు వుంటే దానిలో కొద్దిగా పాలు కలపండి.
 • వెల్లుల్లి రేకులను సులువుగా తీయాలంటే వాటిని ఎండలో కొద్ది సేపు ఉంచండి.
 • రసం పిండివేసిన నిమ్మకాయలను, సన్నని ముక్కలుగా తరిగి, ఆవిరి మీద ఉడికించి, దానికి కొంచెం ఉప్పు కారం, బెల్లం కలిపి పోపు వెయ్యండి. నోరూరించే నిమ్మకాయ పచ్చడి రెడీ
 • దోసెలపిండిలో ఒక కప్పు సగ్గుబియ్యం కూడా వేసి రుబ్బితే, దోసెలు చిరగకుండా పల్చగా వస్తాయి
 • మామూలుగా దోసెలు పెనానికి అతుక్కుపోతుంటాయి. అలా కాకుండా ఉండాలంటే, అందుబాటులో వంకాయలు ఉంటే, ముందుగా పెనంపై వంకాయ ముక్కతో రుద్దండి
 • కేక్ చేసేటప్పుడు పిండిలో ఒక చెంచా గ్లిసరిన్ కలిపితే కేకు ఎక్కువకాలం తాజాగా ఉంటుంది
 • కొత్తగా కొన్న జామ్ సీసా మూత గట్టిగా ఉండి తియ్యడానికి రాకపోతే, మూతను మంటమీద కొద్దిగా వేడి చెయ్యండి.
 • జామ్ గడ్డకడితే, దానిలో బాగా వేడిచేసిన నీరు నాలుగు చెంచాలు పోయండి. మెత్తబడుతుంది
 • గ్రుడ్డుసొనకి ఒక టీస్పూన్ మైదాపిండి కలిపితే ఆమ్లెట్ పెద్దగా పొంగినట్లుగా వచ్చి చాలా సేపు అలాగే ఉంటుంది
 • చాలామంది ఆమ్లెట్ వేసేముందు కోడిగ్రుడ్డు సొనలో కాసిని పాలు కలుపుతారు అయితే పాలవల్ల ఆమ్లెట్ గట్టిపడుతుంది. పాలకు బదులుగా ఒక చెంచా నీళ్ళు కలిపితే ఆమ్లెట్ మెత్తగా ఉంటుంది
 • కోడిగ్రుడ్డు సొనకు చిటికెడు కుంకుమపువ్వు కలిపి ఆమ్లెట్ వేసి చూడండి చూపులకే కాదు, రుచికి అద్భుతమే.
 • కోడిగ్రుడ్లను ఉడికించే నీళ్ళలో కాస్త ఉప్పు వేసినా, ఉడికించిన వెంటనే గ్రుడ్లను చన్నీళ్ళలో వేసినా పెంకు సులభంగా వస్తుంది
 • కోడిగ్రుడ్లు ఉడక పెట్టడానికి ఒకటి, రెండు గంటలు ముందుగానే ఫ్రిజ్ లోంచి తీసి ఉంచితే పగిలే అవకాశం ఉండదు

kitchen tips Telugu - వంటింటి చిట్కాలు

 • ఆమ్లెట్ వేసేముందు పెనంమీద కొంచెం ఉప్పు చల్లితే అంటుకోకుండా ఉంటుంది
 • ఆమ్లెట్ వేసేటప్పుడు కొద్దిగా శనగపిండి, కొబ్బరికోరు, మసాలాపొడి వేస్తే ఎంతో రుచికరంగా ఉంటుంది.
 • గ్రుడ్డు పగలకుండా ఉండాలంటే నిమ్మరసం పూసి ఆరబెట్టండి
 • ఫ్రిజ్ లేనివారు కోడిగ్రుడ్డు మీద ఆముదం నూనెను రాస్తే త్వరగా కుళ్ళవు.
 • అన్నం తెల్లగా, మల్లెపూవులా ఉండాలంటే ఉడికేటప్పుడు కొద్దిగా నిమ్మరసం పిండి చూడండి
 • అన్నం వార్చినపుడు వచ్చిన గంజిలో చాలా విటమిన్స్ ఉంటాయి. చలికాలం అయితే అందులో కాస్త తేనె, నారింజ రసం కలుపుకుని, వేసవికాలం అయితే నిమ్మరసం, ఉప్పు కలుపుకొని తాగాలి
 • బిర్యానీ వండేటప్పుడు ఒక నిమ్మకాయరసం పిండితే అన్నం గడ్డలుగా కాకుండా పొడిపొడిగా ఉంటుంది
 • పులిహోర, పలావులాంటివి పొడిపొడిగా ఉండాలంటే వండేటప్పుడు ఒక స్పూను వెన్న చేర్చి చూడండి
 • అన్నం తేలిగ్గా జీర్ణం కావాలంటే, బియ్యాన్ని వేయించి వండుకోవాలి
 • అన్నం వండటానికి ముందు వేరే పనిలో ఉండి ఈలోపు బియ్యం నానతాయని కడగకుండా నీళ్ళుపోసి ఉంచుతారు. ఆ విధంగా ఉంచడం మంచిదికాదు. దీనివల్ల విటమిన్లు ఎక్కువగా పోతాయి, అంతేకాకుండా బియ్యం పిసికి కడిగేటప్పుడు బియ్యం ముక్కలుగా అయ్యి అన్నం ఉడికిన తర్వాత చూపులకు బాగుండదు.
 • పులిహోరలో వేరుశనగగుళ్ళు కరకరలాడుతూ ఉండాలంటే విడిగా నూనెలో వేయించండి. అన్నంలో తాలింపు వేశాక, వేడితగ్గాక, అప్పుడు వేరుశనగగుళ్ళు కలపండి. పులిహోర రుచిగా ఉంటుంది
 • టమోటా కూర ఉడికేటప్పుడు చిటికెడు పంచదార వేస్తే కూర కమ్మని వాసన వస్తుంది
 • టమోటా వడిలిపోయినట్లయితే వాటిని ఉప్పునీటిలో ఒక రాత్రంతా ఉంచితే తాజాగా మారతాయి
 • పూరీలు మెత్తగా అవకుండా బాగా పొంగి ఉండాలంటే గోధుమపిండిలో గుప్పెడు బొంబాయి రవ్వ లేదా బియ్యపు పిండి కలపాలి
 • పూరీలు మృదువుగా ఉండాలంటే పిండిని కలపడానికి నీళ్ళు కాకుండా పాలను వాడండి.
 • పూరీలు ఎక్కువ సేపు కరకరలాడుతూ ఉండాలంటే పూరీ పిండి కలిపేటప్పుడు కొంచెం పంచదార వేసి కలపండి
 • పూరీలు పొంగాలంటే మైదాతో పూరీలు చేస్తే బాగా పల్చగా వత్తాలి. అప్పుడు పొంగుతాయి. అదే గోధుమ పిండితో కొంచం మందంగా చేస్తే పొంగుతాయి.
 • చపాతీలు తెల్లగా, మెత్తగా ఉండాలంటే పిండిలో రెండు చెంచాల పాలు ఒక చెంచా బియ్యం పిండి, కాస్త నూనె వేసి ఐస్వాటర్తో పిండిని కలపండి
 • పూరీపిండిలో ఉప్పు కలపడం మర్చిపోతే కంగారు పడకండి. పూరీలను వేయించే నూనెలో ఉప్పు వేయండి చాలు

kitchen tips Telugu - ఎలాంటి కాయకూరలు కొనాలి?

ఎలాంటి-కాయకూరలు-కొనాలి

kitchen tips Telugu వంటింటి చిట్కాలుఎలాంటి కాయకూరలు కొనాలి? ఈ ప్రశ్న చాలా మందికి తరచూ ఎదురవుతూ ఉంటుంది. మీరు కూరగాయలు కొనేటప్పుడు ఈ క్రింద టిప్స్ ఫాలో అవ్వండి……..

 1. వంకాయలు ముడతలు పడకుండా వుండాలి. మరీ గట్టిగా లేదా మరీ మెత్తగా ఉండకూడదు. తొడిమ ఆకుపచ్చరంగులో, తోలు నిగనిగ లాడుతూ వుండాలి. పుచ్చులు లేకుండా చూడాలి.
 2. బంగాళా దుంపలు గట్టిగా వుండాలి. పై పొర తీసినప్పుడు లోపలిభాగం లేత పసుపు పచ్చని రంగులో వుండాలి. బంగాళా దుంప పైన నల్లటి మచ్చలు లేదా ఆకుపచ్చని మచ్చలు వున్నట్లయితే వాటిని పొరపాటున కూడా కొనవద్దు, దుంపల పైన గుంటలు లేకుండా నున్నగా వుండేవి చూసి కొనండి.
 3. అల్లం మరీ గట్టిగా లేదా మరీ మెత్తగా ఉండకూడదు. ముదురు రంగులో వున్న అల్లం చూసి కొనాలి. అల్లం పై పొర తీసి వాసన చూసి దాని ఘాటును బట్టి అల్లాన్ని అంచనా వేయాలి.
 4. ఉలి పాయలు గట్టిగా వున్నవి మాత్రమే కొనాలి. ఉల్లిపాయ పై పొరలో తేమ వుంటే అసలు కొనవద్దు.
 5. మంచి ఆకారం కలిగివున్న క్యారెట్టునే కొనాలి. వంకరగా ముడతలతో, ఎత్తు పల్లాలుగా వున్న క్యారెటను కొనవద్దు. క్యారెట్ మొత్తం మెత్తగా వున్నా, అక్కడక్కడా మెత్తగా వున్నా కొనవద్దు. క్యారెట్ లేతగా వుంటే మరీ మంచిది. క్యారెట్ నిల్వ వున్నట్లయితే వూరకే మెత్తపడిపోతుంది.
 6. బీట్రూట్ కొనే ముందు దాని కింద భాగంలో వేర్లు వున్న వాటిని కొనండి. ఎటువంటి మచ్చలు, రంధ్రాలు లేనివి చూసి కొనాలి.
 7. కాలీఫ్లవర్ కొనే ముందు దాని ఆకులు ఆకుపచ్చని రంగులో వుండేలా చూసుకోవాలి. పచ్చదనం లేని ఆకులున్న ఫ్లవర్ ను కొనవద్దు. పువ్వు విడిపోకుండా దగ్గరగా వున్న వాటినే కొనాలి.
 8. ఆకుకూరలు కొనే ముందు వాటి పైన తెల్లటి మచ్చలు లేకుండా చూసుకోవాలి. వాటి కాడలు తాజాగా, లేతగా వుండేటట్లు చూసుకోవాలి. వంటింటి చిట్కాలు

ఫ్రిజ్ వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు వంటింటి చిట్కాలు తీసుకోవాలి 

ఫ్రిజ్
 1. ఫ్రిజ్లో ఆహార పదార్థాలను, కూరగాయలను ఏ మాత్రం ఖాళీ లేకుండా ఇరికించి పెట్టకూడదు. ఫ్రిజ్ లోపల గాలి ప్రసరించేలా కొంత ఖాళీ ఉండేలా చూడాలి.
 2. సువాసన వస్తువులను, పూలను ఫ్రిజ్లో పెట్టేటప్పుడు వాటి వాసన బయటకు రాకుండా జాగ్రత్తగా కవర్ చేసి పెట్టాలి.
 3. కూరగాయలను కడిగిన తర్వాత, పూర్తిగా తడి ఆరిపోయిన తర్వాత నే వాటిని ఫ్రిజ్లో పెట్టాలి.
 4. తొడిమలు తీసిన మిరపకాయలను ఎక్కువ రోజులు ఫ్రిజ్లో ఉంచితే అవి కుళ్ళి పోతాయి. కనుక పచ్చిమిరపకాయలను తొడిమలు తీయకుండా ఫ్రిజ్ లో పెట్టాలి.
 5. ఆహార పదార్థాలు, పాలు, పెరుగు, రుబ్బిన పిండి లాంటివి ఉంచిన పాత్రల మీద మూతలు పెట్టాలి.
 6. ఆకుకూరల వేళ్ళను కత్తిరించి తడిపోయేలా బాగా ఆరబెట్టి, కట్టను విడదీసి పాలిథిన్ కవర్లో పెట్టి ఫ్రిజ్లో పెట్టాలి.
 7. వేడీ వేడిగా వుండే ఆహార పదార్థాలను, పాలను అలాగే ఫ్రిజ్లో పెట్టకూడదు. బాగా చల్లారనిచ్చి, ఆ తర్వాత ఫ్రిజ్ లో  పెట్టాలి.
 8. ఫ్రిజ్ తలుపును ఎక్కువ సార్లు తీస్తూ, వేస్తూ ఉండటం, ఫ్రీజ్ డోరిను ఎక్కువ సమయం తెరిచి ఉంచడం మంచిది కాదు,
 9. ఫీజర్లో ఐస్ గడ్డలుగా పేరుకోకుండా చూసుకోవాలి. ఎక్కువ మందంగా ఐస్ పేరుకున్నట్లయితే వెంటనే ఫిజీను ఆఫ్ చేసి ఉఫ్రాస్టింగ్ చేయాలి,
 10. అరటిపళ్ళను ఫ్రిజ్ లో ఉంచకూడదు.
 11. ఫ్రిజ్ కండెన్సర్ మీద దుమ్ము పేరుకోకుండా శుభ్రం చేస్తుండాలి.
 12. నెలకు కనీసం రెండు సార్లు డీ ఫ్రాస్ట్ చేసి, ఫ్రిజ్ లోపల శుభ్రం చేసి, ఫ్రిజ్ బయట కూడా మరకలు, దుమ్ము లేకుండా తుడవాలి.
 13. ఫ్రిజ్ డోర్ హ్యాండిల్ కు కవర్ ను వేయాలి,
 14. ఫ్రిజ్లో ఆహార పదార్థాలేమీ ఒలకకుండా చూసుకోవాలి. ఒలికితే, ఫ్రిజ్ స్విచ్ ఆఫ్ చేసి వెంటనే శుభ్రం చేయాలి, లేకపోతే ఫ్రిజ్లో దుర్వాసన ఏర్పడుతుంది.
 15. ఫ్రిజ్ బయటి భాగాన్ని వెనిగర్ తో తుడిస్తే తళతళ మెరుస్తుంది.
 16. ఫ్రిజ్ శుభ్రం చేయడానికి బైకార్బొనేట్ సోడా వాటర్ ని ఉపయోగిస్తే ఎలాంటి వాసనా మిగలకుండా శుభ్రంగా ఉంటుంది.
 17. ఫ్రిజ్లో ఐస్ పెరగకుండా ఉండాలంటే ఒక మూలన కొద్దిగా ఉప్పు ఉంచండి.
 18. ఫ్రిజ్లో ఐస్ట్రేలు పెట్టేటప్పుడు ఆవనూనె రాస్తే ట్రేలు అతుక్కోవు.
 19. ఫ్రీడలు, బీరువాలు వగైరా తడిబట్టతో తుడవకూడదు. మరిన్ని మరకలు ఏర్పడతాయి. పరిశుభ్రమైన తెల్లని పొడి బట్టతోనే లేదా మంచి వైటు “పేపరుతోనో బాగా రబ్ చేస్తే నీటుగా ఉంటాయి.
 20. పుట్టగొడుగులు పేపరు బ్యాగ్స్లో నిలవ చేస్తే ఎక్కువకాలం తాజాగా ఉంటాయి.
 21. ఫ్రిజ్లో నిలువపుంచే మీగడకు టీ స్పూన్ పంచదార కలిపితే తాజాగా ఉంటుంది.

కల్తీని కనుక్కోవటం ఎలా ? వంటింటి చిట్కాలు

కల్తీని-కనుక్కోవటం-ఎలా

kitchen tips telugu వంటింటి చిట్కాలు

 1. కందిపప్పులో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉదజహరికామ్లం కలిపితే అది ఎరుపు రంగులోకి మారితే కల్తీ కందిపప్పుగా భావించండి.
 2. వెన్నలో, నెయ్యిలో కల్తీ జరిగిందో లేదో తెలుసుకోవాలంటే వాటిలో కొంచెం హైడ్రోక్లోరిక్ ఆమ్లం, పంచదార మిశ్రమాన్ని కలపాలి. ఐదు నిముషాల తర్వాత నెయ్యి లేదా వెన్నకు ఎరుపు రంగు వస్తే అది కల్తీ అని భావించాలి.
 3. వనస్పతిలో సామాన్యంగా గంజిపొడి, ఉడికిన బంగాళదుంపను కల్తీ చేస్తుంటారు. దీనికి కొద్దిగా అయోడిన్ కలిపితే నీలిరంగు ఏర్పడినట్లయితే అందులో కల్తీ జరిగినట్లుగా గుర్తించాలి.
 4. చక్కెరలో సుద్దముక్కలపొడి, బొంబాయి రవ్వ కలుపుతుంటారు. పంచదారను నీటిలో వేస్తే కరుగుతుంది. అడుగున రవ్వ కనిపించినా, నీరు తెల్లగా కనిపించినా అది కల్తీ చెక్కర అని భావించాలి
 5. సెనగ పిండిలో బియ్యపు పిండి, మిఠాయి రంగు కలుపుతారు. కొంచెం పిండిలో నీటిని కలపండి. నీటి రంగు ఎరుపుకు మారితే ఆ పిండి కల్తీ అని భావించాలి
 6. బెల్లంలో మెటానిల్ ఎల్లోరంగు కలుపుతుంటారు. బెల్లం కరిగిన నీటిలో గాఢ ఉదజహరికామ్లం వేస్తే ఎర్రరంగు వస్తే కల్తీ జరిగినట్లు భావించాలి.
 7. జీలకర్ర మంచిదా, నకిలీదా తెలుసుకోవడానికి కొద్దిగా జీలకర్రను రెండు చేతుల మధ్య నలపండి. చేతికి రంగు అంటితే అది నకిలీదే.

ఆకు కూరల్లో పోషక పదార్థాల జాగ్రత్తలు వంటింటి చిట్కాలు …

ఆకు-కూరల్లో
 1. ఆకు కూరలను సూర్యరశ్మి తగలని ప్రదేశంలో ఉంచాలి. సూర్యరశ్మి తగిలితే ఆకుకూరలో ఉండే కరోటిన్ అనే పోషక పదార్థం నశిస్తుంది.
 2. వండటానికి ముందు ఆకుకూరలను శుభ్రంగా కడగాలి. ఆకుల పైన జల్లిన మందువాసన పోవడానికి ఇది ఎంతగానో ఉపకరిస్తుంది.
 3. ఆకులను పెద్ద పెద్ద ముక్కలుగా తరిగిగానీ, అసలు తరగకుండాగానీ వండు కోవడం మంచిది.
 4. ఎప్పుడూ తాజాగా వుండే ఆకుకూరలనే వండుకోవాలి. నిలువ వుంచిన కొద్దీ వాటిలో పోషక పదార్థాలు అన్నీ తగ్గుతాయి.
 5. ఆకుకూరలను వేయించి తినకూడదు. ఖనిజాలు, విటమిన్లు పోయి పిప్పి మిగులుతుంది.
 6. క్యారెట్, ముల్లంగిలాంటి దుంపకూరలతో పాటు, వాటికుండే ఆకులను కూడా వండుకుని తింటే మరికొన్ని పోషకాలు దక్కుతాయి.

ఓవెన్ వాడకంలో ఎలాంటి పద్ధతులు అవలంబించాలి?

ఓవెన్
 1. ఆన్ చేసిన అయిదు నిముషాల తర్వాత ఓవెన్ ను వాడాలి. స్విచ్ ఆపిన రెండు నిముషాల తర్వాత మాత్రమే ఓన్లో చేయి పెట్టడం మంచిది.
 2. ఓవెన్లో సేర్చబడిన పదార్థాలు ఉడుకుతున్నాయా? లేదా? తెలుసుకోవడానికి మాటిమాటికి ఓవెన్ మూత తెరచి చూడకూడదు. ఓవెన్ పై భాగంలో ఉండే ట్రాన్స్పరెంట్ పొర ద్వారా చూడాలి. ఓవెన్ను నీటితో కడిగితే త్వరగా పాడవుతుంది. పొడి బట్టతో తుడుస్తుండాలి. ఓవెన్ ఒకసారి ఉపయోగించిన తర్వాత మళ్ళీ వాడవలసివస్తే ఒక పది నిముషాల పాటు చల్లారనిచ్చి అప్పుడు వాడాలి.
 3. ఎక్కువ విద్యుతను వినియోగించుకుంటుంది, కావున త్రీ ఫేస్ ప్లగ్ ను వాడటం మంచిది. ఓవెన్ వేడిగా వుంటే బలవంతంగా తెరవకూడదు. చల్లారిన తర్వాత దానికదే తెరుచుకుంటుంది
 4. మామూలు ఓవెన్ల కన్నా ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టం వున్న ఎలక్ట్రిక్ ఓవెన్ ఉత్తమమైంది.
 5. ఓవెన్ ద్వారా బ్రెడ్డు, కేకులు, బిస్కెట్లు, నాన్ రోటీ, బేకెడ్ వెజిటబుల్స్, ఇతర వంటకాలను తక్కువ సమయంలో రెడీ చేసుకోవచ్చు.

మొక్కలను కుండీలలో ఎలా పెంచాలి

మొక్కలను-కుండీలలో-ఎలా-పెంచాలి
 1. కుండీలలో మొక్కలు పెంచటం నేడు ప్రతి ఇంట్లో కనిపిస్తుంది. కుండీలలోని మొక్కలకు ఏ మోస్తరు నీరు పోయాలనేది అప్పుడప్పుడు సమస్యగా ఎదురవుతుంది. నీరు తక్కువైతే మొక్క ఎండి పోతుంది. నీరు ఎక్కువైతే కుళ్ళిపోతుంది. అయితే విషయం ఆలస్యంగా బయట పడుతుంది. అప్పటికి మొక్కను తిరిగి బతికించే అవకాశముండదు.
 2. మొక్కకు ఏ మాత్రం నీరు పోయాలి అనేది ఆ మొక్కను మీరు ఎక్కడ ఉంచుతారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. వేడి అధికంగా ఉండే గదిలో పెట్టే మొక్కకు ప్రతి రోజూ కొద్దిగా నీరు పోయాలి. ఆరు బయట కాక పోర్టికోలో వుండే మొక్కలకు రెండు రోజులకు ఒకసారి పోస్తే చాలు.
 3. కుండీని చేతితో ఎత్తి చూడడం ద్వారా లోపల నీరు ఉన్నదీ లేనిదీ చెప్పవచ్చు.
 4. కుండీ లోపల పెంకులు, ఇసుక మట్టి ఉంచితే కుండీలో పోసిన అధిక నీటిని పీల్చుకుంటుంది.
 5. కుండీ కింద మట్టి ప్లేటుంచితే అధికంగా పోసిన నీరు బయటకు వచ్చి అందులో చేరుతుంది.

పెరటి మొక్కలు ఎరువులు వంటింటి చిట్కాలు kitchen tips in Telugu

పెరటి-మొక్కలు-ఎరువులు
 1. మీరు పెంచే మొక్కలకు కానీ, పూలకుండీలకు కానీ నీరు ఏ సమయంలో పడితే ఆ సమయంలో పోయకండి. అందువలన మొక్కలు ఏపుగా పెరిగే అవకాశం ఉండదు.
 2. మొక్కలకు నీరు ఉదయం తొమ్మిది గంటల లోపు, సాయంత్రం అయిదు గంటల తర్వాత మాత్రమే పోయాలి.
 3. కరివేపాకు మొక్క వేగంగా పెరగాలంటే బియ్యం కడిగిన నీళ్ళు పోస్తే చెట్టుకు మంచి బలాన్ని చేకూర్చి ఏపుగా పెరుగుతుంది.
 4. కాలిపోయిన బ్యాటరీ సెల్స్ ను పగలకొట్టి, లోపలుండే పదార్ధాన్ని మొక్కల మొదట్లో వేయడం వలన మొక్కలకు మంచి బలం చేకూరుతుంది.
 5. మొక్కలకు తెగుళ్ళు రాకుండా, పురుగు పట్టకుండా ఉండాలంటే ఆవాలని నీళ్ళలో కలిపి మెత్తగా నూరి, ఆ మిశ్రమాన్ని కుండీలో ఉన్న మట్టిలో కలిపేస్తే, తెగుళ్ళు సోకే అవకాశముండదు.
 6. గులాబీ మొక్కలకు దగ్గరలో టీ పొడిని లేక ఉల్లిపాయ తొక్కును వేస్తే పూసిన తర్వాత పూలు అధికమైన వాసన నిస్తాయి.
 7. అందరికీ ఉపయోగపడే ఆరోగ్య చిట్కాలు మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి

100 ఆరోగ్య మరియు వంటింటి చిట్కాలు