ఉసిరికాయ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Indian-gooseberry

health benefits amla telugu ‘శ్రీ ఫలం’ అని పిలువబడే ఉసిరికాయ ఎన్నో ఔషధ విలువలు కలిగింది ఉంటుంది . విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉన్న ఫలం ఈ ఉసిరి మన ఆయుర్వేద వైద్యంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. తల వెంట్రుకల మొదలు కాలి గోల్లు వరకు ఉసిరి మానవ శరీరానికి అద్భుతంగా ఉపయోగపడే సర్వరోగ నివారిణి

కార్తీక మాసంలో వన భోజనాలు సందడి, ఉసిరి చెట్ల నీడనా ప్రారంభం కావాలి, దీనికి మన పూర్వీకులు అత్యంత ప్రాధాన్యత నిచ్చారు. ఇప్పుడంటే ఏదో ఒక తోట అయితే చాలా అనుకుంటున్నారు గానీ, పూర్వకాలంలో ఉసిరి చెట్లు కనీసం ఒక్కటైనా ఉండేది చూసుకుని మరి వన భోజనం నిర్ణయించే వారు. దీనికి కారణం – ఉసిరి చెట్లు గాలి చాలా మంచిదని కనుగొన్నారు.

ఉసిరి ని సంస్కృతం లో ‘‘India Gooseberry (OR) Amla “అని అంటారు

ఉసిరికాయ ఆరోగ్య ప్రయోజనాలు – health benefits amla telugu

Health-benefits-amla-telugu

ప్రతిరోజూ ఉసిరికాయను తింటే

 1. ప్రతి రోజూ ఒక ఉసిరికాయను తిన్నట్లతే అన్ని రకాల పైత్యాలు తగ్గుతాయి.
 2. ప్రతి రోజూ ఉసిరికాయను తింటే కఫము తగ్గుతాయి.
 3. ప్రతి రోజూ ఉసిరికాయను తీసుకుంటే మేధస్సు పెరుగుతుంది.
 4. ప్రతి రోజూ ఉసిరికాయను తింటూ ఉంటే మూల వ్యాధులు తగ్గిపోతాయి
 5. ప్రతి రోజూ ఉసిరికాయను తింటే వీర్యపుష్టి కలుగును.
 6. ప్రతి రోజూ ఉసిరికాయను తినడం వల్ల శారీరక బలం పెరుగును.
 7. ప్రతి రోజూ ఉసిరికాయ ను తీసుకోవడం వల్ల త్రిదోషాలు నివారించవచ్చు.
 8. లేదా పూటకు రెండు – మూడు ఉసిరికాయ చొప్పున తీసుకుంటే అన్ని రకాల పైత్యాలూ తగ్గుతాయి.

మధుమేహం వ్యాధి తగ్గుతుంది

diabetes

డయాబెటిస్‌తో బాధపడేవారికి ఉసిరికాయ అద్భుతంగా పనిచేస్తుంది ఇందులో అవసరమైన విటమిన్ “సి” అధికంగా ఉంటుంది అలాగే ఉసిరికాయ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల పెంచుతుంది. షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు ఉదయాన్నే ఒక మంచి ఉసిరి కాయ తినడం వలన షుగర్ నియంత్రణలో ఉంటుంది

ఉసిరికాయ, తేనె, కరక (త్రిఫల) చూర్ణాన్ని ఆవు నెయ్యితో కలిపి ప్రతి రోజు తీసుకుంటూ ఉంటే మధుమేహ వ్యాధి తగ్గుతుంది.

విటమిన్ సి

vitamin-c

విటమిన్ – సి వాడటం ఆరోగ్యానికి చాలా మంచిది. కంటి జబ్బులు రాకుండా విటమిన్ – సి నిరోధిస్తుంది పరిశోధనలో తేలింది. అంతేగాక మహిళల్లో వచ్చే కాటరాక్ట్ నివారించడానికి విటమిన్ – సి దోహదం చేస్తుంది.

విటమిన్ – సి లో అంతర్గతంగా ఉండే యాంటీ యాక్సిడెంటల్ పోషకాలు వయసు మీద పడటం వల్ల దృష్టి లోపాలు తగ్గిస్తాయి. రోజు 140 మి.గ్రా. విటమిన్ – సి మనకు అవసరం. కృత్రిమంగా లభించే 100 మి.గ్రా., విటమిన్ – సి, ఒక్క ఉసిరిలోనే లభిస్తుందనవచ్చు !

ఉసిరి లో విటమిన్ – సి, నిమ్మ-కమలాలకన్నా 10 నుంచి 20 రెట్లు అధికంగా ఉంది. మిగతా పండ్ల లోని విటమిన్ – సి ఆక్సీకరణ చరణ్ వల్ల నష్టపోతాం ! కాని ఉసిరిలోని గాలిక్, ఇలాగిక్, గ్లూకోజ్ లు ఈ చర్యలు అరికట్టి, నష్ట పోనివ్వకుండా కాపాడతాయి.

కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది

ఉసిరికాయ ఎలా ఉండే క్రోమియం అనే పదార్థం శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను నిరోధిస్తుంది.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది

immunity-power

ఆమ్లా విటమిన్ సి యొక్క అద్భుతమైన మూలం, అందువల్ల ఇది మీ రోగనిరోధక శక్తిని, జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది మరియు జలుబు మరియు దగ్గుతో సహా వైరల్ మరియు బ్యాక్టీరియా వ్యాధులను నివారిస్తుంది.

గుండె జబ్బుల్ని తగ్గిస్తుంది

heart

ముందు చిక్కుకున్నట్లు ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మన గుండె ఆరోగ్యానికి చాలా మంచిది ఎవరికైతే బిపి ఎక్కువ ఉంటుందో వాళ్ళు రోజు ఒక ఉసిరికాయ తింటే బీపీ తగ్గుతుంది అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

క్యాన్సర్ వ్యాధికి

indian-gooseberry-3
కావాల్సినవి
 • ఉసిరికాయ మురబ్చాను
 • ఉసిరికాయ రసం – 1 టేబుల్ స్పూన్
 • క్యారెట్ రసం – 1 గ్లాసు
 • తేనే – 1 టేబుల్ స్పూన్

విధానం

కలిపి రోజుకు ఒకటి, రెండు సార్లు ఈ మిశ్రమాన్ని తీసుకున్నట్లు క్యాన్సర్ వ్యాధి కి, కోబాల్ట్ చికిత్స చేయించుకున్న వారికి నీరసం తగ్గి ఉత్సాహంగా ఉంటారు. వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

జీర్ణకోశవులో గల నులిపురుగు

indian-gooseberry
కావాల్సినవి
 • ఉసిరికాయ మురబ్చాను
 • ఉసిరికాయ రసం – 1 టేబుల్ స్పూన్
 • కొబ్బరి పాలు – 1 కప్పుడు

విధానం

కలిపి రోజుకు రెండు, మూడు సార్లు తీసుకుంటే జీర్ణకోశవులో గల నులిపురుగులు, బద్దె పురుగులు, కొంకి పురుగులు, ఏలిక పాములు వంటివి నశిస్తాయి.

అలసట నీరసం తగ్గడానికి ఉసిరికాయ

కావాల్సినవి
 • ఉసిరికాయ రసం – 1 టేబుల్ స్పూన్ (పెద్దది)
 • తేనె – 1 టేబుల్ స్పూన్ (పెద్దది)

విధానం

ఉసిరికాయ రసం-తేనె కలిపి ప్రతిరోజూ ఉదయం పూట తీసుకుంటుంటే ఉబ్బసము, స్కర్వీ వ్యాధి, రక్తహీనత (ఎనీమియా) వంటివి తగ్గుతాయి. సాధారణ జలుబు, జ్వరం, అలసట వంటివి ఉన్నవారు కూడా ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ ఉదయం తీసుకుంటూ ఉంటే వాటిని తగ్గించవచ్చు.