food for gastric problem telugu గ్యాస్ సమస్య కోసం మీ ఆహారంలో 7 ఆహారాలు చేర్చాలి

foods-to-eat-to-avoid-acidity-telugu

మనం తీసుకున్న ఆహారం అరగక పోవడం వలన, లేదా జీర్ణశక్తి సన్నగిల్లి విరేచనం సాఫీగా కాకపోవడం వలన గ్యాస్ ట్రబుల్ ఏర్పడుతుంది. ఇది ఎక్కువగా ఏర్పడటం వలన శరీరంలో పైకి ఎగదన్ని కడుపులోనూ, ఛాతిలోనూ, నడుమునందు నొప్పి కలిగిస్తుంది

దీనివలన గుండె బలహీనమై గుండెజబ్బులు వచ్చే అవకాశముంది. దీనివలన పొట్ట అంతా ఉబ్బరంగానూ, గట్టిగా బిగదీసుకుపోయినట్లు వుంటుంది. ఎక్కిళ్ళు ఎక్కువగా వస్తాయి.

ఇది సాధారణంగా ఆహారపదార్థాలలో తేడా వలన, వేళకు సక్రమంగా ఆహారం తీసుకోకపోవడం వలన, కాఫీ-టీలు ఎక్కువగా త్రాగడం వలన, సిగరెట్లు ఎక్కువ కాల్చడం వలన కూడా ఏర్పడుతుంది. తీసుకునే ఆహారంలో

ఆహారం మరియు కడుపు పూతలపై పరిశోధన ప్రకారం, కింది ఆహారాలు అనుమతించబడతాయి:

  • పాలు, పెరుగు మరియు తక్కువ కొవ్వు చీజ్‌లు
  • కూరగాయల నూనెలు మరియు ఆలివ్ నూనె
  • యాపిల్స్, పుచ్చకాయలు మరియు అరటితో సహా కొన్ని పండ్లు
  • ఆకు కూరలు, క్యారెట్లు, పాలకూర మరియు గుమ్మడికాయతో సహా కొన్ని కూరగాయలు
  • కాయధాన్యాలు, చిక్‌పీస్ మరియు సోయాబీన్స్
  • క్యాబేజీ
  • కాలీఫ్లవర్.

దుంపపదార్థాలు ఎక్కువైనా, నూనెల వాడకం ఎక్కువైనా కూడా శరీరంలో గ్యాస్ ఏర్పడుతుంది.

నిద్రలేకపోవడం వలన, త్రాగుడు, ఎక్కువ వేడిచేసే పదార్థాలు తీసుకోవడం వలన కూడా గ్యాస్ ట్రబుల్ వస్తుంది. దీనిని సులువుగా నివారించుకోవచ్చును

  • సరైన సమయాలలో క్రమబద్దంగా భోజనం చేయాలి. దుంపకూరలు, వేడిచేసే ఆహారపదార్థాలను కొంచెం మాత్రమే తీసుకోవాలి. ఆహారంలో నూనె వాడకం తక్కువగా వుండాలి. సులువుగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి.
  • రాత్రిపూట భోంచేసిన తరువాత ఒక గ్లాసు గోరువెచ్చని నీరు త్రాగాలి.
  • కాఫీ, టీ, సిగరెట్లు, మత్తుపానీయాలు మానేయాలి.
  • నిలవ వుండే ఆహారాన్ని తీసుకోకూడదు.
  • భోజనం అయిన వెంటనే పడుకోకుండా కొంత సేపు నడవాలి. మిఠాయి కిళ్ళీ వేసుకోవడం మంచిది.