Apple cider vinegar యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

apple-cider-vinegar-tips-telugu

ఆపిల్ సైడర్ వెనిగర్ అంటే ఏమిటి?

మనం apple cider vinegar - ఆపిల్ వెనిగర్ ప్రయోజనాలు గురించి తెలుసుకునే ముందు ఆపిల్ వెనిగర్ గురించి ఒకసారి తెలుసుకుందాం..

ఆపిల్ సైడర్ వెనిగర్ 10,000 సంవత్సరాలు ముందు నుంచి ఉన్న ఒకే ఒక్క అద్భుతమైన పానీయం అని చెప్పవచ్చు ఆనాటి నుంచి ఈ రోజు వరుకు దీనిని ఉపయోగిస్తున్నారు

దీని వలన మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఆపిల్ రసాన్ని నాలుగు నుండి ఐదు నెలలు పుల్ల బెట్టి కొన్ని రకాల రసాయనాలు కలిపి apple cider vinegar ఆపిల్ వెనిగర్ ని తయారు చేస్తారు..

వివిధ రకాల apple cider vinegar మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి వాటిలో సాధారణమైన raw ఆపిల్ వెనిగర్ ఎక్కువగా ఉపయోగిస్తారు అల్లం,నిమ్మకాయ రుచితో కలిగి ఉన్న ఆపిల్ వెనిగర్ కూడా మనకు మార్కెట్లో లభిస్తాయి

ఆపిల్ సైడర్ వెనిగర్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు :
అధిక బరువును,చుండ్రుని,మొటిమలు,గ్యాస్టిక్,షుగర్ ని తగ్గిస్తుంది అలగే క్యాన్సర్ నుంచి కాపాడుతుంది

apple-cider-vinegar-benefits-in-telugu

ఇది రోజు వాడటం ద్వారా మీరు మీ ఆరోగ్యానికి దగ్గర కావచ్చు మనం చెప్పుకున్నట్టు వేలాది సంవత్సరాలు నుంచే ఆపిల్ సైడర్ వెనిగర్ వైద్య పరంగా వాడుతున్నారు, మొదట ప్రపంచయుద్ధంలో సైనికులకి యుద్ధంలో గాయపడితే గాయాలు తగ్గడానికి ఔషధంగా ఆపిల్ సైడర్ వెనిగర్ నే ఉపయోగించేవారు, అంటు ఇటీవలి దీనిలో చాలా సహజ ప్రయోజనాలను కలిగి ఉన్నాయి అని మన శాస్త్రవేత్తలు కూడా ధ్రువీకరించారు, ఇందులో ముఖ్యంగా కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, రాగి, భాస్వరం, సోడియం మరియు ఫ్లోరిన్ పుష్కలంగా కలిగి ఉంటాయి.

apple cider vinegar ఆపిల్ వెనిగర్ మనం రోజూ తీసుకోవడం ద్వారా చాలానే ఉపయోగాలు ఉన్నాయి అందుకే 10,000 సంవత్సరాల నుంచి దీని అమృత పానీయం గా పిలుచుకుంటున్నారు రోజు ఉదయాన్నే ఆపిల్ వెనిగర్ నీటితో కలిపి తీసుకోవడం ద్వారా భయంకరమైన క్యాన్సర్ లాంటి వ్యాధుల నుంచి కాపాడుతుంది

షుగర్ ఉన్నవాళ్లకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అంతేకాదు గుండెల్లో ఏర్పడే చెడు కొలస్టాల్ కూడా ఇది తగ్గిస్తుంది

ఆపిల్ వెనిగర్అ ధిక బరువును తగ్గిస్తుంది

apple-cider-vinegar-benefits-in-telugu-weight-loss

బరువు మరియు పొట్ట భాగంలో అధిక శాతం కొవ్వుతో బాధపడుతున్నారా? అయితే ఆపిల్ సైడర్ వెనిగర్ మీకు చక్కని పరిష్కారంగా చెప్పవచ్చు ఇందులో ఉన్న ఎసిటిక్ ఆమ్లం(Acetic acid) ఉదర కొవ్వు, శరీర బరువు, మరియు మీ నడుము చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు మీ బరువును 12 వారాల తరువాత కచ్చితంగా 2 నుండి 3 కిలోల వరకు సులువుగా తగ్గుతారు

కావలసినవి

  • ఒక గ్లాసులో గోరు వెచ్చని నీళ్ళు
  • ఒకటి లేదా రెండు టీ స్పూన్లు ఆపిల్ సైడర్ వెనిగర్

తయారు చేసుకునే విధానం

ఒక గ్లాసులో గోరు వెచ్చని నీళ్ళు తీసుకుని అందులో ఒకటి లేదా రెండు టీ స్పూన్లు ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలపండి భోజనం చేసే అరగంట ముందు ఇది త్రాగండి

ఉదర కొవ్వు మరియు మీ నడుము చుట్టూ ఉన్న కొవ్వును తగ్గిస్తుంది

కావలసినవి

  • ఒకటి లేదా రెండు టీ స్పూన్లు ఆపిల్ సైడర్ వెనిగర్
  • ఒక్క నిమ్మకాయ
  • ఒక టీ స్పూను తేనే
  • కారప్పొడి
  • ఒక గ్లాసులో గోరు వెచ్చని నీళ్ళు

తయారు చేసుకునే విధానం

ఒక గ్లాసులో గోరు వెచ్చని నీళ్ళు తీసుకుని అందులో ఒక టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు ఒక టీ స్పూన్ తేనే,ఒక టీ స్పూన్ కారప్పొడి వేసి బాగా కలపండి భోజనం చేసే అరగంట ముందు ఇది త్రాగండి ఉదర కొవ్వు మరియు మీ నడుము చుట్టూ ఉన్న కొవ్వును తగ్గిస్తుంది.

ఆపిల్ వెనిగర్ చుండ్రుని తగ్గిస్తుంది

చుండ్రుని తగ్గించడానికి  నిమ్మకాయలో యాంటీ ఫంగల్ లక్షణాలు మరియు విటమిన్ సి యొక్క గొప్ప కంటెంట్ చుండ్రు తగ్గించడంలో ప్రభావితంగా పనిచేస్తుంది అంతేకాదు ఇది తలలో వచ్చే దురదను తగ్గిస్తుంది మరియు చుండ్రు వల్ల వచ్చే చికాకు తగ్గిస్తుంది ఒక అద్భుతమైన శుద్ది ఏజెంట్ గా చెప్పవచ్చు

కావలసినవి

  • 1/4 కప్పు ఆపిల్ సైడర్ వెనిగర్
  • 1/2 tsp ఆలివ్ ఆయిల్
  • అర కప్పు నిమ్మకాయ రసం
  • ఒక కప్పు నీరు

తయారు చేసుకునే విధానం

ఒక గిన్నె తీసుకుని అందులో అన్ని పదార్ధాలను{1/4 కప్పు ఆపిల్ సైడర్ వెనిగర్,1/2 tsp ఆలివ్ ఆయిల్,అర కప్పు నిమ్మకాయ రసం,ఒక కప్పు నీరు}వీటి అన్నిటినీ వేసి బాగా కలపండి

ఇలా సిద్ధం చేసుకున్న ఆపిల్ సైడర్ వెనిగర్ మీ జుట్టు కుదుళ్లుకు రాసుకుని ఒక 30 నిమిషాలు ఉన్న తరువాత తలస్నానం చేయండి…

బేకింగ్ ఆపిల్ సైడర్ వెనిగార్ సోడా చుండ్రుని తగ్గిస్తుంది

బేకింగ్ సోడా ఒక అద్భుతమైన ప్రక్షాళన ఏజెంట్. చాలామందికి చుండ్రు రావడానికి ప్రధానమైన కారణం జుట్టు కుదుళ్ల దగ్గర చనిపోయిన కణాల వలన చుండ్రు సమస్య ఎక్కువగా వస్తుంది బేకింగ్ సోడా మరియు ఆపిల్ సైడర్ వెనిగర్ మన చర్మంపై చనిపోయిన చుండ్రు కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది సహజంగా ఏర్పడే నూనెలను తొలగించకుండా చర్మం యొక్క pH ను సమతుల్యం చేసే చుండ్రు ను పూర్తిగా నాశనం చేస్తుంది.

కావలసినవి

>
  1. రెండు టేబుల్ స్పూన్లు బేకింగ్ సోడా
  2. రెండు  టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగార్

తయారు చేసుకునే విధానం

బేకింగ్ సోడా మరియు యాపిల్ సైడర్ వెనిగర్ సమపాళ్లలో తీసుకుని మెత్తని పేస్టులా తయారు చేసుకోండి

ఈ పేస్టును మీ జుట్టు కుదుళ్లకు రాసుకుని సుమారు 5 నిమిషాల మసాజ్ చేసిన తర్వాత, చల్లని నీటితో శుభ్రం చేసుకోండి

>

ఆపిల్ వెనిగర్ మొటిమలు తగ్గిస్తుంది

apple-cider-vinegar-benefits-in-telugu-weight-loss

ముఖంపైన ఎక్కువగా జిడ్డు ఉంది మొటిమలు వస్తే ఈ చిట్కా పాటించండి ఆపిల్ సైడర్ వెనిగర్ మొఖం మీద ఉన్న జిడ్డు మరియు మొటిమలను తగ్గించి చర్మంలో ఉండే మట్టి చెడు కణాలను బయటికి లాగి చర్మాన్ని శుభ్రంగా ఉండేలా చేసి మొటిమలను తగ్గిస్తుంది

కావలసినవి

  1. రెండు కొప్పుల నీరు
  2. నాలుగు tablespoons ఆపిల్ సైడర్ వెనిగర్
  3. రెండు చుక్కల ట్రీ ఆయిల్

తయారు చేసుకునే విధానం

  1. నాలుగు టీస్పూన్ ఆపిల్ వెనిగర్ ని నీటి లో వేసి నీళ్లను బాగా మరగనివ్వండి
  2. ఒక్కసారి నీళ్లు బాగా మరిగిన తర్వాత రెండు లేదా మూడు చుక్కల ట్రీ ఆయిల్ వెయ్యండి
  3. ఇపుడు ఈ నీటి నుంచి వచ్చిన ఆవిరి మొటిమలు ఉన్న చోట వేడి ఆవిరి తగిలేలా పట్టించండి.

బేకింగ్ మరియు ఆపిల్ సైడర్ వెనిగార్ మొటిమలు

ఆపిల్ సైడర్ వెనిగార్ పాటు, బేకింగ్ సోడా కూడా మొటిమలు తగ్గించడానికి సహాయపడే anti-inflammatory(శోథ నిరోధక) లక్షణాలను కలిగి ఉంటుంది ఇది మొటిమలను మరియు మొటిమలు వల్ల ఏర్పడే రంధ్రాల, మంట తగ్గించీ చనిపోయిన కణాలును తొలగిస్తుంది, అలాగే మీ చర్మం pH సంతులనం నిర్వహిస్తుంది.

కావలసినవి

  • రెండు టీ స్పూన్లు ఆపిల్ సైడర్ వెనిగార్ (సేంద్రీయ)
  • మూడు టేబుల్ స్పూన్లు బేకింగ్ సోడా

తయారు చేసుకునే విధానం

ఒక చిన్న గిన్నెలో ఆపిల్ సైడర్ వెనిగార్ బేకింగ్ సోడా కలిపి పేస్ట్ లాగా తయారు చేయండి.

ఒక చిన్న గిన్నెలో ఆపిల్ సైడర్ వెనిగార్ బేకింగ్ సోడా కలిపి పేస్ట్ లాగా తయారు చేయండి.

  1. మొటిమలు ఉన్నా చోటా పేస్ట్ నీ రాసుకోండి.
  2. 20 నిముషాల తరువాత ముఖాన్ని శుభ్రంగా చేసుకోండి

ఆపిల్ సైడర్ వెనిగార్ గ్యాస్టిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం

apple-cider-vinegar-benefits-in-telugu-weight-loss

గ్యాస్టిక్ ఉన్నవారికి ఆపిల్ సైడర్ అనేక రకాలుగా సహాయపడుతుంది. గ్యాస్ ఉన్నవారికి ఇది అమృతం గా చెప్పవచ్చు ఎందుకంటే ఇది గ్యాస్టిక్ సమస్య ఉన్నవాళ్లకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కడుపు యొక్క సరైన pH స్థాయిని సంతులం చేస్తుంది మరియు శరీరం నుండి హానికరమైన విషాన్ని తొలగిస్తుంది, గ్యాస్టిక్ సమస్య ఉన్నవారికి ఆపిల్ వెనిగర్ వాడితే కేవలం ఆరు రోజుల్లో మీ గ్యాస్టిక్ సమస్య పూర్తిగా దూరం చేస్తుంది

కావలసినవి

  1. గోరు వెచ్చని నీళ్లు
  2. ఆపిల్ సైడర్ వెనిగార్

తయారీ

ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో నాలుగు చెంచాల ఆపిల్ సైడర్ వెనిగార్ వేసి బాగా కలపండి ఈ నీటిని రోజు భోజనం చేసే అరగంట ముందు తీసుకుంటే మీకు గ్యాస్టిక్ సమస్య అన్నది తిరిగి రాదు