Weight gain tips telugu బరువు పెంచడానికి మంచి చిట్కాలు

WEIGHT-GAIN

కొంతమంది ఎంత తిన్న బరువు పెరగరు దీనికి ప్రధాన కారణం తినే ఆహారంలో లోపము మరియు హార్మోన్ల పనిచేయకపోవడం వల్ల బరువు పెరగకుండా నిరోధించవచ్చు.

తక్కువ బరువు ఉండటం మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది మేము బరువు పెరగడానికి ఉత్తమమైన ఆహారం మరియు నిపుణుల చిట్కాలను మీ ముందుకు తీసుకువస్తాము.

ఆరోగ్యకరమైన మార్గంలో బరువు పెరగాలి!

WEIGHT-GAIN

చాలామంది అనుకుంటారు బరువు తగ్గాలి అనుకుంటే చాలా కష్టం కానీ బరువు పెరగాలంటే చాలా సులువు ఏముంది రోజు జంక్ ఫుడ్ బ్రెడ్ పీజాలు తింటే సరిపోతుంది సులువుగా బరువు పెరగొచ్చు అని కానీ అలా అనుకుంటే పొరపాటే

బరువు పెంచడానికి జంక్ ఫుడ్ మరియు అనారోగ్యమైన ఆహారం తీసుకుని బరువు పెరగడం వలన పొట్ట లోని కొవ్వు మరియు గుండెకు వెళ్లే రక్తనాళాల్లో కొవ్వు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది

దీనివల్ల టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు మరియు ఇతర ఆరోగ్య సమస్యలను తరచుగా వచ్చే అవకాశం ఎక్కువ

బరువు పెరగాలనుకుంటే సరేనా మార్గంలో శాస్త్రీయ ఆధారాలతో ఉన్న చిట్కాలను పాటించాలి. అందువల్ల, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం మరియు మొత్తం ఆరోగ్యకరమైన జీవనశైలిని గడపడం చాలా అవసరం.

తక్కువ బరువు ఉండటానికి కొన్ని కారణాలు

  • సమయానికి ఆహారం తినకపోవడం
  • పోషకమైన ఆహారాన్ని తినకపోవడం వల్ల
  • వంశపారంపర్య
  • మన శరీరం ఖర్చుపెట్టే కేలరీల కన్నా తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల
  • టిబి, హైపర్ థైరాయిడ్, క్యాన్సర్, రక్తహీనత వంటి వ్యాధులలో బరువు తగ్గడం జరుగుతుంది.
  • అనోరెక్సియా, అజీర్ణం, దీర్ఘకాలిక విరేచనాలు, సక్రమంగా ప్రేగు సిండ్రోమ్ వంటి వ్యాధులు కూడా బరువు తగ్గడానికి కారణం కావచ్చు.

నిజానికి చాలా మందికి వాళ్ళు ఉన్నా వలసిన దాని కన్నా ఎక్కువ బరువు ఉన్నారో తక్కువ బరువు ఉన్నారో తెలీదు

మీ శరీర ఎత్తుకి ఎంత బరువు ఉండాలో చెప్పేదే బీ.మ్. ఐ (B.M.I) weight gain tips telugu

BMI-TELUGUCalculate Your Body Mass Index
  • పైన ఇవ్వబడిన వెబ్సైట్ లోకి వెళ్లి మీ శరీరం యొక్క పడవు మరియు బరువు ఇవ్వండి
  • వచ్చిన సంఖ్య మీకు వచ్చిన సంఖ్య 18.5 లోపు ఉంటే మీరు తక్కువ బరువు ఉన్నట్టు
  • వచ్చిన సంఖ్య 18.5 – 24.9 సాధారణ బరువున్నట్లు
  • వచ్చిన సంఖ్య 25 – 29.9 ఎక్కువ అ ఉండవలసిన దాని కన్నా ఎక్కువ బరువు ఉన్నట్లు
  • వచ్చిన సంఖ్య 30+ ఉంటే మీరు ఉండవలసిన దానికన్నా చాలా ఎక్కువ బరువున్నట్లు

వేగంగా మరియు ఆరోగ్యంగా బరువు పెరగడానికి కొన్ని చిట్కాలు:-

సమయానికి అల్పాహారం తినండిఉపవాసం-చేయండి

ఉదయం అల్పాహారం, భోజనం సరైన సమయానికి తినండి అంటే రోజూ ఒకే సమయానికి ఆహారం తినండి. మరియు మధ్య మధ్యలో పండ్లు స్నాక్స్ ఎప్పుడూ ఏదో ఒక ఆహారం తింటూ ఉండండి.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి:ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి

నెయ్యి, వెన్న, పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, పాలు, పెరుగు, పండ్లు, సలాడ్లు మొదలైనవి ఆహారంలో చేర్చండి.ఇది శరీరానికి శక్తిని పుష్కలంగా ఇస్తుంది. వీటిని నిరంతరం తీసుకోవడంతో, శరీర బరువు పెరగడం మొదలవుతుంది, శరీరం చురుకుగా మారుతుంది, చర్మం మెరిసిపోతుంది, ముఖం మీద రంగు కనిపించడం ప్రారంభమవుతుంది. శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

పాలు ఎక్కువగా తాగండిBMI-TELUGU

పాలు తాగాలి.పాలు అంటే వీలు అయినంత వరకు స్వచ్ఛమైన పాలను తీసుకోవడానికి ప్రయత్నించండి వీటితో పాటు ఒకటి లేదా రెండు అరటి పండ్లు తినండి దీనివల్ల శరీరానికి అధిక-నాణ్యత ప్రోటీన్ మరియు కేలరీలను పొందడానికి ఒక మంచి మార్గం.పాలు కొవ్వు, కాల్షియం మరియు విటమిన్ల గొప్ప మూలం.బరువు పెరగడానికి పాలు ఉత్తమమైన ఆహారం; అరటిపండ్లు, మామిడి పాలతో కలిపి రసం చేసుకుని చేసిన త్రాగవచ్చు. ఎండుద్రాక్ష మరియు బాదంపప్పులతో కలిపి కూడా రసం చేసుకుని త్రాగితే బరువు పెరగడానికి బాగా పనిచేస్తుంది

డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తినండిబాదం

బాదం, ఎండుద్రాక్ష,, జీడిపప్పు, పిస్తా, వేరుశెనగ మొదలైనవి మంచి కొవ్వులు, కార్బోహైడ్రేట్లు మరియు పోషక నిల్వలు వీటిలో ఉంటాయి ఇవి శరీర బరువును పెంచడంలో సహాయ పడతాయి అంతేకాకుండా కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది

మాంసం, చేపలు, గుడ్లు మరియు పప్పుధాన్యాలు మొదలైనవి ఎక్కువగా తినండి

మాంసం, చేపలు, గుడ్లు వీటిలో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది ఇది మీ శరీర కండరాలను పెంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది

మంచి నిద్రమంచి-నిద్ర-పొందండి

శరీరంలోని పాత కణాలను సరిచేయడానికి మరియు కొత్త కణాలను నిర్మించడానికి లోతైన మరియు సరైన నిద్ర తీసుకోవడం చాలా అవసరం. మంచి నిద్ర శరీరానికి తగినంత పోషకాహారం పొందడానికి సహాయపడుతుంది. కాబట్టి రాత్రి మరియు సూర్యోదయ సమయంలో నిద్రపోండి ప్రకృతి యొక్క అమూల్యమైన ఆరవదాన్ని ఆస్వాదించడానికి ముందు లేవండి.మీరు రాత్రి నిద్రపోకపోతే పగటిపూట కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు.

బరువు పెంచడానికి

తేలికపాటి వ్యాయామాలు చేయండిబరువులు-ఎత్తండి

(యోగా, వ్యాయామం మొదలైనవి) – శరీరంలో తీసుకున్న అదనపు కేలరీల పంపిణీ సరైనది, అవయవాలకు అనులోమానుపాతంలో బరువును పెంచండి, కడుపులోని కొవ్వు మాత్రమే కాదు, అందువల్ల సాయంత్రం నడవడం, బ్యాడ్మింటన్, ఆట, సైక్లింగ్ యోగా, ప్రాణాయం మొదలైనవి మంచి నివారణలుగా భావిస్తారు.ఇది కొలెస్ట్రాల్‌ను కూడా సరిగ్గా ఉంచుతుంది మరియు శరీర కండరాలు సరిగ్గా అభివృద్ధి చచెందుతాయ క్రమం తప్పకుండా వ్యాయామంలో చేయడం కండరాలను నిర్మించడానికి మరియు బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. మీరు ఎక్కువ కండరాలను పెంచుకున్నప్పుడు, మీరు భారీగా మరియు బలంగా ఉంటారు. ఇది ఆకలిని పెంచడానికి కూడా సహాయపడుతుంది.

ఒత్తిడిని నివారించండి

ఆందోళన శరీరాన్ని కాల్చివేస్తుంది అని అంటారు పెద్దలు .కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, ఆందోళన, ఒత్తిడి, ఉద్రిక్తత మీ నుండి దూరంగా ఉంచండి.దీనివల్ల ఆరోగ్యమైన ఆహారాలు తినాలనే కోరికను తగ్గిస్తుంది.

భోజనానికి ముందు మంచి నీళ్లు అసలా తాగవద్దునీరు-త్రాగాలి

భోజనానికి ముందు మంచి నీళ్లు అసలా తాగవద్దు.భోజనం చేసే ముందు మంచి నీళ్లు తాగితే మీ కడుపు నిండుగా ఉన్నట్లు అనిపించి ఎక్కువ ఆహారం తినడానికి కష్టం అవుతుంది మరియు తగినంత కేలరీలను మీ శరీరం తీసుకోవడానికి కష్టతరం చేస్తుంది.

ఎక్కువగా తినండి.మూడు పూటల భోజనంతో పాటు తరచుగా ఏదో ఒకటి తింటా ఉండండి (తీపి, డ్రై ఫ్రూట్స్, ప్రొటీన్లు ఎక్కువ ఉన్న నెయ్యితో చేసిన సున్నుండలు వంటివి తీసుకోండి.

తినే కంచాన్ని పెద్దగా

తినే కంచాన్ని పెద్దగా. మీరు ఎక్కువ కేలరీలు పొందడానికి ప్రయత్నిస్తుంటే ఖచ్చితంగా పెద్ద ప్లేట్లను వాడండి, ఎందుకంటే చిన్న ప్లేట్లు కొంచెం ఆహారం కూడా ఎక్కువగా ఆహారం ఉన్నట్లుగా కనిపిస్తుంది. కాబట్టి పెద్దగా ఉన్న ప్లేట్ లను ఉపయోగించండి.

క్రియేటిన్ తినండిcreatine

క్రియేటిన్ (creatine monohydrate) తీసుకోండి.ఇది మీ బరువు మరియు కండరాలు పెంచే సప్లిమెంట్ క్రియేటిన్ ఇది మనకి అమెజాన్ షాపింగ్ మాల్ లో దొరుకుతుంది ఇది తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా త్వరగా బరువు పెరగడానికి మీకు సహాయపడుతుంది.

ధూమపానం చేయవద్దు :

ధూమపానం చేయవద్దు.ధూమపానం చేసేవారు ధూమపానం చేయని వారి కంటే తక్కువ బరువు కలిగి ఉంటారు, మరియు ధూమపానం మానేయడం వలన త్వరగా బరువు పెరగడానికి సహాయపడుతుంది.

తాటి బెల్లం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు